
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను హేతుబద్ధీకరించడానికి ఇదే తగిన సమయమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏళ్లుగా సాగుతోన్న కేసుల పరిష్కారానికి ఈ దిశగా యోచించాలని సూచించింది. అలాగే ‘కేస్ మేనేజ్‌మెంట్’ వ్యవస్థ అందుబాటులోకి రావాలంది. ఢిల్లీలో భూమి కొనుగోలుకు సంబంధించి 1986 నాటి కేసు విచారణ తన ముందుకు వచ్చినప్పుడు ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.
31 ఏళ్లుగా ఒక కేసు కొలిక్కిరాకపోవడం తమకు ఆందోళన కలిగిస్తోందని, ఇరు కక్షిదారులు కూడా కేసు భవితవ్యంపై ధీమాగా లేరని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ఈజ్ ఆఫ్ డూయిం గ్ బిజినెస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ అనే రెండు పదాలను ఈ మధ్య తరచుగా వింటున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాటను న్యాయ వ్యవస్థకు అనువర్తింపజేస్తే.. మొత్తం వ్యవస్థను హేతుబద్ధీకరించి కేస్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అమల్లోకి తేవాల్సి ఉందని స్పష్టమవుతోంది. అప్పుడే కేసుల విచారణ వేగవంతమవుతుంది’ అని బెంచ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment