
మీ ఏటీఎం కార్డు పోయిందా?
న్యూఢిల్లీ: రంజిత్ హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు రైలులో బయల్దేరాడు. ప్రయాణంలో అతని ఏటీఎం కార్డు పోయింది. అందులో అధిక మొత్తం ఉండడంతో ఆయనలో ఆందోళన పెరిగింది. ఇలాంటి పరిస్థితే మీకు ఎదురైతే ఏం చేయాలి. ఇలాంటి సందర్భాల్లో మీకు సహాయం అందించేందుకు ప్రతి బ్యాంకు ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ఇవి 24 గంటలూ వినియోగదారుల సేవకు సిద్ధంగా ఉంటాయి. సంబంధిత నెంబర్‌కు ఫోన్ చేసి మీరు అకౌంట్ నెంబర్, వివరాలు తెలియపరిస్తే మీ అకౌంట్ లావాదేవీలను తక్షణమే నిలిపివేస్తారు.
మీకు ఎస్సెమ్మెస్ అలర్ట్ ఉందా..!
ప్రతి బ్యాంకు ఇప్పుడు వినియోగదారులకు ఎస్సెమ్మెస్ అలర్ట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. కొత్తగా ఖాతా తెరిచే వారికి దరఖాస్తులోనే దాన్ని పొందుపరిస్తే ఈ సౌకర్యం వర్తిస్తుంది. పాత ఖాతాదారులు ఆయా బ్రాంచ్‌లకు వెళ్లి దరఖాస్తు పూరించి ఇస్తే ఈ సౌకర్యం పొందవచ్చు. ఖాతాలో డబ్బు డ్రా/జమ చేసినప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు సంబంధిత వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తాయి.
బ్యాంకు పేరు టోల్ ఫ్రీ నెంబర్
ఎస్‌బీఐ - 1800112211
ఎస్‌బీహెచ్ - 18004251825
హెచ్‌డీఎఫ్‌సీ - 99494 93333
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 18002 22244
కరూర్ వైశ్యా బ్యాంక్ - 186020 01916
ఆంధ్రాబ్యాంక్ - 18004 252910