రాజ్యాంగ సవరణ అనవసరం | changes not need for Telangan Bill, says Law ministry | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ సవరణ అనవసరం

Published Thu, Feb 13 2014 3:21 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

changes not need for Telangan Bill, says Law ministry

 తెలంగాణ బిల్లుపై న్యాయ మంత్రిత్వ శాఖ
 
 న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఆర్టికల్-3, ఆర్టికల్-4 (2) మేరకు  సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని లోక్‌సభ సచివాలయానికి స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం ఈ అంశాన్ని ముందుగానే పరిశీలించిందని, రాష్ట్ర ఏర్పాటుకు సాధారణ మెజారిటీ చాలని కేంద్ర కేబినెట్‌కు సిఫార్సు చేసిందని పేర్కొంది.

తెలంగాణలో శాసనమండలి ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమని అభిప్రాయపడిన లోక్‌సభ సచివాలయం ఈ విషయంలో స్పష్టతనివ్వాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది. బిల్లు తయారీలో పాలుపంచుకున్న న్యాయమంత్రిత్వ శాఖ అధికారులు కూడా రాజ్యాంగ సవరణ అవసరమనే అభిప్రాయపడ్డాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమా? కాదా? అనే విషయం స్పష్టంచేయాలని న్యాయశాఖను పేర్కొంది. తెలంగాణ బిల్లులో ఆర్థిక అంశాలు ఉండటంతో మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత ఈ నెల 18న లోక్‌సభలో ప్రవేశపెడతారని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement