Law ministry
-
హోం వర్క్ చేయకుంటే గోడకుర్చీ వేయిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘సార్.. నేను హోంవర్క్ చేయకుంటే మా టీచర్ నన్ను గోడకుర్చీ వేయించవచ్చా? పిల్లలను కొట్టే తల్లిదండ్రులపై కేసు పెట్టవచ్చా? నేను సొంతింట్లో మరుగుదొడ్డి నిర్మించాలనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహాయం అందుతుంది? అదెలా పొందాలి? ప్రేమికుడి దగ్గరకి వెళ్లాలనుకుంటున్నాను. వివాహమైన నెల రోజులకు విడాకులు సాధ్యమేనా?’పెళ్లైన 30ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవచ్చా?.. ఇలాంటి విచిత్ర ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ టెలీ–లా పోర్టల్‌కు పోటెత్తాయి. న్యాయ సలహాల కోసం ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోర్టల్‌ను ఆశ్రయించారు. ఇలాంటి ప్రశ్నలు అడిగిన వారిలో 12 ఏళ్ల మైనర్ల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉండటం విశేషం. గత సంవత్సరం పోర్టల్‌ను ఆశ్రయించిన వారి సంఖ్య కోటి దాటడం గమనార్హం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 19 లక్షల మంది పోర్టల్‌ను ఆశ్రయించారు. ఎక్కువ మందితో ఉత్తర్‌ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షలకు పైగా, తెలంగాణలో రెండు లక్షలకు పైగా వ్యక్తులు టెలి–లాను ఆశ్రయించారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా న్యాయపరమైన హక్కులపై ప్రజలకు అవగాహన కలి్పంచి వారికి న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘టెలి–లా’పోర్టల్‌ను ప్రారంభించిన విషయం విదితమే. ఈ పోర్టల్‌కు పౌరుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అత్యంత తీవ్రమైన సమస్యలతో పాటు అసంబద్ధమైన విషయాలపైనా న్యాయ సలహాలు కోరుతున్నారు. దీని ద్వారా.. కొన్ని చోట్ల పిల్లలపై జరుగుతున్న తీవ్రమైన నేరాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు సైతం పోర్టల్ అందుకుంది. న్యాయ సలహాలే కాకుండా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా ‘టెలి–లా’పోర్టల్‌ను పెద్దసంఖ్యలో పౌరులు ఆశ్రయించి తగు సూచనలు, సలహాలు పొందారు. ఈ పోర్టల్ ద్వారా అన్ని రకాల చట్టపరమైన సమస్యలపై లీగల్ సర్విసెస్ అథారిటీకి చెందిన న్యాయవాదులు సంప్రదింపులు, సహాయంతోపాటు దిశానిర్దేశం చేస్తారు. 2024 డిసెంబర్ 31 నాటికి వివిధ రాష్ట్రాల నుండి 1,06,18,641 మంది న్యాయ సలహా కోసం పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 1,0492,575 మందికి న్యాయ సహాయం, సంప్రదింపులు కూడా అందించారు. ‘టెలి–లా’ను ఆశ్రయించిన టాప్ ఐదు రాష్ట్రాల్లో యూపీ తొలిస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 1,902,911 మంది ఆశ్రయించగా 1,888,805 మంది సలహాలు పొందారు. మధ్యప్రదేశ్‌లో 1,126,681 మంది పోర్టల్‌ను ఆశ్రయించగా 1,125,191 మంది సలహాలు పొందారు. మహారాష్ట్ర నుంచి 838,214 మంది ఆశ్రయించగా 834,149 మంది సలహాలు పొందారు. జమ్మూకశ్మీర్ నుంచి 694,208 మంది ఆశ్రయించగా 687,375 మంది సలహాలు పొందగలిగారు. రాజస్థాన్ నుంచి 650,980 మంది ఆశ్రయంగా పొందారు. వీరిలో 646,394 మందికి లాయర్లు సలహాలు ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక నుంచి 401,838 మంది టెలి–లా పోర్టల్‌ను ఆశ్రయించగా 369,859 మంది సలహాలు అందాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 341,884 మంది పోర్టల్‌ను ఆశ్రయించగా 341,424మంది సలహాలు పొందారు. తెలంగాణ నుంచి 300,171 మంది ఆశ్రయించారు. వీరిలో 294,977 మందికి న్యాయవాదులు సలహాలు ఇచ్చారు. తమిళనాడు నుంచి 286,107 మంది ఆశ్రయంగా పొందగా 284,408 మంది సలహాలు పొందారు. కేరళ నుంచి 40,746 మంది పోర్టల్‌ను సలహాలు, సూచనలు అడగ్గా 36,891 మందికి సలహాలు ఇచ్చారు. -
పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే పవర్ ఇవ్వండి: ఈసీ
న్యూఢిల్లీ : అవినీతి కార్యకలాపాల్లో ప్రమేయమున్న గుర్తింపులేని రాజకీయ పార్టీల ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నడుం బిగించింది. అలాటి రాజకీయ పార్టీలను రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు కల్పించాలంటూ న్యాయశాఖకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఎన్నికల సంఘానికి ఒక పార్టీని రిజిస్టర్ చేసే అధికారమే ఉంది తప్ప, దానిని రద్దు చేసే అధికారం లేదు. తామరతంపరగా ఎన్నో రాజకీయ పార్టీలు రిజస్టర్ అవుతున్నా చాలా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే దాఖలాలు లేవని, అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమై పోతున్నాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. అందుకే ప్రజాప్రతినిధ్య చట్టం ద్వారా తమకు ఇలాంటి రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా 2,800 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇవికాకుండా.. ఎనిమిది జాతీయ పార్టీలకు, 50 ప్రాంతీయ పార్టీలకు ఈసీ గుర్తింపు ఉంది. చదవండి: ఢిల్లీ.. ఆ మంటలు ఆర్పేసింది మనిషి కాదు -
రేప్ కేసులకు ‘ఫాస్ట్‌ట్రాక్’
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న అత్యాచార కేసులను విచారించేందుకు అక్టోబర్ 2 నుంచి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు కేంద్ర న్యాయ శాఖ సిద్ధం అవుతోంది. మొత్తం 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి రూ.767.25 కోట్లు ఖర్చవుతుందని న్యాయ విభాగం పేర్కొంది. అందులో నిర్భయ నిధుల కింద కేంద్రం నుంచి రూ. 474 కోట్లు మంజూరు కానున్నాయి. ఆర్థిక సంఘం ఖర్చుల వివరాలను ప్రతిపాదించిన తర్వాత దాన్ని ఆర్థిక మంత్రి దగ్గరకు పంపనున్నామని, న్యాయవిభాగం ఈ నెల 8న కేబినేట్ సెక్రెటేరియట్‌కు రాసిన లేఖలో తెలిపింది. దీనితోపాటే అక్టోబర్ 2 నుంచి ఈ కోర్టులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. మొదటి దశలో 9 రాష్ట్రాల్లో 777 కోర్టులు ఏర్పాటు చేస్తామని, రెండో దశలో 246 కోర్టులు ఏర్పాటు చేస్తామని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే. -
హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమిస్తూ మరో ఉత్తర్వు విడుదల చేసింది. వీరికి పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగొయ్, జస్టిస్ బాబ్దే, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడంతో వాటికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో నోటిఫికేషన్ జారీ అయింది. జస్టిస్ రామసుబ్రమణియన్కు గురువారం హైకోర్టు వీడ్కోలు పలకనుంది. ఈ నెల 22న సీజేగా జస్టిస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. జస్టిస్ చౌహాన్ నేపథ్యం... జస్టిస్ చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలో ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల కలకత్తా హైకోర్టుకి బదిలీ అయ్యారు. దీంతో జస్టిస్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. జస్టిస్ రామసుబ్రమణియన్ నేపథ్యం... జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సినీయర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్.మణిల వద్ద న్యాయవాద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తర్వాత కేంద్రం ఆయన్ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. ఇప్పుడు పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఏపీలో క్షిపణి పరీక్ష కేంద్రానికి గ్రీన్ సిగ్నల్..!
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్రం ఏర్పాటుకు న్యాయశాఖ నుంచి పూర్తి అనుమతులు వచ్చినట్లు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో పర్యావరణ శాఖ నుంచి కూడా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి అనుమతులు రానున్నాయని వెల్లడించారు. మొత్తం 1600 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు మరో మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం శుంకుస్థాపన చేయనుంది. కాగా, క్షిపణి ప్రయోగాల్లో అగ్రదేశాలకు ధీటుగా దూసుకుపోతున్న భారత్‌లో ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో అబ్దుల్ కలాం క్షిపణి ప్రయోగ కేంద్రం ఒక్కటే ఉండడం విశేషం. -
పీఎన్బీ స్కాం : ప్రధాని కీలక ఆదేశాలు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు-నీరవ్ మోదీ కుంభకోణం కేసులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ఆదేశాలు జారీచేశారు. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు నరేంద్రమోదీ ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ కేసును పరిష్కరించడం కోసం ప్రధానమంత్రి కార్యాలయంతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా చెప్పారు. ఈ మోసంలో ప్రధాన సూత్రదారుడైన నీరవ్ మోదీని కచ్చితంగా శిక్షించనున్నామని, ఆయనను భారత్ తిరిగి రప్పించడంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. ''ప్రధానమంత్రి ఆఫీసుతో ఆర్థికమంత్రిత్వ శాఖ చర్చిస్తుంది. పీఎంఓ ఏం నిర్ణయిస్తే, అదే ఆర్థిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది'' అని శుక్లా తెలిపారు. రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన్ను తిరిగి వెనక్కి రప్పించడానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అంతేకాక ఆయనకు చెందిన పలు ఆస్తులను, షోరూంలను, వజ్రాలను, బంగారాన్ని కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. నేడు కుంభకోణం జరిగిన పీఎన్బీ ముంబై బ్రాంచును సైతం సీబీఐ సీజ్ చేసింది. నీరవ్ మోదీ ఫైర్‌స్టార్ డైమాండ్ కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విపుల్ అంబానీని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మూడు, నాలుగేళ్ల నుంచి విపుల్ అంబానీ ఈ స్థానంలో ఉన్నట్టు తెలిసింది. కుంభకోణంలో భాగమైన బ్యాంకు అధికారులు గోకుల్‌నాథ్ శెట్టి, మనోజ్ ఖాతర్, నీరవ్ మోదీ కంపెనీ సిగ్నేటర్‌ను కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గీతాంజలి గ్రూప్‌కు చెందిన 18 భారత్ ఆధారిత సబ్సిడరీల ఆర్థిక లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నారు. -
సుప్రీం జడ్జీల వ్యవహారంపై సర్కార్ వైఖరిదే..
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియరు న్యాయమూర్తుల మధ్య నెలకొన్న విభేదాల్లో జోక్యం చేసుకోబోమని, ఈ అంశాన్ని న్యాయవ్యవస్థ తనంతట తాను పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రపంచంలో మన న్యాయవ్యవస్థకు ఎంతో గొప్ప పేరుంది. ఈ వివాదాన్ని మన స్వతంత్ర న్యాయ వ్యవస్థే పరిష్కరించు కుంటుంది’ అని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పిపి చౌదురీ పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కానందున.. వేచిచూసే ధోరణి అనుసరించాలనే యోచనలో కేంద్రం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వివాదం న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారమని, అందువల్లే దీనిపై స్పందించేందుకు ఏమీ లేదని.. అయితే న్యాయవ్యవస్థపై ప్రజా విశ్వాసం దెబ్బతినకుండా వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
కదం తొక్కిన తమిళ యువత..
-
‘ఆట’ కోసం ఆర్డినెన్స్
తమిళనాడు జల్లికట్టు ప్రతిపాదనకు కేంద్రం ఓకే ♦ నేడో, రేపో ఆర్డినెన్స్ జారీ: సీఎం ప్రకటన ♦ కదం తొక్కిన తమిళ యువత.. రాష్ట్ర బంద్ సక్సెస్ సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: జల్లికట్టు కోసం తమిళ తంబీలు ఉగ్రరూపం దాల్చి కేంద్రాన్ని తమ దారికి తెచ్చుకున్నారు. అన్నివర్గాల ప్రజలు ముఖ్యంగా యువత అకుంఠిత దీక్షతో అనుకున్నది సాధించారు. నిషేధిత జల్లికట్టు నిర్వహణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు కేంద్రం శుక్రవారం రాత్రి అంగీకరించింది. నాలుగురోజుల నిరసనలు, శుక్రవారం నాటి బంద్‌తో తమిళనాడు మొత్తం స్తంభించడంతో ఆర్డినెన్స్‌కు ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. జల్లికట్టుపై నిషేధం తొలగించడానికి రాష్ట్రం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు యథాతథంగా ఆమోదించాయి. ఆర్డినెన్స్ ద్వారా జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించి, అందులోని ‘ప్రదర్శన జంతువులు’(పర్ఫామింగ్ యానిమల్స్) జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తారు. ఆర్డినెన్స్‌ను నేరుగా తిరిగి రాష్ట్రానికి పంపామని కేంద్ర హోం శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. రాష్ట్రపతికి నివేదించకుండానే దీన్ని రాష్ట్రానికి పంపడం విశేషం. తమిళనాడు కేబినెట్ శనివారం ఉదయం ఆర్డినెన్స్‌ను ఆమోదించి, దాన్ని ప్రకటించాల్సిందిగా గవర్నర్ విద్యాసాగర్‌రావుకు సిఫార్సు చేసే అవకాశముంది. ఆర్డినెన్స్ ఒకటి, రెండు రోజుల్లో జారీ అవుతుందని, తానే స్వయంగా జల్లికట్టును ప్రారంభిస్తానని సీఎం పన్నీర్‌సెల్వం చెప్పారు. ఢిల్లీలో గురువారం ప్రధాని మోదీ నుంచి హామీ పొందిన ఆయన శుక్రవారం ఉదయం చెన్నైలో విలేకర్లతో మాట్లాడారు. మరోపక్క జల్లికట్టు కోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీలో కలిశారు. కేంద్రం సమస్యను పరిష్కరిస్తుందని ఆయనతోపాటు పర్యావరణ మంత్రి అనిల్ దవే, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు హామీ ఇచ్చారు. వారం పాటు సుప్రీం ఆదేశాలుండవు సమస్య పరిష్కారం కోసం కేంద్రం తమిళనాడుతో చర్చిస్తోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు తెలిపారు. కేసుపై వారం రోజుల వరకు ఆదేశాలివ్వొద్దని విజ్ఞప్తి చేయగా కోర్టు అంగీకరించింది. బంద్‌కు భారీ స్పందన జల్లికట్టు కోసం వివిధ కార్మిక, ప్రజా సంఘాలు శుక్రవారం చేపట్టిన తమిళనాడు బంద్ విజయవంతమైంది. రాష్ట్రమంతటా దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. రవాణా, ప్రజా రవాణా వాహనాలు పరిమిత సంఖ్యలో నడవగా, పలు రైళ్లు రద్దయ్యాయి. 8 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బంద్‌లో పాల్గొన్నారు. బ్యాంకుల కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగింది.విపక్ష డీఎంకే పలు చోట్ల రైల్వే రోకో నిర్వహించింది. చెన్నైలో ఆ పార్టీ నేతలు స్టాలిన్, కనిమొళిలతోపాటు 5వేల మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నాడీఎంకే, బీజేపీ మినహా అన్ని పార్టీలూ, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. మద్రాసు హైకోర్టు లాయర్లు విధులను బహిష్కరించారు. కోలీవుడ్అండ జల్లికట్టు మద్దతుదారులకు కోలీవుడ్ వెన్నుదన్నుగా నిలిచింది. రజనీకాంత్, అజిత్ కుమార్, సూర్య, కార్తీ, విశాల్, నాజర్, త్రిష, షాలిని తదితర నటులతోపాటు పలువురు నిర్మాత, దర్శకులు మెరీనా బీచ్‌లో నిరాహారదీక్ష, మౌన నిరసన నిర్వహించారు. డైరక్టర్ లారెన్స్ స్పృహ తప్పగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. నలుపెక్కిన మెరీనా బీచ్ నిరసనలకు కేంద్రమైన చెన్నై మెరీనా బీచ్‌లో శుక్రవారం ఐదోరోజు లక్షలాదిమంది ప్రజలు జల్లికట్టు కోసం గర్జించారు. బీచ్‌కు దారితీసే రోడ్లన్నీ నల్ల దుస్తులు ధరించిన ఆందోళనకారులతో కిక్కిరిశాయి. మహిళలు, బాలలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హిజ్రాలు కూడా గళం విప్పారు. ఆర్డినెన్స్ యత్నాలను స్వాగతిస్తున్నామని, అయితే ఆట పూర్తయ్యాకే నిరసన విరమిస్తామని ఆందోళనకారులు తేల్చిచెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరక్కుండా నిరసన కొనసాగిస్తున్నారు. -
తమిళనాట జల్లికట్టుకు లైన్ క్లియర్
-
జల్లికట్టుకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. కొద్దిపాటి మార్పులతో తమిళనాడు ఆర్డినెన్స్ కు కేంద్ర న్యాయశాఖ, పర్యావరణ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి. నాలుగు రోజులుగా తమిళులు చేస్తున్న ఆందోళనకు కేంద్రం తలొగ్గింది. ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం పంపింది. రాష్ట్రపతి ఆమోదం లభించగానే ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడంతో మెరీనా బీచ్ లో సంబరాలు మొదలయ్యాయి. ఆర్డినెన్స్ కోసం మెరీనా బీచ్ లో నాలుగు రోజులుగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వీరికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. శుక్రవారం విద్యార్థి సంఘాల పిలుపు మేరకు తమిళనాడు వ్యాప్తంగా బంద్ పాటించారు. మరోవైపు సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. అయితే ఆర్డినెన్స్ చేతికి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు ప్రకటించారు. -
డిటెన్షన్ విధానం అమలుకు ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: స్కూళ్లల్లో డిటెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 16ను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సవరించి స్కూళ్లల్లో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ డిటెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసిందని కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ పంపించిన ప్రతిపాదనలను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. -
కొలీజియంలో న్యాయమంత్రి ఉంటే తప్పేంటి?
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకం కోసం రూపొందిస్తున్న కొలీజియం వ్యవస్థలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని చేర్చటం వల్ల న్యాయ స్వతంత్రతకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో న్యాయవ్యవస్థపై జరిగిన ఓ కార్యక్రమంలో.. మాజీ న్యాయశాఖ మంత్రి కూడా అయిన శాంతి భూషణ్ మాట్లాడుతూ.. ‘కొలీజియంలో న్యాయమంత్రిని చేర్చటం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు. ఐదుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులున్న కొలీజియంలో మంత్రి ఒక్కడే ఏం చేయగలరు? మీ ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఆయనకుంటుందా? దీని వల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని నేననుకోవటం లేదు’ అని అన్నారు. 1950-60 నాటి రాజకీయ నాయకులు ఇప్పుడు లేరని.. అందువల్ల న్యాయవ్యవస్థే పలు అంశాల్లో బాధ్యత తీసుకోవాలని శాంతి భూషణ్ సూచించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉన్నత వర్గానికి చెందిన వారుండటం వల్ల మిగిలిన వెనకబడిన, మైనారిటీ వర్గాలకు న్యాయం జరగటం లేదని జాతీయ జ్యుడిషియల్ అకాడమీ మాజీ డెరైక్టర్ మోహన్ గోపాల్ అన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత లోపిస్తోందని సీపీఐ నేత నీలోత్పల్ బసు అభిప్రాయపడ్డారు. -
6 రాష్ట్రాల హైకోర్టుల్లో సీజేలు లేరు
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాల హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తులు లేకుండానే నడుస్తున్నాయని కేంద్ర న్యాయ శాఖ ఒక నివేదికలో తెలిపింది. దీంతోపాటు మరో 478 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం ఆగస్టు ఒకటి నాటికి ఆంధ్రప్రదేశ్/తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, సిక్కిం, త్రిపుర హైకోర్టులు తాత్కాలిక న్యాయమూర్తులతోనే పనిచేస్తునట్లు తెలిపింది. దేశంలోని 24 హైకోర్టుల్లో మొత్తం 601 జడ్జిలు పనిచేస్తున్నారని, వాస్తవంగా ఈ సంఖ్య 1079గా ఉండాలని నివేదిక వెల్లడించింది. -
లాభాపేక్ష పదవుల జాబితాతో బిల్లు
న్యాయ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూఢిల్లీ: లాభాపేక్ష పదవుల్లో కొనసాగడం వల్ల ఎంపీలు అనర్హత ముప్పును ఎదుర్కోవడం తెలిసిందే. అయితే ఏ ఏ పదవుల్లో ఉంటే అనర్హతకు గురవుతారోనన్న వివరాలతో బిల్లు రూపొందించాలని న్యాయ శాఖను పార్లమెంట్ ఉమ్మడి కమిటీ కోరింది. ఏ పదవుల్లో కొనసాగితే సభ్యతం కోల్పోతారన్నది రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు, పార్లమెంటు చట్టం(అనర్హత నిరోధం), హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా పేర్కొనలేదని తన తాజా నివేదికల్లో పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఏఏ విభాగాలు, ఆఫీసులు అనర్హత కిందకు వస్తాయో, ఏవి రావో పేర్కొంటూ నమూనా బిల్లును రూపొందించాలని కమిటీ సూచించింది. పార్లమెంట్ షెడ్యూల్లో అనర్హత వర్తించే విభాగాల జాబితా ఉన్నా... చాలా విభాగాలు అందులో లేవని కమిటీ అభిప్రాయపడింది. -
కలకత్తానే ముద్దు.. కోల్‌కతా వద్దు
కోల్‌కతా: బాంబే, మద్రాస్, కలకత్తా హైకోర్టుల పేర్లను ముంబై, చెన్నై, కోల్‌కతా హైకోర్టులుగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కలకత్తా హైకోర్టు పేరును కోల్‌కతాగా మార్చవద్దంటూ ఆ కోర్టులో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కలకత్తా హైకోర్టు పేరును యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జడ్జీలందరూ ఓ తీర్మానాన్ని చేసి, దానిని కేంద్ర న్యాయ శాఖకు పంపారు. భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు అయిన కలకత్తా హైకోర్టుకు 154 ఏళ్ల చరిత్ర ఉందని, కలకత్తా పేరును స్థానికులు సెంటిమెంట్ గానూ భావిస్తారని పైగా షిప్పింగ్, బ్యాంకింగ్ ఇంతర వ్యాపారాలకు సంబంధించిన వివాదాల్లో ప్రపంచ దేశాలకు ఇది(కోర్టు) కలకత్తా హైకోర్టుగానే పరిచయమని లా సొసైటీ ఆఫ్ కలకత్తా (ఐఎల్ఎస్ సీ) అధ్యక్షుడు ఆర్కే ఖన్నా అంటున్నారు. ఏ రకంగా చూసినా హైకోర్టు పేరు మార్పు తగదని, అందుకే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు ఖన్నా తెలిపారు. ఇదిలా ఉండగా, కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే మూడు హైకోర్టుల పేర్లను మార్చేశారు అధికారులు. కలకత్తా హైకోర్టు వెలుపల 'కోల్ కతా' హైకోర్టు అని బెంగాలీలో బోర్డులు ఏర్పాటుచేశారు. కానీ ఇంగ్లిష్ పేరు మాత్రం కలకత్తా హైకోర్టుగానే ఉంచారు. హైకోర్టుల పేర్ల మార్పుకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లిందని, తాము సుప్రీంకోర్టు అప్పీలుకు వెళ్లేది, లేనిది రాష్ట్రపతి నిర్ణయం తర్వాత స్పష్టత వస్తుందని జడ్జిలు చెబుతున్నారు. -
ఆ హైకోర్టులను ఇలా పిలవాలి..
న్యూఢిల్లీ: వలసవాద వాసనలను పూర్తిగా వదిలించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాంబే, కలకత్తా, మద్రాస్ హైకోర్టుల పేర్లను.. ముంబై, కోల్ కతా, చెన్నై హైకోర్టులుగా మార్చుతున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో హైకోర్టుల పేర్ల మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు చెప్పారు. బ్రిటిష్ పాలనలో ఈ మూడు మహానగరాలకు స్థిరపడ్డ పేర్లను మార్చేసి బాంబేను ముంబై, కలకత్తాను కోల్ కతా, మద్రాస్ ను చెన్నైగా మార్చుతూ గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నగరాలు పేర్లు మారినప్పటికీ హైకోర్టులకు మాత్రం పాత పేర్లే కొనసాగాయి. కోర్టుల పేర్లు కూడా మార్చాలని గతంలో పెద్ద ఎత్తున డిమాండ్ వెల్లువెత్తింది. దీనిపై సమగ్ర అధ్యయం అనంతరం రూపొందిన బిల్లు.. ఇటీవలే న్యాయశాఖ ఆమోదం పొందిందని, ఇప్పుడు కేబినెట్ కూడా ఓకే చెప్పిందని మంత్రి రవిశంకర్ తెలిపారు. భారతీయ హైకోర్టుల చట్టం (1861) ఆధారంగా కొత్త పేర్లు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
రాజ్యాంగ సవరణ అనవసరం
తెలంగాణ బిల్లుపై న్యాయ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఆర్టికల్-3, ఆర్టికల్-4 (2) మేరకు సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని లోక్‌సభ సచివాలయానికి స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం ఈ అంశాన్ని ముందుగానే పరిశీలించిందని, రాష్ట్ర ఏర్పాటుకు సాధారణ మెజారిటీ చాలని కేంద్ర కేబినెట్‌కు సిఫార్సు చేసిందని పేర్కొంది. తెలంగాణలో శాసనమండలి ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమని అభిప్రాయపడిన లోక్‌సభ సచివాలయం ఈ విషయంలో స్పష్టతనివ్వాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది. బిల్లు తయారీలో పాలుపంచుకున్న న్యాయమంత్రిత్వ శాఖ అధికారులు కూడా రాజ్యాంగ సవరణ అవసరమనే అభిప్రాయపడ్డాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమా? కాదా? అనే విషయం స్పష్టంచేయాలని న్యాయశాఖను పేర్కొంది. తెలంగాణ బిల్లులో ఆర్థిక అంశాలు ఉండటంతో మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత ఈ నెల 18న లోక్‌సభలో ప్రవేశపెడతారని తెలుస్తోంది. -
ఫిబ్రవరి 18 తర్వాతే తెలంగాణ బిల్లు: న్యాయశాఖ
న్యూఢిల్లీ: 15వ లోకసభ ముగియడానికి మూడు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 18 తేదిన తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు న్యాయశాఖ ఏర్పాట్లు చేస్తోందని పీటిఐ కథనంలో పేర్కోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ అక్కర్లేదు అని కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పార్లమెంట్ లో సాధారణ మెజార్టీ ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని న్యాయశాఖ లోకసభ సెక్రటేరియట్ కు బుధవారం ఉదయం వెల్లడించింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 3, 4(2) ప్రతిపాదకగా తీసుకోవాలని న్యాయశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సాధారణ తీర్మానం మాత్రమే అవసరమని కేంద్ర కేబినెట్ కు ఇదివరకే మంత్రుల బృందం తెలిపిందని లోకసభ సెక్రెటేరియట్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే తెలంగాణలో శాసన మండలికి మాత్రం మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం లేదు న్యాయశాఖ తెలిపింది. అయితే ప్రస్తుత రాష్ట్ర విభజనకు 29వ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి రాజ్యాంగ సవరణలు అక్కర్లేదని ఓప్రశ్నకు న్యాయశాఖ అధికారులు జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ 2013-14 ను ఆమోదించిన తర్వాతనే ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 15 లోకసభ ముగింపుకు మూడు రోజుల ముందు మాత్రమే తెలంగాణ బిల్లు సభలో ప్రవేశపెట్టే పరిస్థితుల కనిపిస్తున్నాయని పీటీఐ కథనంలో వెల్లడించింది. -
బిల్లులో ఆర్థికాంశాలు: న్యాయశాఖ
-
టీ బిల్లులో ఆర్థికాంశాలు: న్యాయశాఖ
తెలంగాణ బిల్లులో ఆర్థికాంశాలున్నాయని న్యాయ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. దాంతో బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీన లోక్‌సభలోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని యూపీఏ సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ముందుగా మంగళవారం నాడు లోక్‌సభ బీఏసీ సమావేశం నిర్వహించారు. టేబుల్ బిల్లుగా తెలంగాణ అంశాన్ని ప్రవేశపెట్టాలని అందులో నిర్ణయించారు. అప్పటికే న్యాయ శాఖ నుంచి కూడా అభిప్రాయం రావడం, బిల్లులో ఆర్థికాంశాలు ఉన్నాయని తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ పెద్దల గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డు పడినట్లయింది. వాస్తవానికి తెలంగాణ బిల్లును మంగళవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు ముందుగా కేంద్రం రంగం సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సభలో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఆ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి సమాచారమిచ్చింది. కానీ సోమవారం రాత్రికల్లా ఉన్నట్టుండి సీను మారిపోయింది. విభజన బిల్లును ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చా, లేదా అన్న మీమాంస తలెత్తడంతో దానిపై కేంద్ర న్యాయ శాఖను రాజ్యసభ సచివాలయం సలహా కోరింది. విభజన బిల్లులో ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయా, లేదా అన్న అంశంపై న్యాయ శాఖ నుంచి స్పష్టత కోరింది. ఇదే అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ బిల్లు ఆర్థిక బిల్లు కాదని ఆ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం గట్టిగా వాదిస్తారని చెబుతున్నారు. కానీ ఇప్పటికే న్యాయశాఖ ఇందులో ఆర్థికాంశాలు ఉన్నాయని చెప్పడంతో ఇక లోక్‌సభలోనే బిల్లును ప్రవేశపెట్టాలని, అయితే ఆ సమయంలో సభలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశాలపైనే కోర్ కమిటీ ప్రధానంగా చర్చించబోతోంది. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సీమాంధ్ర ఎంపీలను లోక్‌సభ నుంచి కూడా సస్పెండ్ చేసి, తమకు ఇబ్బంది లేకుండా చేసుకుని బిల్లును ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
లోక్‌పాల్‌కు రాష్ట్రపతి ఆమోదం
-
లోక్‌పాల్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. అత్యున్నత స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించిన ఈ చరిత్రాత్మక బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసినట్లు బుధవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని రక్షణలతో ప్రధానమంత్రిని కూడా దీని పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. సవరించిన లోక్‌పాల్ బిల్లును డిసెంబర్ 17, 18 తేదీల్లో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ర్టపతి ఆమోదం పొందడంతో లోక్‌పాల్ బిల్లు కొన్ని లాంఛనాల తర్వాత చట్టరూపం దాల్చుతుంది. ఇప్పుడు ఈ బిల్లు న్యాయ శాఖలోని శాసన విభాగం కార్యదర్శి సంతకం చేసి.. దానిని అధికార గెజిట్‌లో ప్రచురణ కోసం పంపుతారు. ఇది చట్టరూపం దాల్చితే లోక్‌పాల్ ఏర్పడిన ఏడాదిలోపు రాష్ట్రాలు ఆయా అసెంబ్లీల్లో చట్టాల ద్వారా లోకాయుక్తలను ఏర్పాటు చేసుకోవాలి. -
తెలంగాణ బిల్లుకు న్యాయశాఖ ఓకే
కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగానే బిల్లు అసెంబ్లీలో చర్చ కోసం 25న రాష్ట్రానికి బిల్లు డిసెంబర్ 19న లోక్‌సభకు.. ఆ వెంటనే రాజ్యసభకు.. సీఎంకు హస్తిన నుంచి సమాచారం సజీవంగానే ‘రాయల తెలంగాణ’ అంశం ఈ సంప్రదింపులన్నీ హడావుడేనంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి పార్టీలు, పలు ప్రభుత్వ శాఖల నుంచి ఒక పక్క అభిప్రాయాలను, సమాచారాన్ని కోరుతున్న కేంద్ర ప్రభుత్వం, మరో పక్క తెలంగాణ బిల్లును సిద్ధం చేసేసింది. కేంద్ర హోం శాఖ రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఈ మేరకు హస్తిన నుంచి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి స్పష్టమైన సమాచారం అందింది. హోం శాఖ పంపిన బిల్లుకు కేవలం రెండు రోజుల్లోనే న్యాయ శాఖ ఆమోదం తెలిపిందని రాష్ర్ట ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు ధ్రువీకరించాయి! కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా బిల్లును రూపొందించారని, అయితే రాయల తెలంగాణ అంశాన్నిఇంకా సజీవంగానే ఉంచారని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సమాచారం వచ్చింది. అంతేగాక తెలంగాణ బిల్లును నవంబర్ 25వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపిస్తున్నట్టు కూడా తెలియజేశారు. బిల్లులో అంశాలపై శాసనసభ చర్చిస్తుంది. 10 జిల్లాల తెలంగాణ అని బిల్లులో ప్రస్తుతానికి పేర్కొన్నా, అది అసెంబ్లీ ముందుకు వచ్చేసరికల్లా కర్నూలు, అనంతపురాలను కలిపి 12 జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేస్తామని పేర్కొనే అవకాశాలున్నాయని బలంగా విన్పిస్తోంది. బిల్లుపై ఒకవేళ అసెంబ్లీలో ఓటింగ్ అనివార్యమయ్యే పరిస్థితే గనుక తలెత్తితే దాన్ని నెగ్గించుకునేందుకు అవసరమైన మెజారిటీ కోసమే ఈ యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 19న లోక్‌సభకు... అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... తెలంగాణ బిల్లును డిసెంబర్ 19న పార్లమెంటు ఆమోదం కోసం ప్రవేశ పెడుతారు. ఆ వెంటనే దాన్ని రాజ్యసభ ఆమోదానికి పంపుతారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అడుగుతున్న సమాచారమంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యా ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసమేనని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలను, సమాచారాన్ని తీసుకున్నట్టుగా పైకి కన్పించాలనే ఉద్దేశంతోనే పార్టీల అభిప్రాయాలను కేంద్రం కోరుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ సమస్యను ఏ ఆథారిటీ ద్వారా పరిష్కరిస్తారో బిల్లులో పేర్కొనడంతో సరిపెడతారే తప్ప ఎలా పరిష్కరిస్తారో ఎక్కడా ఉండదని కూడా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలేమైనా ఉంటే కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ శాఖ పరిష్కారం చూపుతుంది. ఉద్యోగుల పంపిణీ వ్యవహారంపై ఉన్నతస్థాయి అధికారి నేతృత్వంలో అథారిటీ వేస్తారు. నీటి సమస్యలుంటే కేంద్ర జల సంఘం పరిష్కరిస్తుంది’ అని మాత్రమే బిల్లులో పేర్కొంటారని వివరించాయి. -
ఆంటోనీ హైదరాబాద్‌కి రాదు-దిగ్విజయ్