భివండీ, న్యూస్‌లైన్: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తానని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. భివండీ పట్టణంలోని గోకులనగర్ ప్రాంతంలోని చాలెంజ్ గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. మూడు నియోజక వర్గాలలోని బీజేపీ అభ్యర్థు సంతోష్ శెట్టి, మహేష్ చౌగులే, శాంతారం పాటిల్‌ను గెటిపిస్తే భివండీ అభివృద్ధికి భారీ ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. భివండీలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కదిలివచ్చిన శ్రేణులు
భివండీ తూర్పు, భివండీ పడమర, భివండీ రూరల్ నియోజక వర్గాలల్లోని అభ్యర్థుల ప్రచార సభకు మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా ఆయా నియోజక వర్గాల నుంచి కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సభ ప్రచార కర్తగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మూడు గంటల సేపు ఆలస్యంగా వచ్చినప్పటికీ, కార్యకర్తలు సభ నుంచి కదల్లేదు.
లోక్‌సభ సభ్యుడు కపిల్ పాటిల్, మూడు నియోజక వర్గాల అభ్యర్థులు సంతోష్ శెట్టి, మహేష్ చౌగులే, శాంతారం పాటిల్‌తో పాటు కార్యకర్తలు, కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో మహిళా కార్యకర్తలు హాజరయ్యారు. భివండీ పట్టణ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ అగ్రవాల్ తదితర నాయకులు పూల మాలతో నితిన్ గడ్కరిని ఘనంగా సత్కరించారు.
పలువురి చేరిక
బీజేపీలో పలువురు తెలుగు వ్యక్తులు చేరారు. దాసి అంబాదాస్, గాజుల ఆగాదాస్, కళాడపు బాలకిషన్, విజయ్ అంబాలాల్ పటేల్, హస్ముక్ పటేల్, డాక్టర్ పాము మనోహర్, సిరిపురం లక్ష్మీనారాయణ, డాక్టర్ చెన్న రాజమల్లయ్య, వడ్లకొండ రాము, గుజ్జా విజయ్, అడ్డగట్ల సత్తయ్య, చెన్న దేవరాజం తదితరులు చేరారు. వీరిని నితిన్ గడ్కరి స్వాగతించారు.
ఆదరిస్తే..అందరికీ ఉద్యోగం
Published Wed, Oct 1 2014 10:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement