కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేయడం జిల్లా ప్రజలను సంబురం లో ముంచింది. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదముద్ర వేయడంతోనే అన్ని పార్టీలు, జేఏసీలు ర్యా లీలు తీస్తూ టపాకాయలు కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశాయి. జిల్లా కేం ద్రంలో శుక్రవారం ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రగతిభవన్ ముందు ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. అంతకు ముందు ఉద్యోగులు టీఎన్‌జీవోస్ భవనం నుంచి ర్యాలీ తీశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కేంద్రం అతి త్వరగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని ఉద్యోగ జేఏసీ చైర్మన్ గైని గంగారాం అన్నారు.
మహిళ ఉద్యోగులు ఈ సంబురాల్లో పాలుపంచుకున్నారు. బీజేపీ నాయకులు గాంధీచౌక్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగఫలితం రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిందని వారు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో పవర్‌హౌజ్‌లో టపాకాయలు కాలుస్తు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు లో న్యాయవాదులు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. టీఆర్‌ఎస్ అర్బన్ ఇన్‌చార్జి బస్వలక్ష్మినర్సయ్య ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినాయక్‌నగర్‌లోని జై జై వినాయక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి వి గ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకున్నారు. కాలనీవాసులు అందరు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వచ్చి జై తెలంగాణ అం టూ నినాదాలు చేశారు. డిచ్‌పల్లి మండల కేం ద్రంలో టీఆర్‌ఎస్ నియోజక వర్గ ఇన్‌చార్జి భూపతిరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ధర్పల్లి, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్‌ఎస్ నాయకులు వేరువేరుగా టపాకాయలు కాల్చి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కాల్చారు. మండల కాం గ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ తీశారు. కామారెడ్డిలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాకాయలు కాల్చారు. కామారెడ్డిలో బీజేపీ నాయకులు తెలంగాణ అమరవీరుడు కిష్టయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. మోర్తాడ్‌లో సహకార సంఘంలో స్వీట్లు పంపిణీ చేశారు.
కమ్మర్‌పల్లిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లో స్వీట్లు పంచి, టపాకాయలు కాల్చారు. జుక్కల్‌లో టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. ఎల్లారెడ్డిలో న్యాయవాదులు కోర్టులో సంబురాలు చేశారు. బీజేపీ నాయకుడు బాణాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు టపాకాయలు కాల్చారు. భిక్కనూరు గ్రామం లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. ఆర్మూర్‌లోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిం చారు. మాక్లూర్ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో విజయెత్సవ ర్యాలీలు నిర్వహించా రు. బోధన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఏబీవీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నా రు. తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నవీపేట, రెంజల్, ఎడపల్లిలో టీడీపీ, టీఆర్‌ఎస్, జేఏసీ లు, కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ లు నిర్వహించారు.
హోరెత్తిన ఇందూరు
Published Sat, Oct 5 2013 5:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement