సాక్షి, ముంబై : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికలకు మూహూర్తం దగ్గరపడుతోంది. మహారాష్ట్రతోపాటు మరో మూడు రాష్ట్రాల్లో దీపావళి పండుగ తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న సంకేతాలు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వస్తున్నాయి. మహారాష్ట్రలో శాసనసభ గడువు నవంబర్ 7వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
తాజాగా అందిన వివరాల మేరకు దీపావళ్లి పండుగ తర్వాతే ఎన్నికలు నిర్వాహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలిసింది. అక్టోబరు 3వ తేదీ దసరా, అక్టోబరు 23వ తేదీన దీపావళి పండుగులున్నాయి. ఈ క్రమంలో నవంబర్ లేదా డిసెంబరు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు నిర్వహిస్తే, ఆగస్టు మొదటివారంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కానీ, ఆగస్టు 29న వినాయకుని ఉత్సవాలు ఉన్నాయి. దీంతో గణేషోత్సవాల తర్వాతే ఎన్నికలు కోడ్ అమలు చేయాలని గణేషోత్సవ మండళ్లు డిమాండ్ చేస్తున్నాయి.
మొత్తంగా దీపావళి తర్వాత ఎన్నికలు నిర్వహించినట్టయితే ఎవరికీ ఇబ్బందులు తలెత్తవనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 29న వినాయకుని ఉత్సవాలు, అక్టోబరు 3వ తేదీ దసరా , అక్టోబరు 23వ తేదీ దీపావళి పండుగులున్నాయి. దీపావళి పండుగ ఆగస్టు మొదటివారంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని భావించారు. దీనిైపై గణేషోత్సవాల తర్వాతే ఎన్నికలు కోడ్ అమలు చేయాలని గణేషోత్సవ మండళ్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
దీపావళి తర్వాత ఎన్నికలు నిర్వహించినట్టయితే ఎన్నికల కోడ్‌అమలు కూడా కొంత ఆలస్యంగా అమల్లోకి రానుంది. నవంబర్ లేదా డిసెంబరు మొదటివారంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.తాజాగా అందిన వివరాల మేరకు దీపావళ్లి పండుగ తర్వాతే ఎన్నికలు నిర్వాహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలిసింది.
దీపావళి తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు?
Published Fri, Aug 8 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement