
మహారాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు
ముంబయి: రాష్ట్ర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలను మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలను దాదాపు 166 శాతం పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రూ. 75 వేలు ఉన్న శాసనసభ్యుల జీతాలను రూ.2 లక్షలకు పెంచుతూ దేవెంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు బిల్లును శుక్రవారం అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉభయసభలలో ఈ బిల్లు పాస్ కావడంతో జీతాల పెంపు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.