సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఒక్క రోజే 6,330 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు బయటపడటం ఇదే తొలిసారి. ఒక్క ముంబైలోనే కొత్తగా 1554 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ముంబైలో మొత్తం బాధితుల సంఖ్య 80,262కు చేరగా, రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1.86 లక్షలకు చేరింది. (కరోనా పంజా.. ఒక్కరోజే 54 వేల కేసులు)
ఇప్పటిదాకా మహమ్మారి వల్ల ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 124 మంది ప్రాణాలు వదలగా, 8,018 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్–19 రికవరీ రేటు 54.21 శాతంగానూ, మరణాలు రేటు 4.38 శాతంగానూ ఉంది. (లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన)
గురువారం బృహన్ ముంబై కార్పొరేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ముంబైలో 4,686 మంది కోవిడ్‌కు బలయ్యారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌ను జులై 31 వరకూ పెంచిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో భారీగా కరోనా కేసులు బయటపడుతుండటంతో ఇండియాలో కేసుల సంఖ్య ఆరు లక్షల మార్కును దాటేసింది. కరోనా బాధిత దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా కంటే ముందు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment