Justice system
-
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు. అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది. ‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి. చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం. వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్‌లో మొట్టమొదటి లేడీ ఫిట్నెస్ ట్రైనర్‌గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ. వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్‌కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది. ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు. అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి. -
న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం
జెరూసలేం: వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం తుది ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌ను ప్రతిపక్షం బహిష్కరించింది. బిల్లుకు అనుకూలంగా 64 ఓట్లు లభించగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లుపై ఏకంగా 30 గంటలపాటు పార్లమెంట్లో చర్చ జరిగింది. ఒకవైపు చర్చ జరుగుతుండగానే, మరోవైపు దేశవ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. జనం వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో మార్పులు తలపెట్టడాన్ని అమెరికాతోపాటు పశి్చమ దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. న్యాయ వ్యవస్థను సంస్కరిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను కోర్టులు అడ్డుకోరాదు. అంటే న్యాయ వ్యవస్థపై ప్రభుత్వానిదే పైచేయి అవుతుంది. -
అక్కా, బావ, ఓ బామ్మర్ది.. కుచ్చుటోపి!
సాక్షి, అమరావతి: అమరావతి భూముల విషయంలో ‘ఇన్సైడ్ ట్రేడింగ్’ ఆరోపణలతో ఏసీబీ కేసులో మొదటి నిందితునిగా ఉన్న మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అపార్ట్మెంట్ ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్ పేరుతో దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య, బావమరిది నన్నపనేని సీతారామరాజు, మరికొందరు కలిసి తనను మోసం చేశారంటూ రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజా రామమోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నాలుగవ నిందితునిగా చేర్చారు. ఈ ఫిర్యాదులోని అంశాలు ఇలా ఉన్నాయి. ► నేను ఓ రిటైర్డ్ లెక్చరర్ని. విజయవాడలో నాకు ఓ నివాస గృహం ఉంది. దానిని 2018 అక్టోబర్‌లో అమ్మేశాను. ఈ విషయం తెలుసుకుని నా పక్క ఊరుకు చెందిన వ్యక్తి కేవీజీ కృష్ణుడు అలియాస్ వేణు విజయవాడలోని ‘క్యాపిటల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ కార్యాలయానికి నన్ను తీసుకెళ్లాడు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నన్నపనేని సీతారామరాజుకు నన్ను పరిచయం చేశారు. ► సీతారామరాజు ‘లేక్ వ్యూ అపార్ట్మెంట్స్’పేరుతో తాము నిర్మిస్తున్న ప్రాజెక్ట్ బ్రోచర్‌ను నాకు చూపారు. ఈ ప్రాజెక్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబానికి సైతం భాగం ఉందని, వారి పలుకుబడి ద్వారా తమ కంపెనీ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సమీపంలో దమ్మాలపాటి శ్రీనివాస్ భార్యకు సైతం భూమి ఉందని సీతారామరాజు చెప్పారు. ► ఆ కార్యాలయంలోనే నేను మొదటిసారి దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య నాగరాణిని కలిశాను. తాను రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పనిచేస్తున్నానని, ప్రభుత్వంలో ఎవరినైనా ప్రభావితం చేయగలనని, ఏ పనైనా చేసుకురాగలనని దమ్మాలపాటి, ఆయన భార్య నాకు హామీ ఇచ్చారు. వీరి ప్రేరేపణతో నేను ‘లేక్‌వ్యూ అపార్ట్మెంట్స్’లో రెండు త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్లు కొనాలని నిర్ణయించుకున్నాను. దమ్మాలపాటిని చూసే రూ.50 లక్షలు చెల్లించా ► ఒక్కో ఫ్లాట్‌ను రూ.38.50 లక్షలకు అమ్ముతామని చెప్పారు. దీంతో నేను రెండ్లు ఫ్లాట్లకు అడ్వాన్సు కింద రూ.50 లక్షలు చెల్లించాను. వారు నాకు రెండు వేర్వేరు రసీదులు ఇచ్చారు. ఆ తర్వాత నేను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కోసం ఒత్తిడి తెచ్చాను. వారు అగ్రిమెంట్ చేయకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు. ► నేను ఒత్తిడి చేస్తున్నట్లు ఎవరూ చేయలేదని, ఆయన చెప్పిన చోట పెట్టుబడి పెట్టేందుకు ఆయన కార్యాలయం బయట వందల మంది ఎదురు చూస్తున్నారని దమ్మాలపాటి మాట్లాడారు. గట్టిగా ఒత్తిడి చేయగా చివరకు 2019 ఫిబ్రవరి 22న ఫ్లాట్ నంబర్ 1001కు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేశారు. రెండో ఫ్లాట్‌కు త్వరలోనే అగ్రిమెంట్ పంపుతామని చెప్పారు. ► చెల్లించాల్సిన మిగిలిన మొత్తానికి రూ.19 లక్షలు, రూ.18.65 లక్షలు, రూ.10.50 లక్షలకు ఆంధ్ర బ్యాంక్ పేరు మీద ఉన్న చెక్కులు ఇచ్చాను. ఆ రోజునే సీతారామరాజు వాటిని నగదుగా మార్చుకున్నారు. స్టార్ హోటల్స్ వస్తాయంటూ.. ► ఆ తర్వాత సీతారామరాజు నాతో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు విస్తరణకు డబ్బు అవసరం ఉందన్నారు. అందువల్ల తాను, దమ్మాలపాటి శ్రీనివాస్ భార్య నాగరాణి సంయుక్తంగా కొన్న స్థలాన్ని అమ్ముతున్నామని, ఆ స్థలం చుట్టుపక్కల స్టార్ హోటల్స్ వస్తాయన్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ ఆ స్థలాన్ని నాకు చూపారు. స్టార్ హోటల్స్ వస్తాయని ఆయన కూడా చెప్పారు. ► వాళ్ల మాటలు నమ్మి నా కుమార్తెను ఆ స్థలం కొనమని చెప్పాను. ఆమె ఎన్ఆర్ఐ ఖాతా నుంచి రూ.73 లక్షలు ఓపెన్ ప్లాట్ కోసం వారికి బదిలీ చేశాను. రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చి, 2019 జూలై 24న లేక్ వ్యూ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ 1001ని మాత్రమే నా పేరు మీద రిజిష్టర్ చేశారు. మిగిలిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తప్పుడు కేసులు పెడతామని బెదిరింపు ► సేల్‌డీడ్‌ను పరిశీలిస్తే ఈ రిజిస్ట్రేషన్ సరైన రీతిలో చేయలేదని తెలిసింది. వారి ప్రవర్తనపై అనుమానంతో నా సోదరుడు సత్యప్రసాద్‌ను పంపి విచారించాను. ఈ ప్రాజెక్టుకు సమీపంలో వారికి ఎలాంటి ఓపెన్ ప్లాట్ లేదని కూడా తేలింది. దీంతో లేని ప్లాట్‌కు వాళ్లు నా ద్వారా నా కుమార్తెకు చెందిన రూ.73 లక్షలు తీసుకున్నారని అర్థమైంది. ► డబ్బు తిరిగి ఇవ్వమంటే న్యాయ వ్యవస్థలో, పోలీసుల్లో తమకు భారీ పలుకుబడి ఉందంటూ సీతారామరాజు, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు బెదిరిస్తున్నారు. నా డబ్బు కొట్టేసి, నాపైనే తప్పుడు కేసులు బనాయిస్తామంటున్నారు. ► లాక్డౌన్ వల్ల నేను హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయాను. అందుకే ఇప్పుడు విజయవాడకు వచ్చి ఫిర్యాదు చేశాను. దమ్మాలపాటి శ్రీనివాస్, దమ్మాలపాటి నాగరాణి, నన్నపనేని సీతారామరాజు, కేవీజీ కృష్ణుడు, అడుసుమిల్లి తనూజ, పొట్లూరి అనంత లక్ష్మీలు నన్ను దారుణంగా మోసం చేశారు. -
న్యాయవ్యవస్థ సమగ్రతే శిరోధార్యం కావాలి
న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవ్యవస్థ సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూడాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ గుప్తా వ్యాఖ్యానించారు. ఉష్ట్రపక్షిలా తల దాపెట్టుకుని, న్యాయవ్యవస్థలో అంతా బావుందని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. చుట్టూ ఉన్న సమాజంలో కూడా అంతా బావుందనే ఊహాలోకంలో న్యాయమూర్తులు ఉండకూడదని హితవు పలికారు. మూడేళ్లకు పైగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ గుప్తా బుధవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. లాయర్‌గా, జడ్జిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. లాక్డౌన్ కారణంగా, బార్బర్స్ అందుబాటులో లేకపోవడంతో తన భార్యనే ఈ రోజు తనకు హెయిర్ కట్ చేసిందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ గుప్తా పలు కీలక తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మైనర్ భార్యతో శృంగారం, ఆమె అనుమతి ఉన్నా.. రేప్ కిందకే వస్తుందని ఇచ్చిన తీర్పు, జైళ్ల సంస్కరణల తీర్పు, వాయు కాలుష్యంపై ఇచ్చిన తీర్పు మొదలైనవి వాటిలో ఉన్నాయి. -
సత్వరం న్యాయం అందించడం దైవ కార్యం
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థపై ప్రజలు ఎంతో నమ్మకం ఉంచారని, శీఘ్రగతిన వారికి న్యాయాన్ని అందించినప్పుడే ఆ నమ్మకానికి సార్థకత చేకూరుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి అన్నారు. ప్రజలకు న్యాయం అందించడమన్నది దైవ కార్యమని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల తొలి సదస్సు ఆదివారం గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఈ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు 13 జిల్లాలకు చెందిన దాదాపు 530 మంది న్యాయాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయాధికారులను ఉద్దేశించి సీజే జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా చూసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత న్యాయాధికారులపై ఉందన్నారు. ప్రజలు మనదేశంలో న్యాయమూర్తులను దేవుళ్లలా భావిస్తారని, అందుకే న్యాయస్థానాలు ‘న్యాయ ఆలయాలు’ అయ్యాయన్నారు. దేశంలో ఎన్నో దేవాలయాలున్నా, తిరుమల, కాశీ ఇలా కొన్ని దేవస్థానాలకే అత్యంత పవిత్రత ఉందని, అలాగే అనేక రంగాలు ప్రజల కోసం పనిచేస్తున్నా, న్యాయవ్యవస్థకున్న ప్రత్యేకత వేరని తెలిపారు. న్యాయం అందించే బాధ్యత మన చేతుల్లోకి వచ్చిందంటే అది దైవకృప వల్ల మాత్రమే సాధ్యమైందని, అందువల్ల ప్రజలకు సత్వర న్యాయం అందించడాన్ని దైవ కార్యంగా భావించాలని ఆయన న్యాయాధికారులను కోరారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ఏం చేయాలి.. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు.. వాటిని ఎలా అధిగమించాలి.. తదితర అంశాలపై సూచనలు, సలహాలు అందుకునేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. హాజరైన న్యాయాధికారులు హైకోర్టు జడ్జిపై 12 వేల కేసుల భారం... అధికార గణాంకాల ప్రకారం హైకోర్టులో 1,90,431 కేసులు పెండింగ్‌లో ఉంటే, ప్రస్తుతం ఉన్నది 15 మంది న్యాయమూర్తులేనని సీజే తెలిపారు. ఆ ప్రకారం ఒక్కో న్యాయమూర్తిపై 12,695 కేసులను విచారించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అలాగే కింది కోర్టుల్లో 5,67,630 పెండింగ్ కేసులు ఉంటే, ప్రస్తుతం ఉన్నది 529 మంది న్యాయాధికారులేనని చెప్పారు. పాత కేసుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో సరిపెట్టకుండా, కొత్త కేసులు పాత కేసులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు పెద్ద సంఖ్యలో కక్షిదారులుగా మారుతున్నాయని, ఇదే సమయంలో ప్రజల్లో వారి హక్కుల పట్ల అవగాహన పెరుగుతోందన్నారు. ఈ–ఫిర్యాదుల పరంపర చాలా వేగంగా పెరిగిందని, ఈ పరిస్థితుల్లో న్యాయాధికారులపై ఎంతో గురుతర బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. నైతికత విషయంలో రాజీపడొద్దు.. న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సత్సంబంధాలు ఉండటం వల్ల సమర్థవంతంగా న్యాయ పాలన అందించడం సాధ్యమవుతుందని జస్టిస్ మహేశ్వరి చెప్పారు. న్యాయపాలనలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని, వారు కూడా న్యాయమూర్తులతో సమానమని తెలిపారు. నైతికత విషయంలో న్యాయమూర్తులు ఎన్నడూ కూడా రాజీపడాల్సిన అవసరం లేదని చెప్పారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించాలన్నారు. సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సీతారామమూర్తి, ఏపీ లా సెక్రటరీ మోహన్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు పాల్గొన్నారు. -
జడ్జీలను పెంచండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు అన్నిహైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై గొగోయ్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి మూడు లేఖలు రాశారు. ఈ సందర్భంగా హైకోర్టుల్లో జడ్జీల పదవీవిరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న కేసుల్ని పరిష్కరించేందుకు పదవీవిరమణ చేసిన జడ్జీలను నిర్ణీతకాలానికి మళ్లీ విధుల్లో తీసుకోవాలని సూచించారు.‘సుప్రీంకోర్టులో ప్రస్తుతం 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో ఈ కేసులను విచారించలేకపోతున్నాం. మీకు(మోదీకి) గుర్తుందనుకుంటా. 1988లో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 18 నుంచి 26కు చేరుకుంది. అనంతరం రెండు దశాబ్దాల తర్వాత అంటే 2009లో సీజేఐతో కలిపి జడ్జీల సంఖ్య 31కి చేరుకుంది. సుప్రీంకోర్టు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని, ఇందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. దీనివల్ల కోర్టు మెట్లు ఎక్కే ప్రజలకు నిర్ణీత సమయంలోగా న్యాయం దొరుకుతుంది’ అని లేఖలో గొగోయ్ తెలిపారు. సుప్రీం, హైకోర్టుల్లో జడ్జీల పోస్టులకు అర్హులైనవారి సంఖ్య పెరిగినప్పటికీ, అదే స్థాయిలో న్యాయమూర్తుల సంఖ్య మాత్రం పెరగలేదన్నారు. హైకోర్టుల్లో తీవ్రమైన కొరత.. హైకోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వేధిస్తోందని జస్టిస్ గొగోయ్ ప్రధాని మోదీకి రాసిన తన రెండో లేఖలో తెలిపారు. ‘ప్రస్తుతం దేశంలోని అన్నిహైకోర్టుల్లో కలిపి 39 శాతం అంటే 399 జడ్జి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. శక్తివంచనలేకుండా కృషి చేస్తే తప్పించి ఈ ఖాళీలను భర్తీచేయడం సాధ్యం కాదు. అలాగే హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీవిరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని మిమ్మల్ని(ప్రధాని) కోరుతున్నా. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణను చేపట్టండి. గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘాలు కూడా దీన్ని సూచించాయి’ అని జస్టిస్ గొగోయ్ వెల్లడించారు. పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఆయన మరో లేఖలో కోరారు. నిర్ణీత కాలానికి వీరిని న్యాయమూర్తులుగా నియమించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణలకు సవరణ చేయాలని సూచించారు. దీనివల్ల అపార అనుభవం ఉన్న జడ్జీలు మరింత ఎక్కువకాలం సేవలు అందించడం వీలవుతుందని పేర్కొన్నారు. -
పారదర్శకత పేరిట నాశనం చేయలేరు
న్యూఢిల్లీ: దాపరికంతో కూడిన వ్యవస్థను ఎవరూ కోరుకోరని, అదే సమయంలో పారదర్శకత పేరిట న్యాయ వ్యవస్థను నాశనం చేయలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందని గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ గురువారం పైవిధంగా స్పందించింది. సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి 2010లో ఈ పిటిషన్లు వేశారు. తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, ఆర్టీఐ కార్యకర్త అగ్రావాల్ తరఫున లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. సీజే జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును నిలుపుదలలో ఉంచింది. ఎవరూ అజ్ఞాతంలో ఉండాలని కోరుకోరని, సమాచారం ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వకూడదనే విషయంలో స్పష్టమైన రేఖ గీసుకోవాలని బెంచ్ సూచించింది. ఆర్టీఐ కింద న్యాయ వ్యవస్థ సమాచారం బహిర్గతం చేయకపోవడం విచారకరమని, జడ్జీలు ఏమైనా వేరే విశ్వంలో నివసిస్తున్నారా అని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ విభాగాలు పారదర్శకతతో వ్యవహరించాలని సూచించిన సుప్రీంకోర్టు తన విషయం వచ్చే సరికి వెనకడుగు వేస్తోందని అన్నారు. -
న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం
సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమేనని, అవి న్యాయవ్యవస్థ స్వతంత్రత, స్థాయి దెబ్బతినకుండా ఉండాలని సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, లా కమిషన్ పూర్వపు చైర్మన్, రెండో జాతీయ జ్యుడీషియల్ పే కమిషన్ చైర్మన్ జస్టిస్ పి.వెంకటరామరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజావసరాలే కాకుండా న్యాయవ్యవస్థపై వారు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా అర్థవంతమైన సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కోకా రాఘవరావు లా ఫౌండేషన్ సహకారంతో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏసీ) శుక్రవారం హైదరాబాద్‌లో ‘న్యాయ సంస్కరణలు’పై జాతీయ స్థాయి సదస్సును నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ‘లా కమిషన్ చైర్మన్‌గా ఉండగా దేశంలో ఆరు రాష్ట్రాల్లో పది చొప్పున మోడల్ కోర్టులు ఉండాలనే ప్రతిపాదనపై ఆర్థిక, న్యాయ శాఖల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన ఒక ప్రధాన న్యాయమూర్తి అయితే అన్ని కోర్టులూ మోడల్ కోర్టులు కావాలని చెప్పారు. చివరికి నిధులు మురిగిపోయాయి ఆ ప్రతిపాదన బుట్టదాఖలైంది’అని జస్టిస్ వెంకటరామరెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. సాయంత్రపు కోర్టులుండాలి: సంస్కరణల ప్రతిపాదనలు ఫైళ్లకు పరిమితం కారాదని జస్టిస్ వెంకటరామరెడ్డి అన్నారు. 2010–11 కాలంలో సాయంత్రం పనిచేసే కోర్టులుండాలని, న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కోర్టులుండాలని, ఫ్రీ బార్గయినింగ్ కోర్టులు ఉండాలనే ప్రతిపాదనలు అమలు కాలేదని ఆయన తన అనుభవాలను గుర్తు చేశారు. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల అంశంపై మాట్లాడుతూ.. కొలీజియానికి చేరిన జాబితాపై సంప్రదింపులు చేయడం మంచి పరిణామమని చెప్పారు. పాలనాపర అంశాలకు ఫుల్ బెంచ్: పాలనాపరమైన అంశాలపై న్యాయమూర్తుల్లో విబేధాలు తలెత్తినప్పుడు ఫుల్ బెంచ్ (మొత్తం న్యాయమూర్తులందరూ) సమావేశమై వాటిని పరిష్కరించుకోవాలని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లలిత్ భాసిన్ సూచించారు. ఈ సందర్భంగా జస్టిస్ వెంకటరామరెడ్డిని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ సెక్రటరీ హెచ్‌సీ ఉపాధ్యాయ సత్కరించారు. సదస్సులో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కోకా రాఘవరావు, ఢిల్లీ హైకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి, సీనియర్ న్యాయవాదులు ఎం. భాస్కరలక్ష్మి, సరసాని సత్యంరెడ్డి, ఎమ్మెస్ ప్రసాద్ వివిధ రాష్ట్రాల న్యాయవాదులు, లా విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు. -
‘ఈజ్ ఆఫ్ జస్టిస్ డెలివరీ’కి ఇదే సమయం
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను హేతుబద్ధీకరించడానికి ఇదే తగిన సమయమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏళ్లుగా సాగుతోన్న కేసుల పరిష్కారానికి ఈ దిశగా యోచించాలని సూచించింది. అలాగే ‘కేస్ మేనేజ్మెంట్’ వ్యవస్థ అందుబాటులోకి రావాలంది. ఢిల్లీలో భూమి కొనుగోలుకు సంబంధించి 1986 నాటి కేసు విచారణ తన ముందుకు వచ్చినప్పుడు ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. 31 ఏళ్లుగా ఒక కేసు కొలిక్కిరాకపోవడం తమకు ఆందోళన కలిగిస్తోందని, ఇరు కక్షిదారులు కూడా కేసు భవితవ్యంపై ధీమాగా లేరని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ఈజ్ ఆఫ్ డూయిం గ్ బిజినెస్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ అనే రెండు పదాలను ఈ మధ్య తరచుగా వింటున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాటను న్యాయ వ్యవస్థకు అనువర్తింపజేస్తే.. మొత్తం వ్యవస్థను హేతుబద్ధీకరించి కేస్ మేనేజ్మెంట్ వ్యవస్థను అమల్లోకి తేవాల్సి ఉందని స్పష్టమవుతోంది. అప్పుడే కేసుల విచారణ వేగవంతమవుతుంది’ అని బెంచ్ పేర్కొంది. -
న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమైనది
లీగల్ (కడప అర్బన్) : సమాజంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమైందని, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సహకరిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని వివిధ కోర్టుల్లో మెజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న అధికారులు, పోలీసు, ఇతర అధికారులకు కేసులకు సంబంధించి పరిష్కారం కోసం శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ హాలులో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల్లో నమోదైన కేసులు చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే రెండు సంవత్సరాల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయని, ఆ సమయం లోపు ఈ కేసులు పూర్తిగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ దేశంలోనే పటిష్టంగా ఉన్న న్యాయ వ్యవస్థ ముందు డేరా బాబా లాంటి వారు కూడా తలవంచిన సంఘటన దేశ వ్యాప్తంగా చెప్పుకోదగిందన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, రెవెన్యూ శాఖలు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనవని, ఇందుకోసం సమన్వయంగా పనిచేసుకుంటూ ప్రజలను శాంతియుత జీవనం గడిపేలా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పోలీసు శాఖకు ఎంతో సహకరిస్తోందని, భవిష్యత్తులో కూడా ఎంతో సహకరిస్తే తమవంతు కీలకమైన ఎర్రచందనం లాంటి కేసులను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు జడ్జి వీవీ శ్రీనివాసమూర్తి, పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు, న్యాయ సేవా«ధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్, అన్వర్‌బాషా, ఎస్.ప్రసాద్, వివిధ కోర్టులకు చెందిన మెజిస్ట్రేట్లు, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, పాల్గొన్నారు. -
పరిపాలనను ప్రభుత్వాలకు వదిలేయండి
న్యూఢిల్లీ: పరిపాలన, చట్టాల రూపకల్పన వంటి విషయాలను న్యాయ వ్యవస్థ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వదిలివేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ‘ఈ మధ్యకాలంలో పరిపాలనా సంబంధమైన విషయాల్లో న్యాయస్థానాల జోక్యం పెరిగిపోవడాన్ని మనం చూస్తున్నాం. పరిపాలనను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వదిలివేయాలి’ అని ప్రసాద్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) నిర్వహించిన సెమినార్లో కమిషన్ చైర్మన్, సుప్రీం మాజీ సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తుతో కలిసి ప్రసాద్ పాల్గొన్నారు. -
సమర్థ పాలనతో తక్కువ భారం
న్యాయవ్యవస్థపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ: సమర్థవంతమైన పరిపాలనతో న్యాయవ్యవస్థపై చాలా భారం తగ్గుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘మేం 1,200 చట్టాలను రద్దు చేశాం. న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. సమర్థ పాలన అంటే.. ముసాయిదా చట్టం తయా రీ నుంచి దాన్ని అమలు చేసే అధికారుల వరకు ఉన్న అనుసంధానమే’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో పనిచేస్తున్న జస్టిస్ దల్వీర్ భండారీ రాసిన ‘జ్యడీషియల్ రిఫామ్స్– రీసెంట్ గ్లోబల్ ట్రెండ్స్’ పుస్తకాన్ని ప్రధాని బుధవారం రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోటీ నేపథ్యంలో మార్పు దిశగా భారత్ వేగంగా పరుగులు పెట్టాలని, ప్రస్తుతం దేశంలో పలు రంగాల్లో చాలా సరళీకరణ ఉందని చెప్పారు. భారతీయులు చాలా సంప్రదాయవాదులని, అయితే మార్పులు వేగంగా వస్తాయని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ త్వరగా నిర్ణయాలు తీసుకోవడం తనకు నచ్చిందని అన్నారు. టెక్నాలజీతో వస్తున్న భారీ మార్పులను దృష్టిలో ఉంచుకుని, దేశం లోని న్యాయ విశ్వవిద్యాలయాలు అలాంటి ప్రతిభను అభివృద్ధి పరచడంపై దృష్టి పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జస్టిస్ ఖేహర్, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంస్కరణలకు తరుణమిదే: రాష్ట్రపతి కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ.. న్యాయ సంస్కరణలపై ప్రతి ఒక్కరూ ఆలోచించడానికే కాకుండా చర్యలు తీసుకోవడానికి కూడా ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల భారత న్యాయవ్యవస్థలో భారీ మార్పులు రావాలని, మార్పనేది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. తగినన్ని మౌలిక సదుపాయాలు లేకుండా సంస్కరణలను తీసుకురాలేమన్నారు. తన పదవీ కాలంలో దేశంలో అతిపెద్దదైన అలహాబాద్ హైకోర్టులో మొత్తం 180 జడ్జీల పోస్టులు ఉండగా అందులో సగం కంటే తక్కువ పోస్టులే భర్తీ అయ్యాయని అన్నారు. న్యాయవ్యవస్థను నిందించకూడదు: సీజేఐ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ మాట్లాడుతూ.. చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నందుకు న్యాయవ్యవస్థను నిందించకూడదన్నారు. అందుకు బదులుగా ప్రభుత్వమే తాను వేసే వ్యాజ్యాలను తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. ‘కొన్ని విషయాల్లో కేసు వేయాలా వద్దా అని తేల్చుకోవడం ప్రభుత్వ విభాగాలకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ విషయాలు సంక్లిష్టమైనపుడు అధికారులెవరూ బాధ్యత తీసుకోడానికి ఇష్టపడక కోర్టులో కేసు వేస్తారు’అని అన్నారు. అయితే ఇక్కడ తాను ప్రభుత్వాన్ని నిందించడం లేదనీ, తన మాటలకు వక్రభాష్యం చెప్పవద్దని కోరారు. ప్రభుత్వ విభాగాలు వేసే కేసుల్లో 10% తగ్గినా, మిగతా కేసులను వేగంగా పరిష్కరించవచ్చన్నారు. -
న్యాయ వ్యవస్థపై తప్పుడు అభిప్రాయం కలుగుతుంది!
‘జబర్దస్త్’ కేసులో ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: ‘టీవీ కార్యక్రమాలు ముఖ్యంగా హాస్య ప్రధాన కార్యక్రమాలను ప్రజలు విస్తృతంగా వీక్షిస్తుంటారు. కొద్దిపాటి అక్షరాస్యత ఉన్న వారు, నిరక్ష్యరాస్యులు, గ్రామీణ నేపథ్యం కలిగిన వారు ఆయా హాస్య ప్రధాన కార్యక్రమాల్లో న్యాయమూర్తులు, న్యాయ వాదులను ఉద్దేశించి పలికే డైలాగులను బట్టి న్యాయ స్థానాల్లో కార్యకలాపాలు ఇలానే జరుగుతాయని నమ్మే అవకాశం ఉంది. అటువంటి కార్యక్రమాలు సాధారణ ప్రజానీకం మనస్సుల్లో న్యాయ వ్యవస్థపై తప్పుడు అభి ప్రాయం కలిగించే ప్రమాదం ఉంది. దీనివల్ల న్యాయ మూర్తులు, న్యాయవాదుల ప్రతిష్టకు, హుందాతనానికి భంగం కలుగుతుంది’ అని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. అయితే జబర్దస్త్ వంటి కార్యక్రమాలపై చట్టపరంగా ఎటువంటి నిషేధంగానీ, నియంత్రణగానీ లేదని, ఇటువంటి వాటి నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందిస్తే తప్ప న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగ జార్చే కార్యక్రమాలను అడ్డుకోవడం కష్టసాధ్యమని తెలిపింది. ఇదే సమయంలో అనిర్ధిష్ట బృందాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కిందకు రావంటూ జబర్దస్త్ టీంపై దాఖలైన కేసును కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. 2014 జూలై 10న జబర్దస్త్ షోలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా స్కిట్‌ను ప్రదర్శించారంటూ సదరు కార్యక్రమం న్యాయనిర్ణేతలు నాగేంద్రబాబు, రోజా, యాంకర్లు అనసూయ, రష్మీ, ఇతర కళాకారులపై న్యాయవాది వై.అరుణ్‌కుమార్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ నాగేంద్రబాబు, రోజా తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. నాగేంద్రబాబు తదితరులపై దాఖలు చేసిన కేసును కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మితిమీరిన జోక్యం సరైంది కాదు
న్యాయవ్యవస్థపై జస్టిస్‌శ్రీకృష్ణ న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ మితిమీరిన జోక్యంతో ఇబ్బందులు తప్పవని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అభిప్రాయపడ్డారు. దీనివల్ల శాసన, న్యాయవ్యవస్థలు నష్టపోతాయన్నారు. ‘న్యాయమూర్తుల పాత్ర క్రికెట్లో అంపైర్‌లా ఉండాలి. ఆటగాళ్లు నిబంధనలకు అనుగుణంగా ఆడుతున్నారా లేదా చూడాల్సిన బాధ్యత అంపైర్‌ది. అంతేకాని బ్యాట్స్‌మన్ ఆడటం లేదని తనే బ్యాట్ తీసుకుని సిక్స్ కొట్టాలనుకోకూడదు’ అని మంగళవారం ఢిల్లీలో ‘పార్లమెంటు, న్యాయవ్యవస్థ’అనే అంశంపై జరిగిన సదస్సులో చెప్పారు. ఆర్టికల్ 21 (ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించే)ను కాపాడేందుకు ఆర్టికల్ 142 (స్వతంత్ర అధికారం)ను న్యాయవ్యవస్థ వినియోగించుకోవాలని చూస్తోందన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో, పూర్తి న్యాయం జరగటం లేదని అనుకున్నప్పుడు మాత్రమే సుప్రీం జోక్యం చేసుకునేందుకు అధికారం ఉందన్నారు. ‘పార్లమెంటు వ్యవస్థ నమ్మకాన్ని కోల్పోతోంది. ఆ స్థానాన్ని న్యాయవ్యవస్థ భర్తీ చేస్తోంది. అలాగని న్యాయవ్యవస్థ మితిమీరిన జోక్యం చేసుకోకూడదు. పౌరులు ఓట్లేస్తేనే దేశం నడుస్తోంది. న్యాయమూర్తులు దేశాన్ని నడిపించలేరు’అని బీఎన్ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. -
కేసుల్లో ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్
► న్యాయవ్యవస్థపై భారం తగ్గించాలి: ప్రధాని మోదీ ► ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసు అమలుపై చర్చ జరగాలన్న మోదీ ► న్యాయ విలువలు పాటించడంలో రాజీపడొద్దు: సీజేఐ ఠాకూర్ ► సర్దార్ పటేల్‌కు మోదీ నివాళులు.. ఘనంగా ఏక్తా దివస్ ► సైన్యంతో కలసి మోదీ దీపావళి వేడుకలు ఉపాధ్యాయుడు తన పదవీకాలంపై కోర్టు కేసు గెలిస్తే.. ఆ తీర్పును మిగతా వారికి ఉపయోగపడేలా కొలమానంగా ఉపయోగించాలి. ‘లిటిగేషన్ పాలసీ’ ఖరారు చేయడంలో కేంద్రం విఫలమైంది. తాజా పరిణామాల దృష్ట్యా ఈ పాలసీ నమూనా బిల్లులో మార్పులు జరుగుతున్నాయి. కేసుల్లో తుది నిర్ణయం కోర్టులకు వదిలేయాలన్న అంశంపై స్పష్టత అవసరం. – నరేంద్ర మోదీ న్యూఢిల్లీ/సిమ్లా: కోర్టుల్లోని కేసుల్లో ప్రభుత్వమే అతి పెద్ద లిటిగెంట్(కక్షిదారు) అని, వీటి పరిష్కారానికే న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోర్టులపై ఈ భారాన్ని తగ్గించాల్సిన అవసరముందని, అందుకోసం జాగ్రత్తగా పరిశీలించాక కేసులు వేయాలని సూచించారు. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవాల్లో సోమవారం ఆయన ప్రసంగిస్తూ... దేశంలో ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసు(ఏఐజేఎస్)ను ప్రారంభించాల్సిన అవసరముందన్నారు. పదవీకాలం, పరోక్ష పన్నులు, ఇతర అంశాల కు సంబంధించి కోర్టుల్లోని 46 శాతం కేసు ల్లో ప్రభుత్వం లిటిగెంట్‌గా ఉందని మోదీ చెప్పారు. ‘ఉపాధ్యాయుడు తన పదవీకాలంపై కోర్టు కేసు గెలిస్తే ఆ తీర్పును మిగతా వారికి ఉపయోగపడేలా కొలమానంగా ఉపయోగించాలి. ‘లిటిగేషన్ పాలసీ’ నమూనా బిల్లులో మార్పులు జరుగుతున్నాయి. కేసుల్లో తుది నిర్ణయం కోర్టులకు వదిలేయాలన్న దానిపై స్పష్టత కావాలి’ అని అన్నారు. న్యాయవ్యవస్థకు చెడ్డపేరు: సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ మాట్లాడుతూ... న్యాయ విలువలపై ఎప్పుడూ రాజీపడకూడదని, అవకతవకలు మొత్తం న్యాయవ్యవస్థకే అప్రతిష్ట తీసుకొస్తున్నాయని అన్నారు. జడ్జీలు ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా వృత్తిపరమైన నిజాయితీ కలిగి ఉండాలని సూచించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసంగిస్తూ... తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని జడ్జీలు మాట్లాడుకోవడం విన్నానన్నారు. ఈ ఆరోపణలను కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వేదికపైనే ఖండించారు. అందరివాడు పటేల్ : మోదీ భారత్‌ను శక్తిమంత మైన జాతిగా తీర్చిదిద్దాలని, విభజన శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 141వ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహించారు. ప్రధాని మాట్లాడుతూ... ‘రాజకీయ దృఢ సంకల్పంతో సర్దార్ పటేల్ భారత్‌ను సంఘటిత పరిచారు ’ అని అన్నారు. పటేల్ జ్ఞాపకార్థం ఢిల్లీలో డిజిటల్ మ్యూజియాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. ‘పటేల్ కాంగ్రెస్ నేత . నాది బీజేపీ . అయినా జయంతి వేడుకలను అదే ఉత్సాహంతో జరుపుకోవడమే మంచి ఐక్యతాసందేశం’ అని మోదీ అన్నారు. స్వతహాగా గుజరాతీ అయిన గాంధీ.. మరో గుజరాతీని(పటేల్) ప్రధానిగా ఎంపిక చేయలేదని సరదాగా అన్నారు. ఢిల్లీలోని పటేల్ చౌక్‌లో పటేల్ విగ్రహానికి మోదీ పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఇండియా గేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్టాంపు విడుదల చేశారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొనడానికి వచ్చిన పిల్లలతో ప్రధాని సమైక్యతా ప్రతిజ్ఞ చేయించి... అనంతరం పరుగును ప్రారంభించారు. కాగా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 32వ వర్ధంతి సందర్భంగా మోదీ నివాళులర్పించారు. సైన్యంతో కలసి దీపావళి వేడుకలు హిమాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల్లో ఆదివారం సైన్యంతో కలసి ప్రధాని మోదీ దీపావళి పండుగ జరుపుకున్నారు. ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లో హాజరైన మోదీ.. ఇండో-టిబెటియన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), డోగ్రా స్కౌట్స్‌తో పాటు జవాన్లను కలుసుకున్నారు. సుమ్డోలో జవాన్లకు మోదీ స్వీట్లు తినిపించారు. యాపిల్స్‌కు ప్రసిద్ధి చెందిన ఛాంగో గ్రామంలో మహిళలు, చిన్నారులతో కాసేపు గడిపారు. ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛన్’ కోసం రూ.5,500 కోట్లు విడుదల చేశామని, సైనికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. కొద్దిరోజులుగా జవాన్లు అలుపు లేకుండా పనిచేస్తున్నారని.. వారి త్యాగం వెలకట్టలేనిదని ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రతి పౌరుడు సైనికులను చూసి గర్వపడాలన్నారు. అలాగే దీపావళి సందర్భంగా ‘సందేశ్ 2 సోల్జర్స్’ అభ్యర్థనకు స్పందించిన వారికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. -
నియంతలా న్యాయ వ్యవస్థ: జేపీ
హైదరాబాద్: న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభాగ్యులకు సత్వర న్యా యం అందేలా చూసినప్పుడే న్యాయవాద వృత్తికి సార్ధకత చేకూరుతుందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. సోమాజిగూడలో మినర్వా కాఫీషాప్‌లో ఆది వారం ‘లా స్కూల్101.. క్రిసెండో-2016’ పేరుతో నిర్వహించిన మ్యూట్ కోర్ట్‌లో ఆయన పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తమను తామే న్యాయమూర్తులుగా నియమించుకునే విధానం సరైంది కాదన్నారు. అత్యున్నత న్యాయవ్యవస్థ నియంతలా వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి ది కాదన్నారు. దేశంలో దాదాపు 3కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వ్యాజ్యాల పరిష్కారంలో సుదీర్ఘ జాప్యం తో వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం న్యాయ విద్యార్థులకు జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజశేఖర్ గోపాల జోస్యుల, పవన్ కళ్లెం, సత్యేంద్రసింగ్, సునీల్ నీలకంఠన్, శ్లోక, వెన్నల కృష్ణ సహా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థలో మీడియా జోక్యం తగదు
నిర్బంధ ఉద్యోగ విరమణ వెనుక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రమేయం: రిటైర్డ్ జడ్జి ఎం.కృష్ణప్ప నెల్లూరు(లీగల్): న్యాయవ్యవస్థలో కొన్ని మీడియా సంస్థలు మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాయని, ఇది తగదని నెల్లూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ (5వ అదనపు) జడ్జి ఎం.కృష్ణప్ప అన్నారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక న్యాయవాదుల సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్ప మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబంలో జన్మించి పలువురి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగానని, బాధ్యతల నిర్వహణలో ప్రలోభాలకు తలొగ్గక నీతి, నిజాయితీలతో పనిచేశానని తెలిపారు. ఫలితంగా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అనంతపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వచ్చిన ఓ పరువునష్టం కేసులో అన్ని ఆధారాలు ఉండటంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చానన్నారు. దీంతో అప్పటి నుంచి ఆ విషయం మనసులో పెట్టుకొని తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాడన్నారు. తనపై గతంలో అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికల్లో వాటిని ప్రచురించి హైకోర్టు ద్వారా తనను సస్పెండ్ చేయించారని తెలిపారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు విచారణ జరిపి తనకు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. తనను నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించడం వెనుక రాధాకృష్ణతో పాటు కొన్ని శక్తులు పనిచేశాయని ఆరోపించారు. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో ఏ వేదికపైన అయినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దమ్మున్న చానల్ అని చెప్పుకుంటున్న ఏబీఎన్ యజమాని దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. -
న్యాయవ్యవస్థలోకి రండి
న్యాయ విద్యార్థులకు సుప్రీం సీజే జస్టిస్ ఠాకూర్ పిలుపు * బహుళ జాతి సంస్థల్లో మగ్గొద్దు.. అక్కడ డబ్బున్నా సంతృప్తి ఉండదు * ఒకప్పుడు సీటు దొరక్కపోతే లా.. ఇప్పుడు బాగా డిమాండున్న కోర్సు * న్యాయవాదులు ఆర్జిస్తున్నంత డబ్బు ఎవరూ ఆర్జించడం లేదు * సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాలని సూచన సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని, ప్రజలకు సత్వర న్యాయం అందేందుకు న్యాయవ్యవస్థలోకి రావాలని యువ న్యాయ విద్యార్థులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరథ్ సింగ్ ఠాకూర్ కోరారు. న్యాయ విద్య పూర్తయిన తరువాత బహుళ జాతి సంస్థల్లో చేరితే ఆర్థికంగా లాభమున్నా, వృత్తిపరంగా ఆత్మ సంతృప్తి ఉండదన్నారు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న నల్సార్ వర్సిటీ 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఖాద్రీ, జస్టిస్ పి.వెంకటరామిరెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, నల్సార్ వీసీ ఫైజన్ ముస్తాఫా, రిజిస్ట్రార్ వి.బాలకిష్టారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ కోర్సులను పూర్తి చేసిన వారికి జస్టిస్ ఠాకూర్ డిగ్రీలు ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి బంగారు పతకాలు అందచేశారు. తాన్యా చౌదరి అనే విద్యార్థిని ఏకంగా 17 బంగారు పతకాలు సాధించారు. ప్రజలకు సేవ చేయండి డిగ్రీల ప్రదానం అనంతరం జస్టిస్ ఠాకూర్ మాట్లాడారు. ‘‘ఒకప్పుడు లా కోర్సు అంత పాపులర్ కాదు. ఇతర కోర్సుల్లో సీట్లు దొరక్కపోతే లా కోర్సులో చేరేవారు. ఇప్పుడు దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో లా ఒకటి. దేశంలో ప్రస్తుతం విజయవంతమైన న్యాయవాదులు ఆర్జిస్తున్నంత డబ్బును ఇతర రంగాల్లో ఏ వ్యక్తీ ఆర్జించడం లేదు. న్యాయవ్యవస్థలోకి వచ్చి కొన్ని సవాళ్లను ఎదుర్కొని, కొంత కృషి చేస్తే మీరూ ఆ స్థాయికి చేరుకోగలరు. ఈ వృత్తిలో చూడాల్సింది ఎంత డబ్బు సంపాదించామని కాదు.. కేసులను వాదించడం ద్వారా, తీర్పులివ్వడం ద్వారా ఎంత ఆత్మ సంతృప్తి సాధించామన్నదే. మీరు దేవుళ్ల ప్రతినిధులు. వారు చేయాల్సిన న్యాయాన్ని మీ చేత చేయించేందుకు మీ చేత న్యాయశాస్త్రం అభ్యసింపజేశారు. జడ్జీలు తమ బాధ్యతలను తపస్సులాగా నిర్వర్తించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఘోర తపస్సు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మేం అదే చేస్తున్నాం. వీటన్నింటికీ వెనుకాడకుండా ముందుకెళితే ప్రజలు మనల్ని నెత్తినపెట్టుకుని ఆరాధిస్తారు..’’ అని పేర్కొన్నారు. మనతో పాఠాలు చెప్పించుకోవాలి దేశంలో న్యాయ పాలన సక్రమంగా సాగేందుకు యువ న్యాయ విద్యార్థులు న్యాయవ్యవస్థలోకి రావాలని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. మనకు ఇప్పుడు 19 న్యాయ యూనివర్సిటీలు ఉన్నాయని, అయినా ఎల్ఎల్బీ తరువాత ఉన్నత చదువుల కోసం పాశ్చాత్య దేశాల వైపు చూస్తున్నామని చెప్పారు. బోధనా రంగంలో నాణ్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. ఈ పరిస్థితిని అధిగమించి బోధనా రంగంలో ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పితే మనం ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి యూనివర్సిటీలకు వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం లేదని... వాళ్లే ఇక్కడికొచ్చి మన చేత పాఠాలు చెప్పించుకుంటారని చెప్పారు. న్యాయమూర్తుల కొరత ఎక్కువగా ఉంది సత్వర న్యాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, కానీ న్యాయమూర్తుల కొరత ఎంతో ఉందని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. అమెరికాలో పది లక్షల జనాభాకు 150 మంది జడ్జీలుంటే, మనదేశంలో 18 మంది మాత్రమే ఉన్నారన్నారు. దేశంలోని అన్ని కోర్టుల్లో 3 కోట్ల పెండింగ్ కేసులుంటే.. వాటిని పరిష్కరించేందుకు 18 వేల మంది జడ్జీలే ఉన్నారన్నారు. 5, 10, 20 ఏళ్ల నాటి కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని.. ఐదేళ్లకు పైబడి కొనసాగుతున్న కేసులను సున్నాకు తీసుకురావాలన్న లక్ష్యంతో తామంతా పనిచేస్తున్నామని చెప్పారు. న్యాయవ్యవస్థలోకి వచ్చిన తరువాత ఎందుకొచ్చామా అనే భావన ఉండొద్దని విద్యార్థులకు సూచించారు. ‘‘నేను మొదట ఇంజనీరింగ్‌లో చేరాను. తర్వాత మా నాన్న సూచన మేరకు లా లో చేరాను. 22 ఏళ్ల పాటు న్యాయవాదిగా, 23 ఏళ్లుగా న్యాయమూర్తిగా ఉన్నాను. ఈ 45 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ వృత్తిలోకి ఎందుకొచ్చానా అని భావించలేదు. బోధన, వైద్య వృత్తులు గొప్పవే.. వాటన్నింటి కంటే న్యాయ వృత్తి ఇంకా గొప్పది..’’ అని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. -
స్పీకర్ నిర్ణయానికి గడువు పెట్టాలి
- ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు - రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రస్తుతం అమలులో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కొన్ని కీలకమైన సవరణలు చేస్తూ ఒక ప్రైవేటు బిల్లును ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన ఈ నెల 8వ తేదీన రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు ఒక నోటీసును ఇచ్చారు. తాను ప్రస్తుత చట్టంలోని 316-బిలోని కొన్ని అంశాలకు సవరణలు ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు. చట్టసభలో ఓ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ (రాజ్యసభ లేదా లోక్‌సభ) మరో పార్టీలోకి వెళ్లినపుడు అతనిని అనర్హుడిని చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా నియమిత వ్యవధిలో ఆయన నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ప్రస్తుత చట్టంలో లేదు. విజయసాయిరెడ్డి దానిని సవరించాలని సూచించారు. ఫిరాయించిన సభ్యుడి అనర్హతకు సంబంధించి ఫిర్యాదు అందిన ఆరు నెలలలోపు దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించారు. ఫిరాయించిన చట్టసభ సభ్యుడిపై చట్టం ప్రకారం అనర్హత వేటు పడితే అతని పదవీ కాలం పూర్తయ్యేవరకూ లేదా అతను మళ్లీ ఎన్నికయ్యేవరకూ లాభదాయకమైన రాజకీయ పదవిని చేపట్టరాదనేది ప్రస్తుత నిబంధనగా ఉంది. కానీ ఫిరాయించిన సభ్యునిపై స్పీకర్ వద్ద ఫిర్యాదు నమోదైన రోజు నుంచీ, ఆ ఫిర్యాదుపై స్పీకర్ చర్య తీసుకునేవరకూ లాభదాయకమైన రాజకీయ పదవి ఏదీ చేపట్టకూడదని సవరించాలని ప్రతిపాదించారు. ఒక వేళ ఫిరాయించిన సభ్యునిపై అనర్హత వేటు పడితే, అతని మిగతా పదవీకాలం ముగిసేవరకూ కూడా ఎలాంటి లాభదాయకమైన పదవీ చేపట్టకూడదని కూడా ఉండాలన్నారు. ఇక 361-బిలోని పేరా 6(2) ప్రకారం స్పీకర్‌కు వచ్చే అనర్హత ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు ఒక కాల పరిమితి అంటూ ఏమీ లేదు. ఇపుడు విజయసాయిరెడ్డి తన బిల్లులో ఆరు నెలలలోపుగా నిర్ణయం తీసుకునే విధంగా మార్పు చేయాలని సవరించారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకునే విధంగా అనుమతిని ఇవ్వాలని కోరారు. -
ఎనిమిదేళ్లు దాటితే మిలటరీ శిక్షణ
వైదిక్ విచారిక్ సంస్థకు ప్రత్యేక ఆర్మీ - మథుర ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు - రాం వృక్ష యాదవ్‌తోనే భారత్‌కు విముక్తి అని పిల్లలకు పాఠాలు మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన ఘర్షణల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసులపై దాడి చేసిన ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ సంస్థ సొంత సైన్యాన్ని రూపొందించుకునే ప్రయత్నంలో భాగంగా.. చిన్నారుల చేతికే తుపాకులిచ్చి శిక్షణ ఇస్తోందని యూపీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ‘ఎనిమిదేళ్ల చిన్నారులకు తుపాకులిచ్చి.. లక్ష్యాన్ని గురిపెట్టి కాల్చటంలో శిక్షణనిస్తున్నారు. బాంబులు రువ్వటం, ప్రత్యర్థులపై రాళ్లతో దాడిచేయటం వంటివీ నేర్పిస్తున్నారు. ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని ఏర్పాటుచేసుకుని సమాంతరంగా జైళ్లు, న్యాయ వ్యవస్థను నడుపుతున్నారు. ప్రత్యేకంగా సైనిక దళం కూడా ఏర్పాటు చేసుకున్నారు’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో దాక్కున్న పెద్లోళ్లను జైళ్లకు, చిన్నారులను పునరావాస కేంద్రాలకు పోలీసులు తరలించారు. పోలీసులపై దాడి సమయంలో తమ చుట్టూ బాంబులున్నాయని.. వీటిని పోలీసులపైకి రువ్వుతూనే ఉన్నారని చిన్నారులు తెలిపారు. ‘గొడవ మొదలవగానే.. మేం చెట్ల వెనక దాక్కున్నాం. మా చుట్టూ బాంబులున్నాయి. మా వాళ్లు పోలీసులపై రాళ్లు రువ్వారు. రెండువైపుల నుంచి తుపాకులతో కాల్పులు జరిగాయి’ అని ఓ బాలుడు చెప్పాడు. తన ఇద్దరు సోదరులు (8 ఏళ్లు, 12 ఏళ్లు) తల్లి ఇంకా జైలులోనే ఉన్నారన్నాడు. ‘వాళ్లంతా ఒకచోట గుమిగూడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గొద్దని మా నేత చెప్పాడు. దేనికైనా తెగిద్దాం. పోరాటం చేద్దామని అన్నాడు. అందుకు కావాల్సిన బాంబులు, ఆయుధాలను కొందరు సిద్ధం చేశారు’ అని మరో బాలుడు తెలిపాడు. పోలీసులపై దాడి జరిగినప్పుడు తమ వారి చేతుల్లో, తమ చుట్టూ బాంబులున్నాయని.. ఎటెళ్లాలో తెలియక చెట్టుచాటున నక్కామన్నాడు.‘మాకు రాం వృక్ష యాదవ్ అనే నాయకుడున్నాడు. ఆయన భారత్‌కు విముక్తి కల్పిస్తాడని మా అత్త చెప్పింది. ఆయన మనకు బంగారు నాణేలిస్తాడని.. భారత్‌లో ఆ కరెన్సీ మాత్రమే చెల్లుబాటు అవతాయంది’ అని సంకేత్ (పేరు మార్చారు) అనే బాలుడు చెప్పాడు. కాగా, ఈ గొడవల్లో రాం వృక్ష యాదవ్ చనిపోయిన విషయం తెలిసిందే. మథుర ఘర్షణలో 29కి పెరిగిన మృతులు మథుర: ఉత్తరప్రదేశ్ మథురలో గురువారం చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో మృతుల సంఖ్య 29కి పెరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఆదివారం మరణించినట్టు పోలీసులు తెలిపారు. వీరిని గుర్తించలేకపోయామన్నారు. జవహర్‌బాగ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతల సందర్భంగా జరిగిన ఈ ఘర్షణలపై అలిఘడ్ డివిజనల్ కమిషనర్ చంద్రకాంత్ మిశ్రా విచారణకు ఆదేశించారు. ఇప్పటి వరకు మూడు వేల మంది ఆక్రమణదారులపై 45 కేసులు నమోదు చేశామని మథుర ఎస్పీ రాకేష్‌సింగ్ తెలిపారు. వీరంతా నేతాజీ సుభాష్‌చంద్రబోస్ సానుభూతిపరులుగా చెప్పుకొంటున్న ‘ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ సంస్థకు చెందినవారని వెల్లడించారు. ఆందోళనకారుల బృందానికి నాయకత్వం వహించిన రామ్ వృక్ష యాదవ్‌కు మారణాయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకొనేందుకు ఆర్థికంగా సహకరించిన వారి వివరాలను సేకరిస్తున్నట్టు చంద్రకాంత్ చెప్పారు. ఘటన రోజు జరిపిన కాల్పుల్లో మృతిచెందినవారిలో రామ్ వృక్ష కూడా ఉన్నాడు. ఈ ఘర్షణల నేపథ్యంలో అఖిలేశ్‌యాదవ్ సారథ్యంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ హింసకు రాష్ట్ర మంత్రి, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సోదరుడు శివపాల్‌సింగ్ యాదవ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని యూపీకి చెందిన కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి డిమాండ్ చేశారు. -
ప్రధాని సమక్షంలో సీజేఐ కంటతడి
న్యాయ వ్యవస్థపై ఏమిటీ విమర్శలు? ♦ జస్టిస్ ఠాకూర్ భావోద్వేగం ♦ సీఎంలు, హైకోర్టుల సీజేల సదస్సులో ఉద్వేగ ప్రసంగం ♦ సీజేఐ ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ప్రధాని ♦ మంత్రులు, సుప్రీం సీనియర్ జడ్జీలతో చర్చకు ప్రతిపాదన న్యూఢిల్లీ: దేశంలో జడ్జీలు అసాధారణ స్థాయిలో పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య నెలకొన్న భారీ అంతరాన్ని గణాంకాలతో సహా వివరిస్తూ పలుమార్లు కంటతడి పెట్టారు! అది కూడా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే!! పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై చర్చించేందుకు ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైన అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సులో సీజేఐ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తీవ్రంగా ఉన్న జడ్జీల కొరత, జడ్జీలపై పని భారం, మౌలిక వసతుల కల్పనలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆధిపత్య పోరు.. ఇలా పలు అంశాలను స్పృశిస్తూ మోదీ సమక్షంలోనే భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ క్రమంలో మూడుసార్లు భావోద్వేగానికి గురై, ఉబికి వస్తున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకున్నారు. ‘దేశంలో కేసులు గుట్టలా పేరుకుపోతున్నాయి. వాటిని విచారణకు స్వీకరించేందుకు తగినంత మంది జడ్జీలు లేరు. మున్సిఫ్ కోర్టు జడ్జి నుంచి సుప్రీంకోర్టు జడ్జి వరకు ఏటా సగటున 2,600 కేసులను పరిష్కరిస్తున్నారు. అదే అమెరికాలో జడ్జీలు ఏటా సగటున పరిష్కరిస్తున్నది 81 కేసులే’’ అని వివరించారు. జడ్జీల సామర్థ్యానికీ పరిమితి ఉంటుందన్నారు. ‘కక్షిదారులు, జైళ్లలో మగ్గుతున్న వారి తరఫునా, దేశాభివృద్ధి, పురోగతి కోసం మిమ్మల్ని వేడుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా స్పందించండి. పెండింగ్ కేసుల విషయంలో న్యాయ వ్యవస్థపై విమర్శలు సరి కాదని అర్థం చేసుకోండి ’ అంటూ ప్రధానిని ఉద్దేశించి గద్గద స్వరంతో అన్నారు. కోట్లలో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి జడ్జీల సంఖ్యను ప్రస్తుతమున్న 21 వేల నుంచి 40 వేలకు పెంచాల్సి ఉన్నా (1987 నాటి సిఫార్సు) కేంద్రం నిష్క్రియగా వ్యవహరిస్తోందని సీజేఐ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసుల భారాన్ని పూర్తిగా న్యాయ వ్యవస్థపైనే నెట్టేయడం కుదరదని, అది సరికాదని తేల్చిచెప్పారు. నియామకాలు దశాబ్దాలుగా పెండింగే 1987లో ప్రతి 10 లక్షల మంది ప్రజలకు 10 మందిగా ఉన్న జడ్జీల సంఖ్యను 50కి పెంచాలని న్యాయ కమిషన్ ఆ ఏడాది సిఫార్సు చేసిందని సీజేఐ ఠాకూర్ గుర్తుచేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని 2002లో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించిందని, ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని పార్లమెంటు స్థాయీ సంఘం సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. కానీ నాటి నుంచి ప్రభుత్వ నిష్క్రియాపరత్వం యథాతథంగా కొనసాగుతూనే ఉందన్నారు. ఫలితంగా నేటికీ దేశంలో ప్రతి 10 లక్షల మంది ప్రజలకు 15 మంది జడ్జీలే ఉన్నారని సీజేఐ తెలిపారు. ఇది అమెరికా, యూకే, కెనడాలలోకన్నా చాలా తక్కువన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ప్రస్తుతం సుమారు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వారం రోజుల్లో కొలీజియం నిర్ణయం దేశవ్యాప్తంగా జడ్జిల నియామకాలకు సంబంధించి మార్చిన విధివిధానాలను సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయిస్తుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ వెల్లడించారు. న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత కోసం కేంద్రం చేసిన సూచనలపై కొలీజియం చర్చించి వారం రోజుల్లో సమాధానం పంపించనున్నట్లు ఠాకూర్ తెలిపారు. సమస్యను పరిష్కరిద్దాం: ప్రధాని సీజేఐ ఠాకూర్ ఆవేదనపై ప్రధాని నరేంద్ర మోదీ అదే వేదికపై తక్షణం స్పందించారు. నిజానికి న్యాయ శాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం సదస్సులో ప్రధాని ప్రసంగం లేదు. అయినప్పటికీ ఆయన అప్పటికప్పుడు ఈ అంశంపై మాట్లాడారు. ‘‘1987 నుంచి ఎంతోకాలం గడచిపోయినందున ఈ విషయంలో సీజేఐ బాధను అర్థం చేసుకోగలను. రాజ్యాంగపరమైన అడ్డంకులు తలెత్తకుంటే మంత్రులు, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీలు అంతర్గతంగా సమావేశమై ఈ అంశానికి పరిష్కారం కనుక్కోవచ్చు’’ అంటూ ప్రధాని ప్రతిపాదించారు. అడ్‌హక్ జడ్జీలుగా మాజీలు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం దిశగా సీఎంలు, హైకోర్టుల సీజేల సదస్సు కీలక ముందడుగు వేసింది. రిటైరైన న్యాయాధికారులను అడ్‌హక్ జడ్జీలుగా నియమించేందుకు ఆర్టికల్ 224(ఏ)ను ప్రయోగించాలని తీర్మానించింది. ఈ విషయాన్ని సీజేఐ ఠాకూర్ ప్రకటించారు. గత ఐదేళ్లలో అప్పీళ్లపై విచారణ జరగని క్రిమినల్ కేసులను అడ్‌హక్ జడ్జీలు విచారిస్తారని వెల్లడించారు. రెండేళ్ల పదవీకాలం లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఈ జడ్జీలను నియమిస్తారన్నారు. -
న్యాయ పరిరక్షణలో పీపీలే కీలకం
జస్టిస్ ఎన్వీ రమణ సాక్షి, విజయవాడ: న్యాయాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ న్యాయవాదులు కీలకభూమిక పోషించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సూచించారు. శనివారం విజయవాడలో జరిగిన ‘అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ తొలి సమావేశంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ... ప్రజలకు న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ఏపీపీలు (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు), న్యాయమూర్తులు వమ్ము చేయవద్దన్నారు. నిందితులకు శిక్ష పడటం అవసరమేనని, కానీ ఏపీపీలు తమ పరిధులు దాటవద్దన్నారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ బాధితులకు న్యాయంచేయాల్సిన బాధ్యత ఏపీపీలపై ఉందన్నారు. న్యాయ విచారణ ప్రాథమిక హక్కుగా గతం లో సుప్రీంకోర్టు అభిప్రాయపడిందన్నారు. హత్యలు, దోపిడీ, అత్యాచారాలు తదితర నేరాల్లో శిక్షలు తక్కువగా పడుతున్నాయన్నా రు. సత్వర న్యాయం జరగకపోతే బాధితులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. న్యాయవాదిగా ఉన్న రోజుల్లో... తాను న్యాయవాదిగా ఉన్న రోజుల్లో అయ్యప్పరెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశానని, ఒక కేసుకు ఇద్దరం హాజరుకాగా, ఏపీపీ కేసును సరిగా వాదించకపోవడాన్ని ఆయన తన దృష్టికి తీసుకువచ్చారని జస్టిస్ రమణ తెలిపా రు. అదే సందర్భంలో అయ్యప్పరెడ్డి తన అనుభవాన్ని నాకు చెబుతూ ‘ఒక కేసులో డిఫెన్సు న్యాయవాదిగా బాగా వాదించానని, అయితే ఏపీపీ వచ్చి ఈ కేసు నువ్వు గెలుస్తావా.. అని నన్ను ప్రశ్నించారు. నేను తప్పకుండా గెలుస్తానని చెప్పగా, ఏపీపీ తన జేబులోంచి ఒక కాగితం నాకు ఇచ్చారు. ఈ రోజు ‘బండెడు కట్టెలు’ పంపమని న్యాయమూర్తి పబ్లిక్ ప్యాసిక్యూటర్కు రాసిన చీటి అది. దీం తో కొద్దిగా నిరాశకు లోనైనా కేసు మాత్రం గెలిచా’ అని అయ్యప్పరెడ్డి వివరించినట్లు జస్టిస్ రమణ వెల్లడించారు. దక్షిణాదిలోనే కేసులు వేగవంతం... ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదిలోనే కేసులు వేగవంతంగా నడుస్తున్నాయని జస్టిస్ రమణ తెలిపారు. తాను సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న ఈ రెండేళ్ల కాలంలో 1984 నాటి కేసులు ఇప్పటికీ విచారణకు వస్తున్నాయన్నా రు. తెలుగు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్ని ఏడాది నుంచి మూడేళ్లులోపు పరిష్కారిస్తున్నారని తెలిపారు. జస్టిస్ జి.భవానీప్రసాద్, లా సెక్రటరీ దుర్గాప్రసాద్, ఇన్చార్జి డెరైక్టర్ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సీసీ సుబ్రహ్మణ్యం, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
‘ప్రైవేటు’లోనూ రిజర్వేషన్లు అవసరం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయు హైదరాబాద్: ప్రైవేటు రంగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 85 శాతం మంది దళితులకు ఏ రకమైన భూమి లేదు. ఎన్నో ఏళ్లుగా వీరంతా అసమానతకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చేయూతనిచ్చేందుకు, వారిని పారిశ్రామికంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాం.’ అని అన్నారు. న్యాయ వ్యవస్థలోనే రిజర్వేషన్లు అమలు కావడం లేదని, కుల ధ్రువీకరణ పత్రాల కోసం అవస్థలు పడాల్సి వస్తోందని సొసైటీ అధ్యక్షుడు మురళీధర్‌రావు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచిస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు, ఎస్సీలకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటివి చేపడుతున్నామని చెప్పారు. సెమినార్లో టీఆర్ఎస్ చీఫ్‌విప్ కొప్పు ల ఈశ్వర్, మాజీ మంత్రి గీతారెడ్డి, ప్రజాగాయకుడు గద్దర్, వేములపల్లి వెంకట్రామయ్య, ఎం.జానయ్య పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని నిలబెడదాం
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ తలుపుతట్టే కక్షిదారులతో ప్రేమగా మాట్లాడి, వారి సమస్య పరిష్కారం అయ్యే దిశగా మార్గనిర్దేశనం చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలే న్యాయశాఖ ఉద్యోగులకు సూచించారు. ఆదివారం నగరంలో జరిగిన అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ సదస్సుకు జస్టిస్ బొసాలే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయమూర్తులు, ఉద్యోగులు, సిబ్బంది కలిపితే న్యాయవ్యవస్థ అని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలూ విఫలమైన తర్వాత చిట్టచివరి ఆశగా ప్రజలు న్యాయవ్యవస్థ వద్దకు వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతే అది అరాచకానికి దారి తీస్తుందని... ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎలాగైనా నిలబెట్టాలని ఉద్యోగులకు సూచించారు. ప్రతి మనిషి విజయం వెనుక మహిళ ఉంటే...న్యాయమూర్తుల విజయం వెనుక నిరంతరం కష్టించే ఉద్యోగులు, సిబ్బంది ఉంటారని ప్రశంసించారు. న్యాయమూర్తులు సమర్థవంతంగా తీర్పులు వెలువరించడంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎంతోమంది ఉద్యోగులు కోర్టు వేళలు ముగిసిన తర్వాత కూడా పనిచేస్తున్నారని, కేసుల జాబితా రూపొందించడంతోపాటు న్యాయమూర్తులకు కేసు ఫైళ్లను చేరవేస్తున్నారని ప్రశంసించారు. న్యాయశాఖ ఉద్యోగుల సంక్షేమం కోసం జస్టిస్ జగన్నాథశెట్టి కమిషన్ చేసిన సిఫార్సుల్లో దేశంలోనే మొదటిసారిగా ఉమ్మడి హైకోర్టు చాలావాటిని అమలు చేసిందని తెలిపారు. అమలుకు నోచుకోని మరిన్ని సిఫార్సులను కూడా త్వరలోనే అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చిన తర్వాత సర్టిఫైడ్ కాపీలను ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని... కక్షిదారులకు ఇబ్బంది కలగకుండా ఉద్యోగులు చూసుకోవాలని సూచించారు. న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, న్యాయమూర్తులతో కలసి ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు సత్వర న్యాయం అందించాలని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి అన్నారు. సహనం, శాంత స్వభావంతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని... న్యాయశాఖ ఉద్యోగులు ఈ రెండు లక్షణాలను అలవర్చుకోవాలని జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుతో పోలిస్తే న్యాయశాఖ ఉద్యోగుల పనితీరు భిన్నంగా ఉంటుందని, జస్టిస్ జగన్నాథశెట్టి కమిషన్ సిఫార్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ షకీల్‌అహ్మద్ మోయిన్ అన్నారు. న్యాయవ్యవస్థ సున్నితంగా నడవడం వెనుక ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని, న్యాయమూర్తుల తరహాలోనే ఉద్యోగులు, సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించాలని సంఘం జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి బోద లక్ష్మారెడ్డి అన్నారు. తమ సంఘం కృషి ఫలితంగానే అన్ని రాష్ట్రాలు శెట్టి కమిషన్ సిఫార్పులు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. సమావేశంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని, హైకోర్టు రిజిస్ట్రార్ ముత్యాలనాయుడు, ఏపీ, టీఎస్ రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, గోపీనాథ్‌రెడ్డి, జగన్నాథం, రాజశేఖర్‌రెడ్డి, నేతలు సురేశ్‌శర్మ, సురేశ్ ఠాకూర్, శ్రీధర్‌రావు, సుబ్బయ్య, నల్లారెడ్డి, కృష్ణనాయక్, రాజిరెడ్డి, నరసింహారెడ్డి, సుబ్రమణ్యంలతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శిగా లక్ష్మారెడ్డి అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా బోద లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలో నిర్వహించిన జాతీయ సదస్సులో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ప్రధాన కార్యదర్శిగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1983లో న్యాయశాఖలో చేరిన లక్ష్మారెడ్డి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి శెట్టి కమిషన్ సిఫార్సుల అమలు కోసం కృషి చేశారు. -
జీఎస్టీతో రాష్ట్రాలకు నష్టంలేదు
వస్తు, సేవల పన్ను బిల్లుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బిల్లుపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడి ఈ సమావేశాల్లో తీసుకురాబోమని చెప్పిన కాసేపటికే లోక్‌సభలో బిల్లు న్యూఢిల్లీ: పన్ను విధింపు వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, రాష్ట్రాలకు చెందిన వివిధ పన్నుల స్థానంలో దేశవ్యాప్తంగా సరుకులకు, సేవలకు ఒకే పన్ను విధించేందుకు వీలుకలిగించే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని రూపకల్పనలో రాష్ట్రాల ప్రయోజనాల రక్షణకు తగిన చర్యలు తీసుకున్నామని, ఇది రాష్ట్రాలకూ లాభకరమేనని, జైట్లీ ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్రాలతో విస్తృతంగా జరిగిన చర్చల్లో బిల్లుపై ఏకాభిప్రాయం దాదాపుగా కుదిరిందన్నారు. జీఎస్టీ వ్యవస్థకోసం రాజ్యాంగానికి 122వ సవరణ చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటరీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోమని, పార్లమెంటు తదుపరి సమావేశాల్లోనే తీసుకువస్తామని, చివరి నిమిషంవరకూ బిల్లుపై సూచనలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజ్యసభలో ప్రకటన చేసిన కొద్దిసేపటికే జైట్లీ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. గత బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జీఎస్టీ బిల్లును జైట్లీ సభలో ప్రవేశపెడుతూ,..ఈ బిల్లుతో ఏ రాష్ట్రమూ రూపాయి కూడా నష్టపోకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. కొత్త పన్ను వ్యవస్థ అందించే ప్రయోజనాల విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు సమాన అవకాశాలుంటాయన్నారు. 2010-2013 మధ్య కాలానికి కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్టీ)కు సంబంధించి రాష్ట్రాలకు తగిన పరిహారం చెల్లిస్తామని, వచ్చే మార్చి నెలాఖరులోగా మొదటి విడత చెల్లింపు జరుగుతుందని అన్నారు. జీఎస్టీ బిల్లు తమకు నష్టదాయకమన్న ఆందోళన రాష్ట్రాలకు అవసరంలేదని, అసలు నష్టం జరిగే అస్కారమే లేదని జైట్లీ అన్నారు. జీఎస్టీ పన్ను వ్యవస్థతో దేశీయ మార్కెట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది దోహదపడుతుందని జైట్లీ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి అమల్లోకి వస్తున్న అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ జీఎస్టీ మాత్రమేనన్నారు. జైట్లీ పేర్కొన్న మరిన్ని వివరాలు - జీఎస్టీ పేరుతో దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చే ఒకే రేటు పన్నుతో సరుకులు, సేవలపై కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను (వ్యాట్), వినోదం పన్ను, ఆక్ట్రాయ్, ప్రవేశ పన్ను, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను తొలగిపోతాయి. సరుకుల బదిలీ సులభతరమవుతుంది. పన్నుపై మళ్లీ పన్ను విధించే పద్ధతి తప్పుతుంది. - మద్యాన్ని జీఎస్టీ పరిధినుంచి దూరంగా ఉంచినా, పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులు ఈ వ్యవస్థలో భాగంగా ఉండబోతున్నాయి, వాటిని జీఎస్టీలోకి పొందుపరిచబోయే తేదీని జీఎస్టీ మండలి నిర్ణయిస్తుంది. జీఎస్టీ మండలిలో మూటింట రెండు వంతుల మంది సభ్యులు రాష్ట్రాల ప్రాతినిధ్యం గలవారే ఉంటారు. అన్ని జీఎస్టీ మండలి నిర్ణయాలకు 75 శాతం వోట్ల మద్దతు అవసరం. - జీఎస్టీ అమలయ్యే తొలి రెండేళ్లలో రాష్ట్రాలు తమకు నష్టమొస్తుందని భావించినపుడు, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సరుకుల ఉత్పత్తి స్థానంలో జీఎస్టీకి అదనంగా ఒకశాతం పన్ను విధించుకునే అవకాశం ఉంటుంది. - జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఎలాంటి నష్టానికి అవకాశంఉన్నా, తొలి మూడేళ్లలో వందశాతం నష్టపరిహారానికి వీలుంటుంది. నాలుగో సంవత్సరం 75 శాతం, ఐదో సంవత్సరంలో 50 శాతం నష్ట పరిహారం చెల్లింపు ఉంటుంది. - జీఎస్టీతో రాష్ట్రాలకు నష్టం జరగదు. రాష్ట్రాలను పటిష్టపరచడమే మా లక్ష్యం. అప్పుడే జాతీయ ఆర్థిక వ్యవస్థా బలోపేతమవుతుంది. బిల్లుపై దాదాపుగా గతవారమే ఏకాభిప్రాయం కుదిరింది. రాష్ట్రాల ఆందోళలను పరిగణనలోకి తీసుకుని బిల్లులో అనేక రక్షణ ఏర్పాట్లు పొందుపరిచాం.