సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విభృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా... కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆదివారం నాటికి 1,024గా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం ఉదయం 10 గంటల సమయానికి 1074కి చేరింది. అలాగే దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 29కి చేరింది. మహారాష్ట్రంలో అత్యధికంగా 215 కేసులు నమోదు కాగా, కేరళలో 210 కేసులు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8 కేసులను వైద్యులు గుర్తించారు. మరోవైపు బెంగాల్‌లో కరోనా మృతుల సంఖ్య రెండుకు చేరింది. (వలస కూలీలతో కరోనా వ్యాప్తి ముప్పు)
మహారాష్ట్రలో 8, గుజరాత్‌లో 6, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్‌లో 2, ఢిల్లీలో 2, జమ్మూకశ్మీర్లో, పశ్చిమబెంగాల్, 2, తెలంగాణ, కేరళ, తమిళనాడు, బిహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 7 లక్షల 25 వేల మందికి ఈ వ్యాధి సోకగా, 34 వేలకుపైగా బాధితులు మృతిచెందారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా తొలిస్థానంలో నిలిచింది. మొత్తం 1లక్ష 42 వేల కేసులు నమోదవ్వగా, 2525 మంది మృత్యువాతపడ్డారు. (తీవ్ర ఒత్తిడిలో ఆమెరికా వైద్య సిబ్బంది)
Comments
Please login to add a commentAdd a comment