పార్టీ కార్యాలయానికి చేరుకున్నకేజ్రీవాల్ | aap members to party office | Sakshi
Sakshi News home page

పార్టీ కార్యాలయానికి చేరుకున్నకేజ్రీవాల్

Published Tue, Feb 10 2015 8:19 AM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM

aap members to party office

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆప్ గెలుపుపై కొండంత విశ్వాసంతో ఉన్న కేజ్రీవాల్ మరోసారి హస్తిన పీఠం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం కచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని చాలావరకు ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు కూడా పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. తమ  గెలుపు ఖాయమని భావిస్తున్న ఆప్ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలను చేసుకునే ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.

 

హస్తినలో అధికారంపై కోటి ఆశలు పెట్టుకున్న బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిందేనని సర్వేలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement