న్యూఢిల్లీ: కర్ణాటక రెవిన్యూ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత ఆర్వీ దేశ్‌పాండే(71) వివాదంలో చిక్కుకున్నారు. ఆటగాళ్ల చేతికి స్పోర్ట్స్ కిట్లను అందించకుండా గాల్లోకి విసిరేసి పట్టుకోవాల్సిందిగా ఆయన సూచించారు. కర్ణాటకలో తన నియోజకవర్గం హలియాల్‌లో ఇండోర్ స్టేడియంను మంత్రి దేశ్‌పాండే బుధవారం ప్రారంభించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అథ్లెట్లకు క్రీడా కిట్లను అందించాల్సిందిగా నిర్వాహకులు దేశ్‌పాండేను వేదికపైకి ఆహ్వానించారు. ఆటగాళ్లందరినీ ముందుకు రావాల్సిందిగా కోరిన మంత్రి.. మహారాజు తరహాలో వేదిక నుంచి ఆటగాళ్లపైకి కిట్లను విసిరేశారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment