తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి | Maruti Suzuki temporarily halts production following fire at vendor Subros | Sakshi
Sakshi News home page

తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి

Published Tue, May 31 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి

తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ.. ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. మనేసర్ లోని సంస్థకు  చెందిన సుబ్రోస్ లిమిటెడ్  ప్లాంట్ లో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా ఈ నిర్ణయం  తీసుకున్నట్టు తెలిపింది. ఎయిర్ కండీషనింగ్ కంప్రెసర్లను సరఫరా చేసే  యూనిట్‌లో ఈ  ప్రమాదం సంభవించింది. మనేసర్ ప్లాంట్లో  జరిగిన ఈ ఘటన కారణంగా సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొంది.  దీంతో మానెసర్‌తోపాటు గుర్గావ్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తిని సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేసినట్లు మారుతి సుజుకీ వెల్లడించింది.  


మౌల్డింగ్ మెషీన్  దగ్గర లిక్విఫైడ్  పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)సిలిండర్  పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది.  ఈ  భారీ అగ్నిప్రమాదాన్ని అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు కష్టపడ్డారు. నష్ట నివారణ చర్యలకు దిగిన మారుతి, సుబ్రోస్ , త్వరలోనే ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని పేర్కొంది.పరిస్థితిని అంచనావేస్తున్నామని సుబ్రోస్   ఛైర్మన్ రమేష్ సూరి తెలిపారు.  

ఈ నేపథ్యంలో  సోమవారం 1.7శాతంనష్టపోయిన  మారుతి సుజుకి షేర్లు  మంగళవారం ఉదయం ట్రేడింగ్ లో కోలుకున్నాయి.  1.19 శాతం లాభాలను నమోదు చేశాయి. 48 రూపాయల లాభంతో  4,120 దగ్గర ట్రేడవుతోంది.  కాగా ఈ రెండు ప్లాంట్ల నుంచి సంస్థ రోజుకు సరాసరిగా 5 వేల కార్లను తయారు చేస్తుంది. ఈ రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 లక్షల యూనిట్లు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement