'దేశమేమి వణకదు.. ముందు నోరు విప్పు' | Khadse's words won't shake country, but BJP: NCP | Sakshi
Sakshi News home page

'దేశమేమి వణకదు.. ముందు నోరు విప్పు'

Published Sat, Jul 2 2016 11:08 AM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

'దేశమేమి వణకదు.. ముందు నోరు విప్పు' - Sakshi

'దేశమేమి వణకదు.. ముందు నోరు విప్పు'

ముంబయి: తాను నోరు విప్పితే దేవం వణుకుద్ది అంటూ వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే వెంటనే ఆ పని చేయాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చెప్పింది. ఆ నిజాలేమిటో వెంటనే ప్రజలకు తెలియజేయాలని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ శనివారం మీడియాతో అన్నారు.  నెల క్రితం వరకూ మహారాష్ట్ర సర్కారులో మంత్రిగా పనిచేసి, ఆరోపణల కారణంగా పదవికి రాజీనామా చేసిన ఏక్ నాథ్ ఖడ్సే గురువారం తాను గొంతు విప్పితే భారతదేశం మొత్తం గజగజ వణుకుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత నవాబ్ స్పందిస్తూ 'తాను నోరు విప్పితే దేశం వణికిపోద్ది అంటూ ఖడ్సే వ్యాఖ్యలు చేశారు. అతడు వెంటనే నోరు విప్పితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అతడు నోరు విప్పితే వణికేది దేశం కాదు.. బీజేపీ. నాకు తెలిసి బీజేపీలోనే అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఒక వేళ నువ్వు (ఖడ్సే) అండర్ వరల్డ్ డాన్ దావూద్ తో మాట్లాడి ఉండి ఆ విషయాలు నీ పార్టీ నాయకులకు చెబితే ఆ నిజాలేమిటో బయటకు చెప్పు. నీకు తెలిసిన విషయాలేమిటో నువ్వు కచ్చితంగా బయటపెట్టాలి' అని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement