సింగపూర్ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ పలువురు అశ్లీల వెబ్‌సైట్‌ల వీక్షించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పోర్న్ వీక్షణలో ఇండియా టాప్ ప్లేస్‌లో నిలిచింది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో.. ఇండియాలో అశ్లీల సైట్లకు వీక్షకుల రద్దీ 95 శాతం పెరిగింది. మార్చి చివరి వారంలో లాక్‌డౌన్ అంక్షలు ప్రారంభమయ్యే సమయంలో భారత్‌లో పోర్న్ కంటెంట్ వీక్షకుల పెరుగుదల 20 శాతంగా ఉంది. ఈ మేరకు ప్రపంచంలోని అతిపెద్ద పోర్న్ సైట్ అయిన పోర్న్‌హబ్ గణాంకాలను విడుదల చేసింది. ఇండియాలో టెలికామ్ కంపెనీ చాలా మేరకు అడల్ట్ సైట్స్‌ను బ్లాక్ చేసినప్పటికీ.. కొన్ని సైట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా లాక్‌డౌన్ విధించిన తర్వాత పోర్న్ వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఆ గణంకాల ద్వారా వెల్లడైంది. ఐరోపాలో చాలా భాగం దాదాపు నెల రోజుల నుంచి కఠినమైన లాక్‌డౌన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 17న ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత పోర్న్ వీక్షకుల సంఖ్య 40 శాతం పెరిగారు. జర్మనీలో మార్చి 22న లాక్‌డౌన్ ప్రారంభమైనప్పుడు అడల్ట్ సైట్‌లకు ట్రాఫిక్ 25 శాతం పెరిగింది. కరోనా విజృంభణతో ఇటలీలో పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ పోర్న్ వీక్షణలో 55 శాతం పెరుగుదల కనిపిస్తోందని గణంకాలు తెలిపాయి.
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. చాలా మంది ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. నిత్యావసరాలు మినహా విద్యాసంస్థలు, ఆఫీస్‌లు, పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ వినియోగంలో ముందు వరుసలో ఉన్న ఇండియాలో పోర్న్ వీక్షకుల సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment