
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 841 తాజా కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 34 మంది మరణించారని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 15,525కు చేరగా మరణాల సంఖ్య 617కు ఎగబాకింది. మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరం వైరస్ కోరల్లో విలవిలలాడుతోంది.
సోమవారం ఒక్కరోజే ముంబైలో 510 తాజా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 9000 దాటిపోయింది. నగరంలో వైరస్ మృతుల సంఖ్య 361కు పెరిగింది. ఇక ముంబైలో ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావిలో సోమవారం 33 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ ప్రాంతంలో నమోదైన కేసుల సంఖ్య 665కు పెరిగిందని బీఎంసీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment