న్యూఢిల్లీ: సాధారణంగా పులులు, సింహాలు దారితప్పి సిటీల్లోకి రావడం చూస్తుంటాం. అలాగే ఓచిరుతపులికి కారులో తిరగాలి అనిపించిందో, లేక ఎలా తయారు చేస్తారో చూడాలనిపించిందో ఏమో, ఏకంగా కార్లు తయారు చేసే ప్లాంట్లోకి వచ్చింది. అక్కడ పనిచేసే కార్మికులును భయబ్రాంతులకు గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే గూర్గావ్, మనేసర్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లోకి ఓ చిరుత పులి అనుకోని అతిథిగా విచ్చేసింది. గురువారం ఉదయం 4గంటల ప్రాంతంలో చిరుత ప్లాంట్‌లో హల్‌చల్ చేసింది. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు ప్రాణ భయంతో వణికిపోయారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీం, ఇంజన్ల రూంలో చిరుత ఉన్నట్లు గుర్తించి, బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment