
మమ్మెన్ మాథ్యూకు ‘లోకమాన్య తిలక్’ అవార్డు
న్యూఢిల్లీ: ‘మలయాళ మనోరమ’ దినపత్రిక సంపాదకుడు, మేనేజింగ్ డెరైక్టర్ మమ్మెన్ మాథ్యూకు జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు లభించింది. కేసరి-మహ్రట్టా ట్రస్టు 133వ వార్షికోత్సవాల సందర్భంగా జనవరి 4న పుణేలో నిర్వహించనున్న కార్యక్రమంలో మెమ్మెన్ మాథ్యూను ఈ అవార్డు కింద లక్ష రూపాయల నగదు పురస్కారం, జ్ఞాపికతో సత్కరించనున్నట్లు ‘కేసరి’ పత్రిక ట్రస్టీ-ఎడిటర్ దీపక్ తిలక్ ప్రకటించారు.