khadse
-
కాలేజీకి వెళ్లొస్తుంటే లాగేసి ‘ఐ లవ్ యూ’..
ముంబయి: నలుగురిలో ఓ యువతి చేయిపట్టిలాగినందుకు 22 ఏళ్ల వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడింది. లైంగికపరమైన నేరాల నుంచి బాలికలకు ప్రత్యేక రక్షణ కల్పించే చట్టం(పోస్కో యాక్ట్) ద్వారా అతడికి ఈ శిక్ష ఖరారైంది. అయితే, నిత్యం అతడు ఆ యువతిని అనుసరిస్తూ చెడుగా ప్రవర్తించేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడంటూ చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయినందున ఆ ఆరోపణలు మాత్రం కోర్టు కొట్టేసింది. అలాగే, అతడిపై కేసు నమోదైన అక్టోబర్ 29, 2015 నుంచి బెయిల్ పొందిన అక్టోబర్ 19, 2016వరకు జైలులోనే గడిపాడు. తాజాగా కోర్టు కూడా ఏడాదికాలం మాత్రమే శిక్ష వేయడంతో అతడి శిక్షకాలం దాదాపు పూర్తయినట్లు ప్రకటించే అవకాశం ఉంది. కోర్టు విచారణ ప్రకారం 2015 అక్టోబర్ 6న ఖడ్సే అనే యువకుడు 16 ఏళ్ల యువతి తన స్నేహితురాలితో కలిసి కాలేజీకి వెళ్లొస్తుండగా మధ్యలో వారిని అడ్డుకున్నాడు. ఆమెతో పలు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడుతూనే అనూహ్యంగా ఆమె చేయి పట్టిలాగి ‘ఐ లవ్ యూ’ అనేశాడు. దీంతో ఏడ్చుకుంటూ ఆ అమ్మాయి ఇంటికెళ్లింది. స్నేహితురాలు ఆమె తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో వారు వెళ్లి ఖడ్సే తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పి మందలించే ప్రయత్నం చేశారు. అయినా.. వాళ్లు వినకుండా ఎదురుతిరిగిన పరిస్థితి ఎదురవ్వడంతో భయాందోళనకు గురైన ఆ యువతి కాలేజీకి వెళ్లడం మానేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విచారణను నెమ్మదిగా చేసిన పోలీసులపై కోర్టు అక్షింతలు వేసింది. -
'దేశమేమి వణకదు.. ముందు నోరు విప్పు'
ముంబయి: తాను నోరు విప్పితే దేవం వణుకుద్ది అంటూ వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే వెంటనే ఆ పని చేయాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చెప్పింది. ఆ నిజాలేమిటో వెంటనే ప్రజలకు తెలియజేయాలని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ శనివారం మీడియాతో అన్నారు. నెల క్రితం వరకూ మహారాష్ట్ర సర్కారులో మంత్రిగా పనిచేసి, ఆరోపణల కారణంగా పదవికి రాజీనామా చేసిన ఏక్ నాథ్ ఖడ్సే గురువారం తాను గొంతు విప్పితే భారతదేశం మొత్తం గజగజ వణుకుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత నవాబ్ స్పందిస్తూ 'తాను నోరు విప్పితే దేశం వణికిపోద్ది అంటూ ఖడ్సే వ్యాఖ్యలు చేశారు. అతడు వెంటనే నోరు విప్పితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అతడు నోరు విప్పితే వణికేది దేశం కాదు.. బీజేపీ. నాకు తెలిసి బీజేపీలోనే అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఒక వేళ నువ్వు (ఖడ్సే) అండర్ వరల్డ్ డాన్ దావూద్ తో మాట్లాడి ఉండి ఆ విషయాలు నీ పార్టీ నాయకులకు చెబితే ఆ నిజాలేమిటో బయటకు చెప్పు. నీకు తెలిసిన విషయాలేమిటో నువ్వు కచ్చితంగా బయటపెట్టాలి' అని డిమాండ్ చేశారు. -
'నేను నోరు తెరిస్తే.. దేశం వణుకుద్ది'
ముంబై: నెల క్రితం వరకూ మహారాష్ట్ర సర్కారులో మంత్రిగా పనిచేసి, ఆరోపణల కారణంగా పదవికి రాజీనామా చేసిన ఏక్ నాథ్ ఖడ్సే గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాను గొంతు విప్పితే భారతదేశం మొత్తం గజగజ వణుకుతుందన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి, శివసేనతో పార్టీ కలవడానికి తానే కారణమని చెప్పారు. లేకపోతే సేనకు చెందిన నాయకుడే రాష్ట్రంలో సీఎం అయ్యేవారని అన్నారు. అండర్ వరల్డ్ డాన్, ప్రస్తుతం పాకిస్తాన్ లో నివసిస్తున్న దావూద్ ఇబ్రహీం నుంచి ఫోన్ కాల్స్, ల్యాండ్ డీల్స్ తదితర వివాదాల్లో ఖడ్సే చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు ఒత్తిడి పెంచడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. కాగా, ఖడ్సేకు దావూ్ద్ తో ఎప్పటినుంచో సంబధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశాన్ని వణికించే సమాచారం తన వద్ద ఉందని చెబుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్సీపీ, కాంగ్రెస్ ల అధికార ప్రతినిధులు ఖడ్సేను వెంటనే కస్టడీకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఖడ్సే ఓ దేశద్రోహి:అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దావుద్ ఇబ్రహీంతో సంభాషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ మంత్రి ఎక్నాథ్ ఖడ్సే ఒక దేశద్రోహి అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అదే సమయంలో దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాటిదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు హార్దిక్ పటేల్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయకపోయినప్పటికీ హార్దిక్ పటేల్ దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కానీ దావుద్ ఇబ్రహీంతో ఖడ్సే మాట్లాడినట్లు కాల్ రికార్డులు దొరికినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. హార్దిక్ పటేల్ ఏ విధంగా దేశదోహి? దేశద్రోహులు ఖడ్సే లాంటి నాయకులే అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీటర్లో శనివారం వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు. హార్దిక్‌పై దేశద్రోహం కింద అభియోగాలు మోపటంపై గుజరాతీయులు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. లక్షలాది గుజరాతీయుల గొంతును మాత్రమే ఆయన వినిపించారని చెప్పారు.పటేల్‌ను దేశద్రోహి అంటే గుజరాతీయులందర్నీ అన్నట్లేనన్నారు.