న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న అత్యాచార కేసులను విచారించేందుకు అక్టోబర్ 2 నుంచి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు కేంద్ర న్యాయ శాఖ సిద్ధం అవుతోంది. మొత్తం 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి రూ.767.25 కోట్లు ఖర్చవుతుందని న్యాయ విభాగం పేర్కొంది. అందులో నిర్భయ నిధుల కింద కేంద్రం నుంచి రూ. 474 కోట్లు మంజూరు కానున్నాయి. ఆర్థిక సంఘం ఖర్చుల వివరాలను ప్రతిపాదించిన తర్వాత దాన్ని ఆర్థిక మంత్రి దగ్గరకు పంపనున్నామని, న్యాయవిభాగం ఈ నెల 8న కేబినేట్ సెక్రెటేరియట్‌కు రాసిన లేఖలో తెలిపింది.
దీనితోపాటే అక్టోబర్ 2 నుంచి ఈ కోర్టులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. మొదటి దశలో 9 రాష్ట్రాల్లో 777 కోర్టులు ఏర్పాటు చేస్తామని, రెండో దశలో 246 కోర్టులు ఏర్పాటు చేస్తామని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment