terrarist
-
కశ్మీర్లో కాల్పుల కలకలం..! భద్రత సిబ్బంది ఎదురుదాడి..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో గురువారం బీజేపీ నేత ఇంటిపై దాడికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు సహా ముగ్గురు ముష్కరులు భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. శుక్రవారం వేకువజామున భద్రతా బలగాలు కాకపొరా ప్రాంతంలోని ఘాట్‌మొహల్లాలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో వారికి తారసపడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వారికి బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఈ ముగ్గురిలో ఇద్దరు నౌగామ్‌లో బీజేపీ నేత అన్వర్ అహ్మద్ నివాసంపై గురువారం దాడికి యత్నించిన వారేనని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. దాడి ఘటనలో లష్కరే తోయిబా, అల్ బద్ర్ సంస్థలకు చెందిన నలుగురితో కూడిన బృందం పాల్గొందని ఆయన వివరించారు. బీజేపీ నేత ఇంటి వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రమీజ్ రజా అనే కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే. రమీజ్ నుంచి వారు తీసుకెళ్లిన ఎస్ఎల్ఆర్తోపాటు ఏకే–47 రైఫిల్, పిస్టల్ వారి వద్ద లభ్యమయ్యాయని ఐజీపీ విజయ్ తెలిపారు. ‘ఘాట్ మొహల్లాలో సోదాలు చేపట్టాం. లొంగిపోవాలని కోరినా ఉగ్రవాదులు లెక్కచేయకుండా ఐదుగురు పౌరులను బందీలుగా ఉంచుకున్నారు. దీంతో, బలగాలు ముందుగా పౌరులను బయటకు తీసుకువచ్చాయి. అనంతరం ఎదురుకాల్పులు మొదలయ్యాయి. అందుకే, ఈ ఆపరేషన్ పూర్తయ్యేందుకు ఎక్కువ సమయం పట్టింది’అని ఆయన వివరించారు. చదవండి: కొడుకు శవం కోసం 8 నెలలుగా తవ్వకాలు.. -
పాక్ కుట్ర.. భారత్‌లోకి 150 మీటర్ల సొరంగం!
జమ్మూ: భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ భూభాగంలో నుంచి భారత్‌లోకి 150 మీటర్ల పొడవున ఏర్పాటు చేసిన సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు బుధవారం ఉదయం గుర్తించారు. జమ్మూ కశ్మీర్లో ని హిర్నాగర్ సెక్టార్లో ఉన్న బోబి యాన్ గ్రామంలో ఈ సొరంగం వెలుగు చూసినట్లు బీఎస్ఎఫ్ ఐజీ ఎన్ఎస్ జంవాల్ చెప్పారు. ఇది అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న సాంబ, కతువా జిల్లాల్లో గత ఆరు నెలల్లో వెలుగు చూసిన మూడో సొరంగం కావడం గమనార్హం. అలాగే గత పదేళ్లలో ఇది తొమ్మిదవది. తాజా సొరంగం ఉన్న చోట పాక్ వైపు భారీగా లాంచ్పాడ్లు ఉండటంతో పాటు, అది ఉగ్రవాదుల బేస్‌లు ఉన్నాయని జంవాల్ వెల్లడించారు. సొరంగంలో కొన్ని ఇసుక పాకెట్లు దొరికాయని, వాటిపై పాక్ ముద్ర ఉందని అన్నారు. రెండు నుంచి మూడు అడుగల వ్యాసం ఉన్న సొరంగం దాదాపు 25 నుంచి 30 మీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు. ఇసుక సంచులపై ఉన్న తయారీ తేదీలను బట్టి సొరంగాన్ని 2016–17 కాలంలో ఏర్పాటు చేసిఉంటారని, దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. అయితే గత కొంత కాలంగా ఈ సొరంగం ఉన్న చోట భద్రతా బలగాలు పహారా కాస్తుండడంతో దీన్ని పెద్దగా ఉపయోగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. చదవండి: లైంగిక ఆరోపణలు.. పాక్ కెప్టెన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు -
గృహ నిర్బంధంలోకి ముఫ్తీ
శ్రీనగర్: ఉగ్రవాద కేసులో అరెస్టయిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు వహీద్ పర్రా కుటుంబాన్ని పరామర్శించడానికి అనుమతినివ్వడం లేదని పీడీపీ నాయకురాలు, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. "చట్టవిరుద్ధంగా నన్ను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. నా కుమార్తె ఇల్టిజాను గృహ నిర్బంధంలో ఉంచారు" అని తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబుతో సంబంధం ఉన్న వహీద్ పర్రాను బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వహీద్ పర్రా ముఫ్తీకి అత్యంత సన్నిహితుడు. ఈ సందర్బంగా ముఫ్తీ పుల్వామాలోని వాహిద్ కుటుంబాన్ని సందర్శించడానికి రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారని తెలిపారు. కాగా.. బీజేపీ మంత్రులు వారి సహాచరులు రాష్ట్రంలోని ప్రతి మూలకు తిరగడానికి అనుమతి ఉంది కానీ మేము వెళ్లాలంటే భద్రత సమస్య ఉందంటూ సాకులు చెప్తున్నారని ముఫ్తీ శుక్రవారం ట్వీట్టర్లో పేర్కొన్నారు. తన ఇంటి ముందు ఉన్న పోలీసు వాహనం ఫోటోను కూడా జత పోస్ట్ చేశారు. దక్షిణ కశ్మీర్లో ముఖ్యంగా ఉగ్రవాద బారినపడిన పుల్వామాలో పీడీపీ పునరుద్ధరణలో వహీద్ పర్రా కీలక పాత్ర పోషించారు. అక్కడి జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మొదటి దశ ఎన్నికలు నవంబర్ 28న జరుగనున్నాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్-జమ్మూ హైవేపై ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను వాహనంలో తీసుకెళ్తుండగా అరెస్టయిన డీఎస్పీ డేవిందర్ సింగ్ కేసు దర్యాప్తులో వహీద్ పర్రా పేరు బయటపడింది. నిరాధార ఆరోపణలపై వహీద్ పర్రాను అరెస్టు చేశారన్నారు. ముఫ్తీ ఈ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 తొలగించినప్పుడు ఆమెను అదుపులోకి తీసుకుని అక్టోబర్‌లో విడుదల చేశారు. -
పీఓకేలో ఉగ్ర స్థావరాలు ధ్వంసం!
న్యూఢిల్లీ: కశ్మీర్లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని అనుమానిత ఉగ్రవాద స్థావరాలపై గురువారం విరుచుకుపడింది. భారత సైన్యం దాడిలో ముష్కరుల స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. వారికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు పీఓకేలో తిష్ట వేశారు. పాకిస్తాన్ సైనికుల అండతో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. చలికాలం ప్రారంభం కావడానికంటే ముందే ఉగ్రవాదులను భారత్‌లోకి పంపాలని పాక్ విశ్వప్రయత్నాలు సాగిస్తోంది. భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో పాక్ ఆటలు సాగడం లేదని అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం ఇటీవల తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఎల్ఓసీ వద్ద భారత సైన్యంపై, పౌరులపై కాల్పులకు తెగబడుతోంది. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ సైన్యానికి హెచ్చరికలు పంపడంతోపాటు ఉగ్రవాదుల పీచమణచడమే లక్ష్యంగా భారత సైన్యం పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద గురువారం ఎలాంటి కాల్పులు జరగలేదని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. -
కేజ్రీవాల్ ఉగ్రవాదే
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం వెల్లడించారు. గతంలో కేజ్రీవాల్ తనకు తానుగా అరాచకవాదినని ప్రకటించుకున్నారని, నా దృష్టిలో అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్ద వ్యత్యాసం లేదని ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ గురీందర్ సింగ్ నివాసమైన మోగాలో కేజ్రీవాల్ బస చేశారని గుర్తుచేశారు. అది ఉగ్రవాది నివాసమని తెలిసీ కేజ్రీవాల్ బసచేశారని ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. షహీన్‌బాగ్‌లో ఆందోళనలు చేస్తోన్న వారికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారికి కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారన్నారు. షహీన్‌బాగ్‌లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అరాచకవాదులకు మద్దతిచ్చిన నువ్వు నిజంగా ఉగ్రవాదివే అంటూ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా, సోఫియాన్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఓ ఆర్మీ జవాను, ఓ పౌరుడు కూడా మరణించారు. పుల్వామాలో ముగ్గురు, సోపియాన్‌లోనూ మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా దెలిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఓ ఇంట్లోని వారందరినీ పోలీసులు బయటకు తరలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిపాయి సందీప్ వీరమరణం పొందగా, రయీస్ దార్ అనే పౌరుడు మరణించారు. అనంతరం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని పుల్వామా జిల్లా కరీమాబాద్‌కు చెందిన నసీర్ పండిత్, సోఫియాన్‌కు చెందిన ఉమర్ మిర్, పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్‌లుగా గుర్తించారు. వీరు ముగ్గురూ తీవ్రమైన నేరచరిత్ర గలవారని, పలు ఘటనల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక సోఫియాన్‌లోని హ్యండ్యూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో సిపాయి రోహిత్‌కు గాయాలయ్యాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల వివరాలు తెలియలేదు. -
తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే
సాక్షి, చెన్నై/అరవకురిచ్చి: భారతదేశంలో తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే అని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారంలో కమల్ మాట్లాడారు. ‘స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని అన్నారు. అతనితోనే తీవ్రవాదం ప్రారంభమైందన్నారు. తనకు తాను గాంధీ మనవడిగా కమల్ అభివర్ణించుకున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. మహాత్ముని విగ్రహం ముందు నిల్చుని మాట్లాడుతున్నానని అన్నారు. దేశంలో సమానత్వాన్ని కోరుకునే గొప్ప భారతీయుల్లో తానూ ఒకడినన్నారు. జాతీయ జెండాలోని 3 రంగులు విభిన్న విశ్వాసాలకు ప్రతీకలని, ఇవి ఎప్పటికీ చెక్కుచెదరవన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. కమల్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంను బీజేపీ కోరింది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమల్ విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర్యరాజన్ ఆరోపించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఉన్నారు కాబట్టే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ సైతం కమల్ వ్యాఖ్యలను ఖండించారు. కళకు, ఉగ్రవాదానికి మతం ఉండదని తెలుపుతూ వివేక్ సోమవారం ట్వీట్ చేశారు. గాడ్సేని తీవ్రవాదిగా పోలిస్తే సరిపోయేదని.. అతని మతాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఏకీభవించిన నేతలు.. కమల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్, ద్రవిడార్ కజగం (డీకే) పార్టీలు మద్దతు తెలిపాయి. గాడ్సేకి ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇచ్చిందని డీకే అధినేత కె.వీరమణి వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి కూడా కమల్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ను ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బెయిల్‌పై బయట ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. -
బందీల మరణరహస్యం
ఇరాక్‌లోని మోసుల్‌లో నాలుగేళ్లక్రితం ఐఎస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కి ఆచూకీ లేకుండాపోయిన 39 మంది భారత పౌరులు ఆ ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఎట్టకేలకు పార్లమెంటులో ప్రకటించారు. వీరంతా పంజాబ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు చెందినవారు. పుట్టిన గడ్డపై పొట్ట నిండక బతుకు తెరువు కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధపడుతున్న వలస కార్మికులు ఎన్నో కడగండ్లు పడుతున్నారు. అటు ఉగ్రవాద మూకల దాడులు, ఇటు అమెరికా సేనలు సాగించే ద్రోన్ దాడులతో ఇరాక్ వంటి దేశాలు వల్లకాటిగా మారాయి. అటువంటి చోటకు సైతం వెళ్లడానికి సాహసించారంటేనే ఆ కార్మికుల కుటుంబాలు ఎంత దీనస్థితిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మోసుల్ ఉదంతంలో చిక్కుకుని ఐఎస్ ఉగ్రవాదుల కన్నుగప్పి తప్పించుకొచ్చిన హర్జిత్ మాసి అప్పట్లోనే తనతోపాటున్న 39 మందినీ వారు కాల్చి చంపారని చెప్పాడు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని కొట్టిపారేసింది. వారంతా ఇంకా సజీవంగానే ఉన్నారని తమకు సమాచారం అందిందని, ఆ బందీల విడుదల కోసం సకలవిధాలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత సైతం బందీల కుటుంబాలవారికి సుష్మా అలాగే చెబుతూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి ఆ బందీలను ఉగ్రవాదులు కాల్చిచంపారని చెబితే ఆ కుటుంబాలు ఏమైపోవాలి? కేంద్రం కేవలం హర్జిత్ మాసి చెప్పిన కథనాన్ని కొట్టిపారేసి ఊరుకోలేదు. పోలీసులు అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి అతన్ని సంరక్షించే ఉద్దేశంతోనే ఈ పని చేశామని చెప్పారు. స్వేచ్ఛగా వదిలిన కొన్నాళ్ల తర్వాత మళ్లీ వేరే కారణంతో అతను జైలుకు పోవాల్సివచ్చింది. ఏం చేసినా అతను తొలుత చెప్పిన మాట మీదే ఉన్నాడు. భవన నిర్మాణ పనిలో ఉండగా వచ్చిన ఉగ్రవాదులు అందరినీ అపహరించారని, ఆ తర్వాత తమలో ఉన్న బంగ్లాదేశ్ పౌరు లను విడిచిపెట్టారని చెప్పాడు. ఆ మర్నాడు ఒక కొండపైకి తీసుకెళ్లి బందీలందరినీ వరసబెట్టి కాల్చేసినప్పుడు తనకు అదృష్టవశాత్తూ కాలిలో తూటా దూసుకు పోయిందని, చచ్చినట్టు నటించి వాళ్లు నిష్క్రమించాక సురక్షిత ప్రాంతానికి చేరు కుని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించానని చెప్పాడు. హర్జిత్ చెప్పిన కథనాన్ని ఆ ఉదంతంలో బయటపడ్డ బంగ్లా పౌరులు కూడా మరికొన్నాళ్లకు ధ్రువీ కరించారు. ఒక ఆంగ్ల దినపత్రిక రెండేళ్లక్రితం కుర్దుల ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఉటంకిస్తూ భారత పౌరుల్ని ఉగ్రవాదులు హతమార్చారని వెల్లడించింది. అప్పుడు కూడా కేంద్రం ఆ కథనాన్ని ఖండించింది. చివరకు మోసుల్ నుంచి ఐఎస్‌ను తరిమి కొట్టిన ఏడెనిమిది నెలల తర్వాతగానీ బందీల మరణంపై ప్రకటన చేయలేదు. నిజమే... ఒక మతిమాలిన గుంపు చెరలో ఉన్న వ్యక్తిని విడిపించడం అంత సులభమేమీ కాదు. పైగా రాజ్యం నియంత్రణలేని ప్రాంతంలో... ఎవరి హిత వచనాలూ, వేడుకోళ్లూ తలకెక్కనిచోట వేరే దేశం బలప్రయోగం చేయడం లేదా వారితో ఓపిగ్గా చర్చించడం అసాధ్యం. కానీ అలాంటిచోట సైతం బందీల చెర నుంచి విజయవంతంగా విడిపించిన చరిత్ర మన ప్రభుత్వానికుంది. ఇరాక్‌లోనే తిక్రిత్ ప్రాంతంలో ఇదే ఐఎస్ ఉగ్రవాదుల చెరలో మన దేశానికి చెందిన 46 మంది నర్సులు చిక్కుకున్నప్పుడు మన అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవ హరించారు. మధ్యవర్తులను గుర్తించి వారి ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపారు. ఒక దశలో ఆ సంప్రదింపులు విఫలమయ్యాయని, నర్సులందరినీ ఎక్కడికో తరలించాలని ఉగ్రవాదులు సంకల్పించారని వార్తలొచ్చాయి. అలాంటి సమయంలో కూడా అధికారులు జాగ్రత్తగా అడుగులేశారు. ఎలా చేశారో, ఏం చెప్పి ఒప్పించారో ఇప్పటికీ వెల్లడికాలేదు. కానీ ‘సంప్రదాయేతర విధానాల’ ద్వారా బందీలకు విముక్తి కలిగించామని మాత్రం చెప్పారు. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ హయాంలో పనిచేసిన బాత్ పార్టీ ముఖ్యులు, సైన్యంలో కీలకపాత్ర పోషిం చినవారు ఐఎస్‌లో చురుగ్గా ఉన్నారు. ఐఎస్ చేజిక్కించుకున్న నగరాలకు వారు ‘మేయర్లు’గా వ్యవహరించారు. అలాంటివారి ద్వారా ఆ నర్సులను విడుదల చేయించగలిగారు. మరి ఆ పనే ఇక్కడెందుకు చేయలేకపోయారు? స్వయంగా ఆ ఉదంతంలో చిక్కుకుని బయటపడ్డ వ్యక్తిని నోర్మూయించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఆ తర్వాత బందీల విషయంలో ఆ వ్యక్తి చెప్పింది నిజమేనని వేరే వ్యక్తులు ధ్రువీకరించినప్పుడు సైతం అది నిజం కాదని అంత గట్టిగా ఎలా చెప్పగలిగారు? ఎందుకని ఇన్నేళ్లుగా బాధిత కుటుంబాలకు ఆశలు కల్పించారు? అయిదారు వర్గాల సమాచారం ఆధారంగా బందీలు క్షేమంగా ఉన్నారని ధ్రువీకరించుకున్నామని ఎందుకు నమ్మబలికారు? మోసుల్‌లో బందీలైనవారంతా నిరుపేదలు. పూటకు గతిలేని కుటుంబాల వారు. అందువల్లే తమవారి గురించి పట్టించుకోలేదని, ఎలాంటి ప్రయత్నాలూ చేయకపోయినా, ధ్రువీకరించుకోదగ్గ సమాచారమంటూ లేకపోయినా నాలుగేళ్లుగా కట్టుకథలు వినిపించారని ఆ కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. నిరుడు అక్టోబర్‌లో తమ నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించినప్పుడే అనుమానాలొచ్చాయని కొంద రంటున్నారు. కుటుంబ పెద్దగా ఉంటున్నవారు, ఆత్మీయులు ఉన్నట్టుండి కనుమరుగయ్యారంటే ఎలాంటివారైనా వేదనపడతారు. ఆచూకీ లేకుండా మాయమైతే, ఏళ్లు గడుస్తున్నా ఏ సమాచారమూ లేకపోతే ఆ బాధ మరింతగా పెరుగుతుంది. నరరూప రాక్షసుల చెరలో మగ్గుతున్నారని తెలిస్తే వారికి ఏ క్షణంలో ఏమవుతుందో, ఎలాంటి చిత్రహింసలు చవిచూస్తున్నారో అనుకుంటూ అను క్షణమూ కుమిలిపోతారు. పాలకులు దృఢంగా వ్యవహరిస్తున్నామని మాత్రమే అనుకుంటే సరిపోదు. ఇలాంటి విషయాల్లో సున్నితంగా కూడా ఆలోచించాలి. తమ నిర్వా్యపకత్వాన్నో, నిస్సహాయతనో వెనువెంటనే నిజాయితీగా వెల్లడించి ఉంటే ఇన్నేళ్ల క్షోభ వారికి తప్పేది. ఈపాటికి కాస్తయినా కోలుకునేవారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. వారికి జీవనోపాధి కల్పించాలి. -
ఇది అమానవీయం కాదంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్‌లో అదృశ్యమైన 39 మంది ఎలా ఉన్నారన్న సమాచారం కోసం గత నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న వారి కుటుంబ సభ్యులకు మంగళవారం నాడు వారు భరించలేని విషాద వార్తలను భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇరాక్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఇరాక్‌లో 40 మంది భారతీయ కార్మికులను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారన్న వార్త వెలుగులోకి వచ్చింది. అంటే, ఇది మోదీ ప్రభుత్వానికి మొట్టమొదటి సవాల్. ఈ సవాల్‌ను ఎంత సీరియస్‌గా తీసుకున్నా టెర్రరిస్టుల చేతుల నుంచి భారతీయులను విడిపించడం అంత సులువు కాకపోవచ్చు. కానీ నాలుగేళ్లుగా వారు క్షేమంగా ఉన్నారని, వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పదే పదే చెబుతూ సుష్మా స్మరాజ్ భారతీయులను, ముఖ్యంగా కుటుంబ సభ్యులను ఎందుకు మభ్య పెడుతూ వచ్చారన్నదే జవాబు దొరకని ప్రశ్న. సుష్మా స్మరాజ్ ఈ నాలుగేళ్లలో ఆరుసార్లు నిర్బంధితుల క్షేమ సమాచారంపై ప్రకటనలు విడుదల చేశారు. ప్రతి ప్రకటనలో వారు ‘ప్రాణాలతో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు’ను నొక్కి చెప్పారు. వారిని కాల్చివేయడాన్ని తాను కళ్లారా చూశానంటూ టెర్రరిస్టుల చెర నుంచి తప్పించుకొని వచ్చిన హార్జీత్ మాసిహ్ వెల్లడించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయడంలో అర్థం ఏముంది? తప్పించుకొచ్చిన వైనంపై హార్జీత్ చెప్పిన మాటలు నమ్మశక్యంగా అనిపించలేదని, అందుకనే ఆయన మాటలను నమ్మలేదని సుష్మా ఇప్పుడు వివరణ ఇస్తున్నారు. అసలు ఆమె మాటలే నమ్మశక్యంగా లేవు. వారు క్షేమంగా ఉన్నట్లు కచ్చితమైన సమాచారం లేకుండా ఆమె ఎందకు ప్రకటనలు చేసినట్లు? ఎందుకు మభ్యపెట్టినట్లు? పైగా ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల నిర్బంధంలో ఉన్నవారిని విడిపించి తీసుకరావడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను పంపిస్తున్నట్లు కథలు ప్రచారం అయ్యాయి. ఒక వర్గం మీడియా అయితే నాడు అజిత్ దోవల్‌ను భారతీయ జేమ్స్ బాండ్‌గా అభివర్ణించింది. చివరకు నిర్బంధితులు క్షేమంగా లేరని, వారిని ఎప్పుడో చంపేశారనే విషయం తెల్సిన తర్వాత కూడా ఈ విషయాన్ని సుశ్మా స్వరాజ్ వారి కుటుంబ సభ్యులకు ముందుగా తెలియజేయకుండా, పార్లమెంట్‌కు ముందుగా తెలియజేయడం అమానవీయమే! -
మోస్ట్ వాంటెడ్ ఐఎం ఉగ్రవాది
న్యూఢిల్లీ: దేశరాజధానిలో 2008లో వరుస బాంబుపేలుళ్ల కేసులో కీలక సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్ అలియాస్ జునైద్(32)ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాంబు పేలుళ్ల తర్వాత ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న ఆరిజ్‌ఖాన్.. పదేళ్ల తర్వాత ఇండో–నేపాల్ సరిహద్దులో పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ పేలుళ్లు సహా 165 మంది ప్రజల మృతికి ఆరిజ్ కారకుడని స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇంజనీర్ అయిన ఆరిజ్.. బాంబులు తయారుచేయడం, దాడికి ప్రణాళికలు రచించడం, వాటిని అమలు పర్చడంలో సిద్ధహస్తుడని వెల్లడించారు. పాఠశాలలో ఉన్నప్పుడే ఆరిజ్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యారన్నారు. ఐఎం, సిమీ నేతలు అరెస్ట్ కావడంతో భారత్‌లో ఈ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించడానికి నిందితుడు యత్నించాడన్నారు. నేపాల్‌లోని ఓ పాఠశాలలో ఆరిజ్ టీచర్‌గా చేసేవాడన్నారు. 2007లో యూపీ పేలుళ్లు, 2008లో జైపూర్, అహ్మదాబాద్ పేలుళ్ల కేసుల్లో కూడా ఆరిజ్ నిందితుడిగా ఉన్నాడు. ఆరిజ్ ఆచూకీ తెలిపినవారికి ఎన్ఐఏ రూ.10లక్షలు, ఢిల్లీ పోలీసులు రూ.5 లక్షల రివార్డుల్ని గతంలోనే ప్రకటించారు. -
మైసూరు ప్యాలెస్‌కు డేంజర్
సాక్షి, మైసూరు: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మైసూరు ప్యాలెస్ కూడా ఉగ్ర ముప్పు పొంచిఉంది. దసరా ఉత్సవాలలోనే కాకుండా ప్రతిరోజూ దేశవిదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. దాంతో ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో మైసూరు ప్యాలెస్ ఉందని నిఘా సంస్థలు పేర్కొనడంతో మైసూర్ ప్యాలెస్‌కు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా భధ్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీస్‌శాఖ, అగ్నిమాపకశాఖలకు కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్యాలెస్ ఆవరణలో ఇకపై 24 గంటల పాటు భధ్రతా బలగాల పహారాతో పాటు ప్యాలెస్ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, సిబ్బందికి కార్యాలయం, బస ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్ డీ.రందీప్ రెండు శాఖలకు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోనున్న ఎన్ఐఏ అధికారులు మూడుసార్లు మైసూరు ప్యాలెస్‌లో భధ్రతా ఏర్పాట్లు పరిశీలించి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరింత భధ్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. అంతేకాకుండా ప్రైవేటు భధ్రతా సిబ్బందితో పాటు ప్రస్తుతమున్న సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలు అమర్చాలని చెప్పారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండడానికి ప్యాలెస్ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ సూచించారు. ఎన్ఐఏ అధికారుల సూచనల ప్రకారం అదనపు భధ్రతా సిబ్బంది, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక వాహనాలు, కార్యాలయం, సిబ్బందిని మాత్రం ఇంతవరకూ ఏర్పాటు చేయలేకపోయారు. గత సంఘటనల దృష్ట్యా... సుమారు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించిన మైసూరు ప్యాలెస్‌లో రెండు శతాబ్దాల క్రితం జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ప్యాలెస్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. అనంతరం అదేస్థలంలో ప్రస్తుతమున్న ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రస్తుతమున్న అంబావిలాస్ ప్యాలెస్‌లో అరుదైన, ఎంతో విలువైన చెట్లతో స్తంభాలను ఏర్పాటు చేసారు. కోట్లాది రూపాయల విలువ చేసే బంగారుపూతతో ఈ స్తంభాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇలా ప్యాలెస్‌లో ప్రతీ వస్తువు, స్తంభాలు తదితర వస్తువులన్నింటినీ అరుదైన వృక్షాల దుంగలతో నిర్మించారు. అంతేకాకుండా ప్యాలెస్‌లో కోట్ల విలువ చేసే తైలవర్ణ చిత్రలేఖనాలు, వంశపారంపర్య, చార్రితాత్మక కట్టడాలు, విగ్రహాలు ఉన్నాయి. దీంతో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా లేదా ఉగ్రవాదుల దాడి నుంచి ప్యాలెస్‌ను రక్షించడానికి వీలుగా ప్యాలెస్ ఆవరణలో అగ్నిమాపక వాహనాలు, కార్యాలయంతో పాటు సిబ్బందికి కూడా అక్కడే బస ఏర్పాటు చేయాలంటూ ఎన్ఐఏ సూచించింది. వీటితో పాటు 72 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్యాలెస్ చుట్టుపక్కల వందల సంవత్సరాల కాలం నాటి దేవాలయాలు, మ్యూజియంతో పాటు రాజ వంశానికి చెందిన అశ్వాలు, ఏనుగులు, ఒంటెలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్యాలెస్ వెనుకభాగంలోనే రాజ వంశస్థులు కూడా తరతరాలుగా నివాసం ఉంటుండడంతో ప్యాలెస్‌లో భధ్రతను కట్టుదిట్టం చేయాలంటూ ఎన్ఐఏ సూచించింది. దీంతో బెంగళూరు నగరంలోని విధానసౌధ, ఎం.ఎస్.రామయ్య బిల్డింగ్, హైకోర్టు, రాజ్‌భవన్ తదితర కట్టడాల ఆవరణలో ఏర్పాటు చేసిన విధంగానే ప్యాలెస్ ఆవరణలో కూడా అగ్నిమాపక కేంద్రం, వాహనాలు, సిబ్బందిని నియమించాలంటూ రాష్ట్ర అగ్నిమాపక దళం డీజీపీ, పోలీసుశాఖ డీజీపీలను ఆదేశించారు. -
‘ఉగ్ర’దేశంగా ఉత్తరకొరియా?
వాషింగ్టన్: ఉత్తరకొరియాను ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశంగా గుర్తించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్‌మస్టర్ తెలిపారు. నవంబర్ 3 నుంచి 14 వరకు జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పైన్స్ దేశాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్న నేపథ్యంలో మెక్‌మస్టర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఉ.కొరియాను ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశంగా పరిగణించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ‘ఉ.కొరియాను అదుపు చేయడానికి అనుసరించే వ్యూహంలో భాగంగా ఈ అంశం కూడా ఉంద’ని వ్యాఖ్యానించారు. ఉ.కొరియాను అదుపు చేయడంలో చైనా చాలా కృషి చేస్తున్నప్పటికీ అది సరిపోదన్నారు. -
ఆ ఉగ్రవాదితో షబ్బీర్ టచ్‌లోనే ఉన్నాడు
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటు వాది షబ్బీర్ షా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో టచ్‌లోనే ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) చార్జీషీట్లో పేర్కొంది. ఉగ్రసంస్థకు ఆర్థిక సాయం అందించిన కేసుకు సంబంధించి 2005లో హఫీజ్ సయిద్‌పై ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణను పూర్తి చేసిన ఈడీ ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి సిద్ధార్థ నాథ్ శర్మకు చార్జిషీట్‌ను అందించింది. ఇప్పటికే ఈ కేసులో షబ్బీర్ షాతో పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మహమ్మద్ అస్లాం వనీ పేరును కూడా చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్‌ను కోర్టు విచారణకు తీసుకుంది. ఈ కేసులో నిందితులను ఈ నెల 27న కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. -
లండన్ పేలుళ్లు: రెండో అరెస్ట్
లండన్ : లండన్ బాంబు దాడికి సంబంధించి మరో అనుమానితుడిని స్కాట్‌ల్యాండ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్లో జరిగిన బాంబుదాడిలో ఉగ్రవాదులకు సహకరించాడనే అనుమానాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. లండన్ బాంబుదాడి తరువాత జరిగిన రెండో అరెస్ట్ ఇది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి వయసు 18 సంవత్సరాలు.. మొదటి అరెస్ట్ చేసిన వ్యక్తి వయసు 21 ఏళ్లు. అనుమానితులగా భావిస్తున్న ఇద్దరిపై బ్రిటన్ క్రిమినల్ యాక్ట్‌లోని సెక్షన్ 41 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. లండన్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకునేందుకు మెట్రోపాలిటన్ పోలీస్, కౌంటర్ టెర్రరిజమ్ పోలీసింగ్ సెట్‌వర్క్ తీవ్రంగా కృషిచేస్తోందని సీనియర్ పోలీస్ కో-ఆర్డినేటర్ నీల్ బసు చెప్పారు. -
ఉగ్రదాడులు పిరికిపందల చర్య
-
సూసైడ్ బాంబర్ ను బతికించాలనుకున్నా...
పారిస్ : ఫ్రెంచ్ కు చెందిన ఓ నర్స్ కాంప్తోయిర్ వోల్టైర్ వోల్టైర్ కేఫేలో కాల్పులు సందర్భంగా తనను తనను తాను పేల్చుకున్న ఉగ్రవాదిని కాపాడబోయాడట. పారిస్ లో వరస ఉగ్రదాడుల్లో భాగంగా కెఫే లో కూడా కాల్పుల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పారిస్ లో ఒక హాస్పిటల్ లో పనిచేసే డేవిడ్ (46) అతని స్నేహితునితో కలిసి కెఫేకి డిన్నర్ కి వచ్చాడు. ఇంతలో పెద్ద పేలుడు సంభవించింది. డేవిడ్ వెంటనే అప్రమత్తమయ్యాడు. హెటోల్ లో ఉన్న గ్యాస్ ఆఫ్ చేయమంటూ గట్టిగా అరుస్తూ గాయపడిని వారిని ఆదుకునే పనిలో పడ్డాడు. ఇంతలో ఒక వ్యక్తి కింద పడిపోయి ఉన్న వ్యక్తిని గమనించాడు. అతని నడుముకు రకరకాల రంగుల్లో ఉన్న వైర్లను చూసి షాకయ్యాడు. వెంటనే అతనికి పరిస్థితి అర్థమై ప్రాణాలను దక్కించుకున్నాడు. 'భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అందరూ హడావుడిగా పరుగెత్తుతున్నారు. నెత్తురోడుతున్న ఓ మహిళను, ఓ యువకుడిని కాపాడాను. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి స్పృహలేనట్టుగా పడి ఉన్నాడు. అతను మామూలు కస్టమర్ అనుకున్నా. అతడిని సేవ్ చేయాలనుకున్నా... కృత్రిమ శ్వాస (సీపీఆర్) అందించే క్రమంలో అతని చొక్కాను తొలగించా. పెద్ద గాయమైంది. దాదాపు 30 సెం.మీ మేర లోతైన గాయంతో పాటు తెలుపు,ఎరువు, నలుపు, ఆరెంజ్ రంగుల్లో వైర్లు అవీ చూస్తే దిమ్మతిరిగింది. ఏదో పేలుడు పదార్థం అని, అతను సూసైడ్ బాంబర్ అని అర్థమైంది. వెంటనే సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తున్న పైర్ సిబ్బందిని అలర్ట్ చేసి.. డైనింగ్ రూం వదిలి టెర్రస్ మీదికి పరుగెత్తా..లేదంటే నా ప్రాణాలు కూడా గాల్లోకి కలిసేవే అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే కెఫే లో ఉగ్రవాదిని ఇద్దరు వ్యక్తులు కాపాడే ప్రయత్నం చేసిన ఘటన వీడియోలో రికార్డయింది. ఒకరు డేవిడ్ కాగా మరొకరు ఎవరో ఇంకా తెలియలేదు. ఈ ఆత్మాహుతి దాడిలో ఉగ్రవాది అబ్దె సలాం హతమయ్యాడు.