
లండన్ పేలుళ్లు: రెండో అరెస్ట్
లండన్ : లండన్ బాంబు దాడికి సంబంధించి మరో అనుమానితుడిని స్కాట్‌ల్యాండ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్‌లో జరిగిన బాంబుదాడిలో ఉగ్రవాదులకు సహకరించాడనే అనుమానాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. లండన్ బాంబుదాడి తరువాత జరిగిన రెండో అరెస్ట్ ఇది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి వయసు 18 సంవత్సరాలు.. మొదటి అరెస్ట్ చేసిన వ్యక్తి వయసు 21 ఏళ్లు. అనుమానితులగా భావిస్తున్న ఇద్దరిపై బ్రిటన్ క్రిమినల్ యాక్ట్‌లోని సెక్షన్ 41 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
లండన్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకునేందుకు మెట్రోపాలిటన్ పోలీస్, కౌంటర్ టెర్రరిజమ్ పోలీసింగ్ సెట్‌వర్క్ తీవ్రంగా కృషిచేస్తోందని సీనియర్ పోలీస్ కో-ఆర్డినేటర్ నీల్ బసు చెప్పారు.