Manesar plant
-
హోండా మానెసర్ ప్లాంట్ మూసివేత
న్యూఢిల్లీ: హర్యానాలోని మానెసర్ ప్లాంట్‌ను మూసివేసినట్లు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మంగళవారం ప్రకటించింది. ఆందోళనలో ఉన్న కారి్మకులతో చర్చలు విఫలం కావడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నవంబర్ 11 (సోమవారం) నుంచే ఈ నిర్ణయం అమల్లో ఉండగా.. మళ్లీ తిరిగి ప్లాంట్ ఎప్పుడు ప్రారంభమౌతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. -
హోండా ప్లాంట్ నిరవధిక మూసివేత
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) హర్యానా, మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకంది. సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ నోటీసు విడుదల చేసింది. యూనియన్ నాయకులు, ప్లాంట్ మేనేజ్మెంట్ మధ్య సోమవారం చర్చలు జరిగినా సఫలం కాలేదు. దీంతో శాశ్వత కార్మికులు, సంఘాలు, ఇతర కాంట్రాక్ట్ సిబ్బందిపై దుష్ప్రవర్తన ఆరోపణలు గుప్పిస్తూ ప్లాంట్ హెడ్ సైబల్ మైత్రా ఈ నోటీసులిచ్చారు. యూనియన్ నేతలు కాంట్రాక్టు కార్మికులను రెచ్చగొట్టి తమ అక్రమ సమ్మెను కొనసాగించమని పదేపదే కోరడంతోపాటు, కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా నిరసనలకు ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలోఉంచుకుని, ప్లాంట్ సాధారణ కార్యకలాపాలు సాధ్యం కాదని భావించి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించేదీ స్పష్టం చేయలేదు. అయితే ప్లాంట్‌లోని పరిస్థితి సాధారణమైన తర్వాత కార్యకలాపాల పునఃప్రారంభంపై వాటాదారులకు సమాచారం ఇస్తామన్నారు. కాగా ఉత్పత్తి కోత, కాంట్రాక్టు ఉద్యోగులపై భారీగా తొలగించడంపై నవంబర్ 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. అలాగే తమకు జీతాలు పెంచాలని కూడా పర్మినెంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు, ఇతర యూనియన్లు మద్దతు ఇస్తున్నాయి. ప్లాంట్ కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ రమేష్ ప్రధాన్ సమాచారం ప్రకారం, ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే ద్విచక్ర వాహనాల సంఖ్య రోజుకు 6000 నుండి నవంబర్ నాటికి 3500 కు తగ్గింది. దీంతో 2019 ప్రారంభం నుండి మొత్తం 1,000 మంది ఉపాధి కోల్పోయారు. అలాగే నిబంధనల ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు పే స్కేల్ సవరించాలి. అయితే ఆగస్టు 2018 నుండి ఇది పెండింగ్‌లో ఉందని కార్మికులు వాదిస్తున్నారు. -
కార్ల ప్లాంట్‌లో చిరుత.. బెంబేలెత్తిన ఉద్యోగులు!
న్యూఢిల్లీ: సాధారణంగా పులులు, సింహాలు దారితప్పి సిటీల్లోకి రావడం చూస్తుంటాం. అలాగే ఓచిరుతపులికి కారులో తిరగాలి అనిపించిందో, లేక ఎలా తయారు చేస్తారో చూడాలనిపించిందో ఏమో, ఏకంగా కార్లు తయారు చేసే ప్లాంట్‌లోకి వచ్చింది. అక్కడ పనిచేసే కార్మికులును భయబ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే గూర్గావ్, మనేసర్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లోకి ఓ చిరుత పులి అనుకోని అతిథిగా విచ్చేసింది. గురువారం ఉదయం 4గంటల ప్రాంతంలో చిరుత ప్లాంట్‌లో హల్చల్ చేసింది. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు ప్రాణ భయంతో వణికిపోయారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీం, ఇంజన్ల రూంలో చిరుత ఉన్నట్లు గుర్తించి, బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. -
తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ.. ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. మనేసర్ లోని సంస్థకు చెందిన సుబ్రోస్ లిమిటెడ్ ప్లాంట్ లో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎయిర్ కండీషనింగ్ కంప్రెసర్లను సరఫరా చేసే యూనిట్లో ఈ ప్రమాదం సంభవించింది. మనేసర్ ప్లాంట్‌లో జరిగిన ఈ ఘటన కారణంగా సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొంది. దీంతో మానెసర్తోపాటు గుర్గావ్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తిని సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేసినట్లు మారుతి సుజుకీ వెల్లడించింది. మౌల్డింగ్ మెషీన్ దగ్గర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ భారీ అగ్నిప్రమాదాన్ని అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు కష్టపడ్డారు. నష్ట నివారణ చర్యలకు దిగిన మారుతి, సుబ్రోస్ , త్వరలోనే ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని పేర్కొంది.పరిస్థితిని అంచనావేస్తున్నామని సుబ్రోస్ ఛైర్మన్ రమేష్ సూరి తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం 1.7శాతంనష్టపోయిన మారుతి సుజుకి షేర్లు మంగళవారం ఉదయం ట్రేడింగ్ లో కోలుకున్నాయి. 1.19 శాతం లాభాలను నమోదు చేశాయి. 48 రూపాయల లాభంతో 4,120 దగ్గర ట్రేడవుతోంది. కాగా ఈ రెండు ప్లాంట్ల నుంచి సంస్థ రోజుకు సరాసరిగా 5 వేల కార్లను తయారు చేస్తుంది. ఈ రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 లక్షల యూనిట్లు.