జల్లికట్టు కోసం తమిళ తంబీలు ఉగ్రరూపం దాల్చి కేంద్రాన్ని తమ దారికి తెచ్చుకున్నారు. అన్నివర్గాల ప్రజలు ముఖ్యంగా యువత అకుంఠిత దీక్షతో అనుకున్నది సాధించారు. నిషేధిత జల్లికట్టు నిర్వహణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు కేంద్రం శుక్రవారం రాత్రి అంగీకరించింది. నాలుగురోజుల నిరసనలు, శుక్రవారం నాటి బంద్‌తో తమిళనాడు మొత్తం స్తంభించడంతో ఆర్డినెన్స్‌కు ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. జల్లికట్టుపై నిషేధం తొలగించడానికి రాష్ట్రం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు యథాతథంగా ఆమోదించాయి.