వాషింగ్టన్: ఉత్తరకొరియాను ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశంగా గుర్తించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌ఆర్ మెక్‌మస్టర్ తెలిపారు. నవంబర్ 3 నుంచి 14 వరకు జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పైన్స్ దేశాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్న నేపథ్యంలో మెక్‌మస్టర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఉ.కొరియాను ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశంగా పరిగణించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ‘ఉ.కొరియాను అదుపు చేయడానికి అనుసరించే వ్యూహంలో భాగంగా ఈ అంశం కూడా ఉంద’ని వ్యాఖ్యానించారు. ఉ.కొరియాను అదుపు చేయడంలో చైనా చాలా కృషి చేస్తున్నప్పటికీ అది సరిపోదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment