మెక్‌మస్టర్
వాషింగ్టన్: జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఆర్ మెక్‌మస్టర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేటు వేశారు. ఆయన స్థానంలో మాజీ రాయబారి జాన్ బోల్టన్‌కు బాధ్యతలు అప్పగించారు. 69 ఏళ్ల బోల్టన్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తున్నట్టు ట్రంప్ శుక్రవారం ట్వీటర్‌లో ప్రకటించారు. మెక్‌మస్టర్ అద్భుతంగా విధులు నిర్వర్తించారని, ఆయన ఎప్పటికీ తనకు స్నేహితునిగా ఉంటారని పేర్కొన్నారు. కాగా, బోల్టన్ ఏప్రిల్ 9న బాధ్యతలు స్వీకరించనున్నారు. మెక్‌మస్టర్‌కు ముందు పని చేసిన మైఖేల్ ఫ్లిన్‌ను.. అమెరికాలో రష్యా రాయబారి విషయంలో ఉపాధ్యక్షుడిని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై గత ఏడాది ట్రంప్ తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment