జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. కొద్దిపాటి మార్పులతో తమిళనాడు ఆర్డినెన్స్ కు కేంద్ర న్యాయశాఖ, పర్యావరణ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి. నాలుగు రోజులుగా తమిళులు చేస్తున్న ఆందోళనకు కేంద్రం తలొగ్గింది. ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం పంపింది. రాష్ట్రపతి ఆమోదం లభించగానే ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది.