triumph rally
-
కన్నడ ‘స్థానికం’లో కాంగ్రెస్ జోరు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం 2,662 స్థానాల్లో ఫలితాలు వెల్లడవగా.. కాంగ్రెస్ 982 స్థానాలను, బీజేపీ 929 స్థానాలను సాధించాయి. జేడీఎస్ 375 సీట్లలో గెలవగా.. ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు కలిసి 376 స్థానాల్లో ఇతరులు పాగా వేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల తేడా స్వల్పంగానే ఉంది. అయితే సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీఎస్‌తో కలిసి మెజారిటీ పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ)పై కాంగ్రెస్ పట్టుదక్కించుకోనుంది. 3 సిటీ కార్పొరేషన్లు, 29 సిటీ మునిసిపల్ కార్పొరేషన్లు, 52 పట్టణ మునిసిపాలిటీలు, 20 పట్టణ పంచాయతీల్లోని 2,709 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం కౌంటింగ్ అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం 2,662 స్థానాల్లో ఫలితాలను వెల్లడించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సొంత జిల్లా షిమోగాలో బీజేపీ పూర్తి ఆధిపత్యం కనబరచగా.. మిగిలిన చోట్ల నువ్వా, నేనా అన్నట్లుగానే పోటీ నెలకొంది. మొత్తం 29 నగర సభల్లో బీజేపీ 10 కార్పొరేషన్లను గెల్చుకోగా, కాంగ్రెస్‌కు 5, జేడీఎస్‌కు 3 దక్కాయి. మెజార్టీ ‘జేడీఎస్+కాంగ్రెస్’దే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన జేడీఎస్, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత పొత్తు కొనసాగుతుందని ముందుగానే ప్రకటించాయి. ఈ లెక్క ప్రకారం జేడీఎస్, కాంగ్రెస్‌ల కూటమి ఖాతాలో మొత్తం 1,357 స్థానాలు చేరాయి. దీంతో మెజారిటీ మునిసిపాలిటీల్లో బీజేపీ కన్నా ఈ కూటమిదే ఆధిపత్యం కానుంది. ‘బీజేపీకి అధికారం దక్కకుండా ఉండేందుకు అవసరమైన చోట సంకీర్ణంలో చేరేందుకు మేం సిద్ధమే’ అని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ పేర్కొన్నారు. ఇవి లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచి కాదన్నారు. ఈ ఎన్నికలను కన్నడ ప్రభుత్వం పనితీరుపై రెఫరెండంగా, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నంగా భావించారు. అయితే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అయ్యాయి. 2013 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ చాలా పుంజుకుంది. కర్ణాటకలో మొత్తం 4,976 యూఎల్బీ స్థానాలుండగా.. మిగిలిన 2,267 చోట్ల వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల వరదలతో అతలాకుతలమైన కొడగులో ఎన్నికలను వాయిదా వేశారు. విమర్శలకు చెంపపెట్టు: సీఎం ‘సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలున్నాయని, ప్రభుత్వం బలహీనంగా ఉందని, సర్కారు త్వరలోనే కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్న వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని సీఎం కుమారస్వామి పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ బలహీనపడిందని వస్తున్న విమర్శలకు ఈ ఫలితాలు సరైన సమాధానమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ వ్యాఖ్యానించారు. అయితే ఫలితాలు తమ పార్టీ ఊహించిన రీతిలో లేవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. అయితే ఓవరాల్‌గా చూస్తే ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ ఎన్నికల్లో 22, 23 స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రభావితం చేస్తాయ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం ఉండదన్నారు. విజయోత్సవ ర్యాలీపై యాసిడ్ దాడి స్థానిక సంస్థల ఫలితాల నేపథ్యంలో తుమకూరులో విజయం సాధించిన అభ్యర్థిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది ఆయన మద్దతుదారులతోపాటు దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. తుమకూరు వార్డు నంబర్ 16లో కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయతుల్లా ఖాన్ గెలిచారు. దీంతో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనంలో నుంచి ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ర్యాలీ వాహనంపై యాసిడ్ చల్లాడు. దీంతో ఇనాయతుల్లా ఖాన్ ముఖంపై గాయాలయ్యాయి. గాయపడిన ఆయన అనుచరులకూ వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందించారు. ఎన్నికల్లో ఖాన్ ప్రత్యర్థులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. -
పార్టీ కార్యాలయానికి చేరుకున్నకేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆప్ గెలుపుపై కొండంత విశ్వాసంతో ఉన్న కేజ్రీవాల్ మరోసారి హస్తిన పీఠం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం కచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని చాలావరకు ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు కూడా పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. తమ గెలుపు ఖాయమని భావిస్తున్న ఆప్ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలను చేసుకునే ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. హస్తినలో అధికారంపై కోటి ఆశలు పెట్టుకున్న బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిందేనని సర్వేలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఆప్ విజయోత్సవ ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకూలంగా ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విధానసభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న సంగతి విదితమే. లడ్డూల తయారీకి ఆర్డర్లివ్వడం, టపాసులు కొనడం, డోలు బుక్ చేసుకోవడం వంటి పనులలో పలువురు అభ్యర్థులు, కార్యకర్తలు బిజీగా ఉన్నారు. ఆప్ నేతల ఇళ్ల వద్ద ముఖ్యంగా మంత్రులయ్యే అవకాశం ఉన్న నేతల నివాసాల వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. పోలింగ్ తరువాత అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకే భారీ విజయమని వెల్లడించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. పార్టీ గెలుపు ఢిల్లీ ప్రజల గెలుపు అని, దానిని తన అత్యంత సహజశైలిలో జరుపుకుంటామని పార్టీ సీనియర్ నేతలు అంటున్నప్పటికీ కొందరు అభ్యర్థులు, కార్యకర్తలు ఫలితాలు వెలువడేరోజున వేడుకలు చేసుకోవడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న అభ్యర్థులు లడ్డూల తయారీకి కూడా ఆర్డరు ఇచ్చారు. పాత ఢిల్లీలోని ఓ వ్యాపారికి 100 కిలోల లడ్డూల తయారీకి ఆర్డరు లభించింది. డోలు కూడా బుక్ చేసుకున్నారు. కొందరు కార్యకర్తలు టపాసులు కొనుగోలు చేశారు. ఎన్నికలలో తమ పార్టీదే విజయమని తెలియడంతో ఆప్ నేతల ఇళ్ల వద్ద జనాలు గుమిగూడడం ప్రారంభించారు. ముఖ్యంగా మంత్రులయ్యే అవకాశం ఉన్న అభ్యర్థుల ఇళ్ల వద్ద కార్యకర్తల సందడి ఎక్కువగా ఉంది. గత ఆప్ సర్కారులో మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సోమ్‌నాథ్ భారతీ, రాఖీ బిర్లా, సౌరభ్ భర ద్వాజ్, గిరీష్ సోనీ మంత్రులుగా ఉన్నారు. ఈసారి ఆప్ ప్రభుత్వం ఏర్పాటైతే గోపాల్‌రాయ్‌తో పాటు ద్వారకా నుంచి పోటీచేసిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు అనిల్ శాస్త్రికి కూడా మంత్రి పదవులు దక్కే అవకాశముందని అంటున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 15న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అంటున్నారు. ఫలితాల తర్వాత ముఖచిత్రంపై చర్చ న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తమ పార్టీకి విజయం ఖాయమని తేలడంతో... ఎన్నికల్లో పార్టీ పనితీరును, ఫలితాల తర్వాత ఏర్పడే రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు విశ్లేషించుకుంటున్నారు.కౌశాంబి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆప్ అధినేత కేజ్రీవాల్...ఎన్నికల్లో బాగా పనిచేశారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రశంసించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఏర్పడే రాజకీయ ముఖచిత్రంపై ఆప్ ప్రచార కమిటీ అంచ నా వేసిందని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. సమావేశంలో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్ సింగ్, కుమార్ విశ్వాస్, అశిశ్ ఖేతాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరెస్టు వీరులకు గ్రాండ్ వెల్కం..
సాహసవీరులకు నగరం రెడ్‌కార్పెట్ అడుగడుగునా పూల జల్లు భారీ విజయోత్సవ ర్యాలీ సాక్షి,సిటీబ్యూరో: అతి పిన్నవయస్సులో అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లకు నగరం రెడ్‌కార్పెట్ పర్చింది. శంషాబాద్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టగానే అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. నినాదాలు, పూలు జల్లుతూ సాదరస్వాగతం పలికారు. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని ఎదిరించి ఎవరెస్టు శిఖరంపై భారతపతాకాన్ని ఎగురువేసిన సాంఘికసంక్షేమ గురుకుల విద్యార్థులైన తెలుగుతేజాలు ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి అభిమానులు, గురుకుల సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారిని అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపుబగ్గీలో ర్యాలీగా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడ్నుంచి డప్పుచప్పుళ్లతో భారీర్యాలీగా బయల్దేరారు. పాతబస్తీలో..: సాహసవీరులు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు పాతనగరంలో ఘనస్వాగతం లభించింది. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ గడ్డం సత్యనారాయణ ఆధ్వర్యంలో వారికి స్వాగతం పలికారు. ఫలక్‌నుమాలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై హరిజన, గిరిజన ఆదివాసుల అభివృద్ధి సంఘం నాయకులు జి.మోతీలాల్‌నాయక్, దేవేందర్‌నాయక్, రవినాయక్‌లు వారిని అభినందించారు. ప్రపంచ బాడీబిల్డర్ మోతేశ్యాంఅలీఖాన్ సాహసవీరులకు పూలమాలలువేసి సత్కరించారు. బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, అలియాబాద్ చౌరస్తా, లాల్‌దర్వాజా చౌరస్తా, చార్మినార్ వద్ద అభిమానులు, వివిధప్రజాసంఘాల నేతలు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మోజంజాహిమార్కెట్, గన్‌పార్క్, బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని రాజ్యాంగనిర్మాత విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా విజయాలు సాధిస్తాం గురుకుల, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ భోలక్‌పూర్: గురుకుల పాఠశాలల విద్యార్థుల విజ యాలు ఇది ఆరంభమేనని, ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయని గురుకుల, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఎవరెస్టు విజేతలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సన్మానం జరిగింది. దీనికి విచ్చేసిన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కడమే కాదని, విద్యలో కూడా అదేస్థాయిలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ను స్వారోబృందం యువకులు ఎత్తుకుని ఆనందంతో ఊరేగించారు. -
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
చేవెళ్ల, న్యూస్‌లైన్: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిషేధమని చేవెళ్ల డీఎస్పీ సీహెచ్ శ్రీధర్ పేర్కొన్నారు. చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ ప్రశాంతంగా సాగేలా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈనెల 20 వరకు ఎన్నికల కమిషన్ కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చేవారు ఎవరైనా సరే పాస్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ఉదయం 7 గంటలలోపే కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. 300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ట్రాఫిక్ మళ్లింపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేవెళ్ల సెగ్మెంట్ లోక్‌సభ, అసెంబ్లీ కౌంటింగ్ నిర్వహిస్తున్నందున ఈ దారిలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. శంకర్పల్లి నుంచి చేవెళ్లకు వచ్చే రహదారిలో ఎనికెపల్లి చౌరస్తా నుంచి ఊరెళ్లమీదుగా చేవెళ్లకు రావడానికి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు చెప్పారు. చేవెళ్ల నుంచి శంకర్పల్లి వెళ్లే వాహనాలను మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం పక్కనుంచి ఊరెళ్ల రోడ్డులో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని వాహన యజమానులు గమనించి సహకరించాలని కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం 144వ సెక్షన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయన్నారు. -
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
ముంబై: ఎన్నికల నియమావళి ఇంకా అమలులోనే ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ పోలీస్ కమిషనర్ ధనుంజయ్ కమలేకర్ తెలిపారు. ఆరు లోక్‌సభ స్థానాల లెక్కింపుకోసం కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సాయుధులైన ముంబై పోలీసులతోపాటు, పారా మిలటరీ బలగాలు, సీఆర్పీఎఫ్ బలగాలు కూడా భద్రతలో పాలుపంచుకుంటున్నాయి. లెక్కింపు కేంద్రాల దగ్గర మొదటి వరుసలో సీఆర్పీఎఫ్ బలగాలు, తరువాత రాష్ట్ర రిజర్వు పోలీసులు, ఆ తరువాత ముంబై పోలీసులు.. ఇలా మూడు అంచెల భద్రత ఉంటుంది. ఇదే కాకుండా నగరవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐదుగురు అదనపు పోలీస్ కమిషనర్లు, 22మంది డిప్యూటీ పోలీస్ కమిషనర్లు, 14 మంది అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, 67గురు ఎస్సైలు విధుల్లో పాల్గొంటున్నారు. నగర పోలీసులతోపాటు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్ర భద్రతా బలగాలు కూడా ఉంటాయి. లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అవాంతరాలు జరగకుండా వ్యూహాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఉత్తర ముంబై, ఉత్తర మధ్య ముంబై, వాయవ్య ముంబైల స్థానాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను గోరేగావ్ సబర్బన్‌లోని ముంబై ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసినట్టు, ఈశాన్య ముంబై స్థానానికి గాను విఖ్రోలీ సబర్బన్‌లోని ఉదయచల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాట్లు జరిగాయని కమలేకర్ వివరించారు. దక్షిణ మధ్య ముంబై స్థానానికి మాటుంగాలోని రూపరేల్ కాలేజీలో, దక్షిణ ముంబై స్థానానికి పరేల్‌లోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో లెక్కింపు జరుగుతుందని తెలిపారు. అన్ని కేంద్రాల్లో మూడంచెల భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి వాహనాలను నిలపవద్దని, పార్టీల మధ్య ఎలాంటి గొడవలు తలెత్తకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశామని పోలీసు అధికారి తెలిపారు. -
ఊరూరా.. ఉత్సవం
వరంగల్, న్యూస్‌లైన్ : అస్సోయ్‌దులా...జై తెలంగాణ అంటూ జనం దుంకాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో తెలంగాణవాదులు ర్యాలీ లతో హోరెత్తిస్తున్నారు. ప్రధాన సెంటర్లు జాతరను తలపిస్తున్నాయి. న్యాయవాదులు, డాక్టర్లు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల విజయోత్సవ ర్యాలీలతో జిల్లా దద్దరిల్లుతోంది. శుక్రవారం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్ఎల్డీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించా రు. కుంకుమ, రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. తీన్మార్ చప్పుళ్లకు ఆనందంతో స్టెప్పులేశారు. సోని యాగాంధీ, సుష్మాస్వరాజ్, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. హన్మకొండ, పరకాల. వరంగల్, జనగామ, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, మరిపెడల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. మిటాయిలు పంపిణీ చేసి ఆనందోత్సాహాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేశారు. ములుగురోడ్డులో విద్యుత్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చి న విద్యార్థులకు కాజీపేటలో ఘనస్వాగతం పలికారు. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద విద్యుత్ జేఏసీ, బీసీ జేఏసీ, సీపీఐ, వడుప్సా, లెక్చరర్ ఫోరం, యూనివర్సీటీ పీజీ కళాశాల విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు వందలాదిగా తరలివచ్చి ర్యాలీలతో హోరెత్తించారు. రెండు గంటలపాటు ఈ సెంటర్ తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది. పలు మండల కేంద్రాల్లో బీజేపీ, ప్రజాసంఘాల నాయకులు సంబురాలు జరుపుకున్నారు. కళాకారుల ఆటాపాటలు, డప్పుచప్పుళ్లతో ర్యాలీలు నిర్వహించారు. -
‘టీ’ ధూం ధాం
సాక్షి, ముంబై: బాంద్రా-ఖార్ తెలంగాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పశ్చిమఖార్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ బిల్లు ఆమోదం పొందడంపట్ల అంతా హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంటీజేసీ కన్వీనర్ దేవానంద్ నాగేల్ల, ఎబీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్, బోరివలిలోని బీజేపీ నాయకులు మేకల హన్మంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగానే కల నెరవేరిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. నగరంలో నివసించే తెలంగాణ వలసబిడ్డల కోసం రైలు, బస్సు సౌకర్యాలతోపాటు వారి పిల్లలు తెలుగు చదువుకునేందుకుగా అన్ని విధాలుగా సహకరించాలన్నారు. ఇక్కడ కూడా తెలంగాణ భవనం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు ప్రత్యేక తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరులతోపాటు తెలంగాణ బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన అన్ని రాజకీయ నాయకులకు, గతంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారందరికీ కృత/్ఞతలు తెలిపారు. బోరివలిలో ఆదివారం జరగనున్న తెలంగాణ విజయోత్సవ సభను అందరు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాంద్రా-ఖార్ తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షులు జెట్టా కృష్ణ, ప్రధాన కార్యదర్శి పిట్టల గణేశ్, పోతుల రాములు, దాసరి అంజయ్య, బాల్ల జంపయ్య, కె. రాంచంద్రం, వి. నర్సింలు, కె. బాబు, బి శ్రీనివాస్, కె.తిరుపతి, ఎ డేవిడ్, కె.ఉప్పలయ్య, నాగిరెడ్డి, సి.ఎం. చంద్రమౌళి, కుండె చంద్రమౌళి, జె.రామచందర్, టి.సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోరేగావ్‌లో పశ్చిమ గోరేగావ్‌లో రిలయన్స్ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కార్మికులంతా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అమరులను స్మరించుకుని జై తెలంగాణ అంటూ భారీఎత్తున నినదించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక సభ్యుడు శేఖర్ గ్యారా మాట్లాడుతూ ఇటువంటి సమయంలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్, ఆకుల భూమయ్య, కొండా లక్ష్మణ్‌బాపూజీ లేకపోవడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అంతా కలిసికట్టుగా తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రిలయన్స్ కార్మిక సమాఖ్య నాయకులు కావలి యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సంఘటితంగా పోరాడారని, తత్ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో తీవ్రవాదం పెరుగుతుందంటూ సమైక్య నాయకులు చెప్పే మాటలను తెలంగాణ ప్రజా సంఘం అధ్యక్షుడు విరమల్ల మల్లేశ్ ఖండించారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషిచేసిన వివిధ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలిగొండ అంజ య్య, బూడిద కిషన్, గాదే మల్లేశ్, ప్రేమనంద్, నర్సిరెడ్డి, వంగూరి సైదులు తదితరులు పాల్గొన్నారు. అంధేరీ పరిసరాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో అంధే రీ పరిసరాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. 10వ రోడ్డు, జుహూ గల్లీ, భరత్ నగర్, నెహ్రూనగర్ ప్రజలు బాణసంచా కాలుస్తూ, రంగులు చల్లుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బతకమ్మ ఆడుతూ పాటలు పాడారు. అనంతరం స్థానిక శివసేన నాయకుడు పరశురాములు పాటిల్ ఆధ్వర్యంలో కేక్ కోసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ముంబై ప్రాంత కార్యదర్శి నారాయణగౌడ్ మాట్లాడుతూ యువకుల ఆత్మబలిదానాలవల్ల ప్రస్తుత తెలంగాణ వచ్చిందన్నారు. ఈ విజయం తెలంగాణ అమరులకే అంకితమన్నారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మద్దెల సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ కిరణ్, జగన్. చంద్రబాబు, అశోక్‌బాబు... ఈ నలుగురు బాబులు కలసి తెలంగాణ ఏర్పాటు కాకుండా ఢిల్లీలో కుట్రలు, కుతంత్రాలు చేసి అడ్డుకునేందుకు యత్నించారని ఆరోపించారు. అయినప్పటికీ కేంద్రం... తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం టీఆర్ఎస్ ముంబై ప్రాంత ఉపాధ్యక్షుడు కన్నేస్వామి మాట్లాడుతు 60 ఏళ్ల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ కల నెరవేరింది. ఇది వారి త్యాగాల ఫలితమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు ఇస్తారి యాదయ్య, బండయ్య దేవేందర్, చంద్రశేఖర్, వెంకటేశం, ఎం. శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు. ఠాణేలో..... ఠాణేలోని వాఘ్లే ఎస్టేట్‌లో శ్రీ హనుమాన్ తెలుగు సేవా మండల్ తరపున తెలంగాణ ప్రజలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక తెలంగాణ వాసులు అత్యధిక సంఖ్యలో పాల్గొని బాణా సంచా కాలుస్తూ రంగులు చల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాలు మెట్ల బాలస్వామి ఆధ్వర్యంలో జరిగాయి. బాంద్రాలో ‘జల్లోష్’ తెలంగాణ బిల్లు గురువారం రాజ్యసభలో మంజూరైన శుభసందర్భాన్ని పురస్కరించుకుని బాంద్రాలోని రిలయన్స్ కంపెనీ ప్రాంగణంలో తెలంగాణావాదులు ‘జల్లోష్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళాక్షి సోషల్ అండ్ కల్చరల్ ఫౌండేషన్, రిలయన్స్ ఎనర్జీ తెలంగాణ కార్మిక సమాఖ్యలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు కె.నర్సింహగౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల పోరాటమేనంటూ కొనియాడారు. అనంతరం మంగళాక్షి సంస్థ ప్రధాన కార్యదర్శి సరిపంగి రవీందర్ మాట్లాడుతూ గత పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఎట్టకేలకు వారు తెలంగాణ ప్రజల ఒత్తిడివల్ల దారికి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మంగళాక్షి సంస్థ కార్యకర్తలు కొమ్ము అంజయ్య, నర్సపెల్లి మధుసూదన్, నల్లా శంకర్, సరిపంగి మల్లేశ్, సమాఖ్య నాయకులు పాలకూరి యాదయ్య, పెద్దురి శ్రీధర్, జనార్దన్, ఎన్.రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ జీఎం మహేంద్ర చవాన్, డీజీఎం పాండురంగ్ కాలేకర్లు పాల్గొని కార్మికులకు మిఠాయిలు పంచారని నర్సింహగౌడ్ చెప్పారు. త్యాగాల ఫలితమే తెలంగాణ: బద్ది ప్రపంచంలో ప్రాణానికన్నా విలువైనదేదీ లేదని, అలాంటి ప్రాణాలను తెలంగాణ రాష్ట్రం కోసం ధారపోసిన యు వకులు నిజంగా అమరులని టీఆర్ఎస్ ముంబై అధ్యక్షుడు బద్ది హేమంత్‌కుమార్ ఉద్ఘాటించా రు. తెలంగాణ బిల్లు రాజ్యసభలో మంజూరు కావడంతో టీఆర్ఎస్ నాయకులు చెంబూర్నాకావద్ద గురువారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హేమంత్‌కుమార్ మాట్లాడుతూ దాదాపు 15వందల యువకుల త్యాగాలకు ఫలితమని, 13 సంవత్సరాల కేసీఆర్ ఉద్యమం కారణంగా ఇప్పటికి తెలంగాణ ఆసన్నమైందన్నారు. టీజేఏసీ, టీజీఓ, టీఎన్జీఓ, ప్రజా సంఘాల పోరాటం, ఎంపీలు వివేకానంద్, జగన్నాథం, కె.కె. తదితరులు టీఆర్ఎస్లో చేరడంవల్ల తెలంగాణ సాధ్యమైంది. సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఈ సంబరాల్లో టీఆర్ఎస్ ముంబై ప్రధాన కార్యదర్శి బోలె శివరాజ్, టీఆర్ఎస్ చెంబూర్ కార్మిక శాఖ అధ్యక్షుడు చంద్రాగౌడ్, నాయకులు సాంబయ్య, సుంకే అంజయ్య, శ్రీనివాస్, ఎ. రమేష్, లక్ష్మీబాయి, ఎంటీజేఏసీ కన్వనర్ ఎన్.దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. కాగా గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు హేమంత్‌కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. -
హోరెత్తిన ఇందూరు
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేయడం జిల్లా ప్రజలను సంబురం లో ముంచింది. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదముద్ర వేయడంతోనే అన్ని పార్టీలు, జేఏసీలు ర్యా లీలు తీస్తూ టపాకాయలు కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశాయి. జిల్లా కేం ద్రంలో శుక్రవారం ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రగతిభవన్ ముందు ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. అంతకు ముందు ఉద్యోగులు టీఎన్జీవోస్ భవనం నుంచి ర్యాలీ తీశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కేంద్రం అతి త్వరగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని ఉద్యోగ జేఏసీ చైర్మన్ గైని గంగారాం అన్నారు. మహిళ ఉద్యోగులు ఈ సంబురాల్లో పాలుపంచుకున్నారు. బీజేపీ నాయకులు గాంధీచౌక్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగఫలితం రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిందని వారు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో పవర్‌హౌజ్‌లో టపాకాయలు కాలుస్తు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు లో న్యాయవాదులు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. టీఆర్ఎస్ అర్బన్ ఇన్చార్జి బస్వలక్ష్మినర్సయ్య ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినాయక్‌నగర్‌లోని జై జై వినాయక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి వి గ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకున్నారు. కాలనీవాసులు అందరు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వచ్చి జై తెలంగాణ అం టూ నినాదాలు చేశారు. డిచ్పల్లి మండల కేం ద్రంలో టీఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి భూపతిరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ధర్పల్లి, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా టపాకాయలు కాల్చి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కాల్చారు. మండల కాం గ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ తీశారు. కామారెడ్డిలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాకాయలు కాల్చారు. కామారెడ్డిలో బీజేపీ నాయకులు తెలంగాణ అమరవీరుడు కిష్టయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. మోర్తాడ్‌లో సహకార సంఘంలో స్వీట్లు పంపిణీ చేశారు. కమ్మర్‌పల్లిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లో స్వీట్లు పంచి, టపాకాయలు కాల్చారు. జుక్కల్‌లో టీఆర్ఎస్, జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. ఎల్లారెడ్డిలో న్యాయవాదులు కోర్టులో సంబురాలు చేశారు. బీజేపీ నాయకుడు బాణాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. టీఆర్ఎస్, జేఏసీ నాయకులు టపాకాయలు కాల్చారు. భిక్కనూరు గ్రామం లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. ఆర్మూర్‌లోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిం చారు. మాక్లూర్ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో విజయెత్సవ ర్యాలీలు నిర్వహించా రు. బోధన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఏబీవీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నా రు. తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నవీపేట, రెంజల్, ఎడపల్లిలో టీడీపీ, టీఆర్ఎస్, జేఏసీ లు, కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ లు నిర్వహించారు.