ఖడ్సే ఓ దేశద్రోహి:అరవింద్ కేజ్రీవాల్
Published Sat, Jun 4 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
న్యూఢిల్లీ: దావుద్ ఇబ్రహీంతో సంభాషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ మంత్రి ఎక్‌నాథ్ ఖడ్సే ఒక దేశద్రోహి అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అదే సమయంలో దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాటిదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు హార్దిక్ పటేల్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయకపోయినప్పటికీ హార్దిక్ పటేల్ దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కానీ దావుద్ ఇబ్రహీంతో ఖడ్సే మాట్లాడినట్లు కాల్ రికార్డులు దొరికినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
హార్దిక్ పటేల్ ఏ విధంగా దేశదోహి? దేశద్రోహులు ఖడ్సే లాంటి నాయకులే అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీటర్‌లో శనివారం వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు. హార్దిక్‌పై దేశద్రోహం కింద అభియోగాలు మోపటంపై గుజరాతీయులు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. లక్షలాది గుజరాతీయుల గొంతును మాత్రమే ఆయన వినిపించారని చెప్పారు.పటేల్‌ను దేశద్రోహి అంటే గుజరాతీయులందర్నీ అన్నట్లేనన్నారు.
Advertisement