న్యూఢిల్లీ: పరిపాలన, చట్టాల రూపకల్పన వంటి విషయాలను న్యాయ వ్యవస్థ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వదిలివేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ‘ఈ మధ్యకాలంలో పరిపాలనా సంబంధమైన విషయాల్లో న్యాయస్థానాల జోక్యం పెరిగిపోవడాన్ని మనం చూస్తున్నాం. పరిపాలనను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వదిలివేయాలి’ అని ప్రసాద్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్వహించిన సెమినార్‌లో కమిషన్ చైర్మన్, సుప్రీం మాజీ సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తుతో కలిసి ప్రసాద్ పాల్గొన్నారు.