HR McMaster
-
ఎన్ఎస్ఏ మెక్మస్టర్పై ట్రంప్ వేటు
వాషింగ్టన్: జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఆర్ మెక్మస్టర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేటు వేశారు. ఆయన స్థానంలో మాజీ రాయబారి జాన్ బోల్టన్‌కు బాధ్యతలు అప్పగించారు. 69 ఏళ్ల బోల్టన్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తున్నట్టు ట్రంప్ శుక్రవారం ట్వీటర్లో ప్రకటించారు. మెక్‌మస్టర్ అద్భుతంగా విధులు నిర్వర్తించారని, ఆయన ఎప్పటికీ తనకు స్నేహితునిగా ఉంటారని పేర్కొన్నారు. కాగా, బోల్టన్ ఏప్రిల్ 9న బాధ్యతలు స్వీకరించనున్నారు. మెక్మస్టర్కు ముందు పని చేసిన మైఖేల్ ఫ్లిన్‌ను.. అమెరికాలో రష్యా రాయబారి విషయంలో ఉపాధ్యక్షుడిని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై గత ఏడాది ట్రంప్ తొలగించారు. -
‘ఉగ్ర’దేశంగా ఉత్తరకొరియా?
వాషింగ్టన్: ఉత్తరకొరియాను ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశంగా గుర్తించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్‌మస్టర్ తెలిపారు. నవంబర్ 3 నుంచి 14 వరకు జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పైన్స్ దేశాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్న నేపథ్యంలో మెక్‌మస్టర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఉ.కొరియాను ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశంగా పరిగణించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ‘ఉ.కొరియాను అదుపు చేయడానికి అనుసరించే వ్యూహంలో భాగంగా ఈ అంశం కూడా ఉంద’ని వ్యాఖ్యానించారు. ఉ.కొరియాను అదుపు చేయడంలో చైనా చాలా కృషి చేస్తున్నప్పటికీ అది సరిపోదన్నారు. -
భారత్ మా ప్రధాన రక్షణ భాగస్వామి
ప్రధాని మోదీతో అమెరికా భద్రతా సలహాదారు భేటీ న్యూఢిల్లీ: భారత్ తమ ప్రధాన రక్షణ భాగస్వామి అని అమెరికా పునరుద్ఘాటించింది. మంగళవారం ఢిల్లీలో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్‌మాస్టర్ సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇరుదేశాలు కలసి ఏ విధంగా పోరాడాలనే దానిపై, ప్రాంతీయ శాంతి భద్రతలు, స్థిరత్వం నెలకొల్పడంపై సమావేశంలో మోదీ, మెక్‌మాస్టర్ చర్చించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక భారత్ పర్యటనకు వచ్చిన యూఎస్ తొలి ఉన్నతస్థాయి అధికారి మెక్‌మాస్టర్. ఈ సమావేశంలో పశ్చిమ ఆసియా, అఫ్ఘానిస్తాన్, ఉత్తరకొరియా తదితర దేశాల్లో భద్రత పరిస్థితులపై మెక్‌మాస్టర్ తన అభిప్రాయాన్ని మోదీకి వివరించారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్‌తోనూ మెక్‌మాస్టర్ చర్చలు జరిపారు. గత డిసెంబర్లో ఒబామా ప్రభుత్వం.. భారత్‌కు ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను కల్పించిన విషయం తెలిసిందే. భారత పర్యటన కన్నా ముందు పాక్ వెళ్లిన మెక్‌మాస్టర్.. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పలు అంశాలపై చర్చలు జరిపారు.