న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షుడు కొత్త కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఏడుగురు మంత్రులతో ఆప్ సర్కారు కొలువు దీరబోతోంది. అయితే కేజ్రీవాల్ టీమ్లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదు. ఊహించినట్టుగానే మనీష్ సిసోడియాకు ఉప ముఖ్యమంత్రి బెర్తు దాదాపు ఖరారు అయింది. ఇక ఏడుగురిలో నలుగురు కొత్త వాళ్లే.
ఈ జాబితాను శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు నివేదించినట్టు పార్టీ వర్గాల సమాచారం. సత్యేంద్ర జైన్, అసిఫ్ అహ్మద్, సందీప్ కుమార్లకు కేజ్రీవాల్ టీంలో చోటు లభించింది. కాగా గత కేబినెట్లో మంత్రులుగా ఉన్న సోమ్నాథ్ భారతీ, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, గిరీశ్ సోనీలకు ఈసారి చోటు దక్కలేదు. రామ్ నివాస్ గోయల్, బందన కుమారి ఇద్దరూ.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఆశిస్తున్నట్టు సమాచారం. కాగా ఆప్ నుంచి ఆరుగురు మహిళలు విజయం సాధించిన విషయం తెలిసిందే. గత వారంలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలిచి రికార్డు విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ టీంలో మహిళలకు దక్కని చోటు
Published Fri, Feb 13 2015 11:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM
Advertisement
Advertisement