న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకం కోసం రూపొందిస్తున్న కొలీజియం వ్యవస్థలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని చేర్చటం వల్ల న్యాయ స్వతంత్రతకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో న్యాయవ్యవస్థపై జరిగిన ఓ కార్యక్రమంలో.. మాజీ న్యాయశాఖ మంత్రి కూడా అయిన శాంతి భూషణ్ మాట్లాడుతూ.. ‘కొలీజియంలో న్యాయమంత్రిని చేర్చటం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు. ఐదుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులున్న కొలీజియంలో మంత్రి ఒక్కడే ఏం చేయగలరు? మీ ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఆయనకుంటుందా? దీని వల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని నేననుకోవటం లేదు’ అని అన్నారు. 1950-60 నాటి రాజకీయ నాయకులు ఇప్పుడు లేరని.. అందువల్ల న్యాయవ్యవస్థే పలు అంశాల్లో బాధ్యత తీసుకోవాలని శాంతి భూషణ్ సూచించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉన్నత వర్గానికి చెందిన వారుండటం వల్ల మిగిలిన వెనకబడిన, మైనారిటీ వర్గాలకు న్యాయం జరగటం లేదని జాతీయ జ్యుడిషియల్ అకాడమీ మాజీ డెరైక్టర్ మోహన్ గోపాల్ అన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత లోపిస్తోందని సీపీఐ నేత నీలోత్పల్ బసు అభిప్రాయపడ్డారు.
కొలీజియంలో న్యాయమంత్రి ఉంటే తప్పేంటి?
Published Fri, Sep 2 2016 1:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
Advertisement