లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : అశ్లీల సైట్లకి పెరిగిన ట్రాఫిక్‌ | Lockdown : Traffic On Adult Websites In India Spike Up To 95 Percent | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : పోర్న్‌ సైట్లకి పెరిగిన గిరాకీ

Published Wed, May 6 2020 3:25 PM | Last Updated on Wed, May 6 2020 7:34 PM

Lockdown : Traffic On Porn Sites In India Spike Up To 95 Percent - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఆఫీసులు మూతపడటం, రవాణా లేకపోవడతంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రోజు మొత్తం ఏం చేయాలో తోచట్లేదు. ఇక స్కూళ్లు, కాలేజీలు కూడా మూతపడటంతో... యువకులు, విద్యార్థులు కూడా ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అశ్లీల వెబ్‌సైట్లకు వీక్షకుల రద్దీ బాగా పెరిగిపోయింది. లాక్‌డౌన్ కారణంగా ఎక్కువ మంది పోర్న్ వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది. 

సర్వే ప్రకారం... ఆన్‌లైన్‌లో అశ్లీల సైట్ల వాడకం 95 శాతం పెరిగింది. ఇందులో 89 శాతం మంది తమ మొబైళ్ల ద్వారానే అశ్లీల వెబ్‌సైట్లను చూస్తున్నారు. ఇక ఇండియాలో  పోర్న్ యూజర్లలో 30-40 శాతం మంది రోజూ అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. దేశంలో 3500 పోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం ఉన్నప్పటికీ... ఎలాగొలా వేరే వెబ్‌సైట్లు వెతుక్కొని చూస్తున్నారు.పెద్దవాళ్లు చూసినా పర్లేకానీ, కౌమారదశలో ఉన్నవారు అశ్లీల వీడియోలను ఎక్కువగా చూడడం ఆందోళనను కలిగిస్తోంది. కొన్నేళ్ల కిందట బెంగళూరులోని 10 స్కూళ్లలో చదువుకుంటున్న 400 మంది విద్యార్థులపై ఓ సర్వే చేయగా..  కనీసం 70శాతం మంది అశ్లీల చిత్రాలు చూస్తున్నారని తేలింది. వీరంతా కూడా 10 ఏళ్లలో ఉండడం గమనార్హం. 

వెలాసిటీ ఎంఆర్‌ అనే పరిశోధనా సంస్థ ప్రకారం, భారతదేశంలోని పెద్ద నగరాల్లో నివసిస్తున్న తల్లిదండ్రులలో 90 శాతం మంది తమ పిల్లలకు చదువులో ఇంటర్నెట్ సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రతి పదిమందిలో 9 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్నెట్‌ను కేవలం చదువుకు కోసం మాత్రమే వినియోగిస్తున్నారని భావిస్తున్నారట. పిల్లలు మొబైల్‌లో ఎలాంటి వీడియోలో చూస్తున్నారో కూడా వారి పరిశీలించడం లేదట. ఆరు, ఏడేళ్ల పిల్లలు కూడా అశ్లీల వీడియోలు చూస్తుండడం ఆందోళన కలిగించే అంశం. 

ఇక అశ్లీల విషయాలను చూసే విషయంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. అమెరికా మరియు బ్రిటన్లలో అత్యంత అశ్లీలమైన కంటెంట్‌ చూస్తున్నారని పరిశోధన సంస్థలు వెల్లడించాయి. తక్కువ ధరలకు డేటా లభ్యత భారతదేశానికి ఒక వరం, అయితే అదే సమయంలో యువ తరం, విద్యార్థులు ఈ ఉచ్చుకు బలైపోతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement