ఎడిటర్ మాథ్యూకు అవార్డు | Mammen Mathew to get Lokmanya Tilak National Journalism Award | Sakshi
Sakshi News home page

ఎడిటర్ మాథ్యూకు అవార్డు

Published Wed, Jan 1 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

Mammen Mathew to get Lokmanya Tilak National Journalism Award

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ నేషనల్ ఆవార్డుకు మలయాళ మనోరమా ఎడిటర్ మమ్మెన్ మాథ్యూ ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ స్థాపించిన ఈ ప్రతిష్టాత్మక ఆవార్డును కేసరి మరాఠా ట్రస్టు అందిస్తోంది. ట్రస్టు 133 వ్యవస్థాపక దినం సందర్భంగా జనవరి 4వ తేదీన ఈ ఆవార్డును పుణేలోని తిలక్‌వాడలో మాథ్యూకు ఈ ఆవార్డును అందజేస్తారు. జర్నలిజంలో మాథ్యూ చేసిన అసమాన కృషికి ఈ అవార్డును బహుకరిస్తున్నామని కేసరి ట్రస్టీ ఎడిటర్ దీపక్ తిలక్ తెలిపారు. 44 సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉన్న మాథ్యూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, వార్త పత్రికల యజమానుల సంఘం ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. జాతీయ భద్ర తా సలహా మండలికి పలుమార్లు సభ్యుడిగా వ్యవహరించారు. ప్రసిద్ధ వార్త సంస్థ రాయిటర్స్‌కు డెరైక్టర్‌గా కూడా వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement