బాలికపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు | Madhya Pradesh Govt Get Death For Two Mens In Rape Case | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు

Published Tue, Aug 21 2018 6:17 PM | Last Updated on Mon, Oct 8 2018 3:28 PM

Madhya Pradesh Govt Get Death For Two Mens In Rape Case - Sakshi

భోపాల్‌ : ఓ ఎనిమిదేళ్ల బాలిక అత్యాచార ఘటనలో మధ్యప్రదేశ్‌లోని​ ప్రత్యేక కోర్టు ఇద్దరు నిందితులకు మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. జాన్‌ 26న మంద్‌సౌర్‌లో పాఠశాల వద్ద తండ్రికోసం ఎదురుచుస్తున్న ఓ ఎనిమిదేళ్ల బాలిక​ను అవహరించి అత్యాచారం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిందితులు ఇర్ఫాన్‌ (20), ఆసీఫ్‌ (24)లకు ఉరిశిక్షను విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.

పన్నిండేళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్షను విధిస్తూ ఇటీవల మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం నిందింతులను మరణశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి నిషా గుప్తా తీర్పును వెలువరించారు. మంద్‌సౌర్‌లో జరిగిన ఈ ఘటనపై కోర్టు 37 మందికి సాక్షులతో సహా, సీసీటీవీ కెమెరాలను పరిశీలించింది. బాలికను అపహరించిన నిందితులు అత్యాచారం చేసి.. ఆమె చనిపోయిందని భావించిం నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు.

అపస్మారకస్థితిలో ఉన్న బాలికను గమణించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. బాలిక శరీరంపై బలమైన పంటిగాట్లు ఉన్నాయని, ఆమె ప్రైవేటు అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యా‍పంగా ప్రతిపక్షాలతో సహా, ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హర్షం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఈ భూమ్మీద నివశించే హక్కులేదని, వారికి మరణశిక్షే సరైనదని అన్నారు. కాగా కేవలం రెండు నెలల్లోనే కోర్టు తీర్పును వెలువరించడం విశేషం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement