2015 సాహిత్య అకాడమీ అవార్డులను.. సంస్థ గురువారం ప్రకటించింది. 22 భాషలకు చెందిన సుప్రసిద్ద రయయితలకు అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది అవార్డుల కోసం 6 కథల సంపుటాలు, 6 కవిత్వం గ్రంధాలు, 4 నవలలు, 2 వ్యాస సంకలనాలు, 2 విమర్శనా గ్రంధాలు, ఒక నాటకం, ఒక ఆత్మకథ పుస్తకాన్ని ఎంపిక చేశారు.
దేశపు అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపికైన కలం వీరులు వీరే.. కుల సైకియా ( అస్సామీ), భ్రజేంద్ర కుమార్ భ్రమ్మ(బోడో), ధియన్ సింగ్(డోగ్రీ), సైరస్ మిస్రీ(ఇంగ్లీషు), రసిక్ షా( గుజరాతీ), రామ్ దర్శన్ మిశ్రా(హిందీ), కేవీ తిరుమలేష్(కన్నడ), బషీర్ బదర్వాహీ(కష్మీరీ), ఉదయ్ భీంబ్రే(కొంకణి), మన్మోహన్ ఝా(మైథిలి), కే.ఆర్. మీరా(మళయాలం), క్షేత్రీ రాజన్(మణిపురి), అరుణ్ ఖోప్కర్ (మరాఠీ), గుప్తా ప్రధాన్(నేపాలి), బిభూతీ పట్నాయక్(ఒడియా), జస్విందర్ సింగ్(పంజాబీ), మధు ఆచార్య 'అశ్వధి' (రాజస్థానీ), రాం శంకర్ అశ్వథి(సంస్కృతం), రబిలాల్ తుడు(సంథాలీ), మాయా రాహి(సింధీ), ఏ. మాధవన్(తమిళ్), ఓల్గ(తెలుగు), షమీమ్ తారిక్ (ఉర్దూ).
కాగా.. బెంగాలీ భాషకు సంబంధించిన అవార్డు త్వరలోనే ప్రకటించనున్నారు. విజేతలకు జ్ఞాపికతో పాటు, లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని అందిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు పురస్కారాలను అందిచనున్నట్లు అకాడమీ ప్రకటించింది.
సాహిత్య అకాడమీ అవార్డీలు వీరే..
Published Thu, Dec 17 2015 5:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM
Advertisement