కాంగ్రెస్ మరో వివాదాస్పద నిర్ణయం | Legislator Asha Kumari Replaces Kamal Nath As Punjab Congress Chief | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ మరో వివాదాస్పద నిర్ణయం

Published Sun, Jun 26 2016 4:25 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

Legislator Asha Kumari Replaces Kamal Nath As Punjab Congress Chief

ఛండీగర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కొత్తవారికి అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి. అంతకుముందు ఈ బాధ్యతలు నిర్వర్తించిన కమల్ నాథ్  స్థానంలో హిమాచల్ ప్రదేశ్  చట్ట సభ సభ్యురాలు ఆశా కుమారీని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కమల్ నాథ్ కు 1984 సిక్కు ఊచకోత కేసుతో సంబంధం ఉందని పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో ఆపార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, ఆశాకుమారీ పై కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన కేసులో ఫిబ్రవరిలో న్యాయస్థానం ఏడాది పాటు ఆమెకు జైలు శిక్ష విధించింది. 1998 లో డల్హౌసీలోని ప్రభుత్వ, అటవీ భూమిని ఆక్రమించిన కేసులో ఆమెపై ఈ కేసు నమోదైంది. దీంతో ఆశాకుమారి నియామకం కూడా ఆ పార్టీకి మరో కొత్త సమస్య తెచ్చిపెట్టవచ్చేమోనని పలువురు చర్చించుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement