
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 7,827 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 173 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,427కి చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,03,516 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 1,40,325 మంది డిశ్చార్జ్ అయ్యారు.(కంపెనీల వైపు ఐటీ ఉద్యోగుల చూపు..)
కొత్తగా నమైదైన కేసుల్లో కేవలం ముంబై పరిధిలోనే 1,308 ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో 8,49,553 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. (రాజస్తాన్ సంక్షోభం : సింధియా ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment