ఆ హీరోయిన్‌ నా భార్య కాదు! | Mamta Kulkarni husband Vicky says she is not his wife | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్‌ నా భార్య కాదు!

Published Mon, May 2 2016 4:23 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

ఆ హీరోయిన్‌ నా భార్య కాదు!

ఆ హీరోయిన్‌ నా భార్య కాదు!

న్యూఢిల్లీ: డ్రగ్స్‌ స్మగ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్కీ గోస్వామి తాజాగా సంచలన విషయాలు వెల్లడించాడు. ఒకప్పటి బాలీవుడ్‌ హీరోయిన్‌ మమతా కులకర్ణితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆమెను తాను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదని ఆయన చెప్పాడు. తొలిసారి టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయన డ్రగ్స్‌ స్మగ్లింగ్ చేస్తున్నట్టు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు.

'మమతా కులకర్ణి నా శ్రేయోభిలాషి మాత్రమే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడింది. అంతేకానీ ఆమె నా భార్య కాదు. ఆమెను నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు' అని విక్కీ గోస్వామి చెప్పాడు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా అధినేతగా గుర్తింపు పొందిన విక్కీ గోస్వామి ప్రస్తుతం కెన్యాలోని మొంబాసాలో ఉంటున్నాడు. అక్కడి నుంచి తనను భారత్‌కు అప్పగించాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నదన్నాడు. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం (డీఈఏ) తనను కిడ్నాప్ చేయాలని భావిస్తున్నదని, కాబట్టి తాను భారత్‌కు వచ్చే అవకాశమే లేదని అతను తేల్చిచెప్పాడు. తనను కొందరు లక్ష్యంగా చేసుకున్నారని చెప్పాడు. ఇటీవల థానెలో పట్టుబడిన రూ. 2వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు తన గ్యాంగ్‌కే చెందినవని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చాడు. కాగా, విక్కీ గోస్వామి భార్యగా భావిస్తున్న మమతా కులకర్ణి గతంలో ఆయనకు మద్దతుగా మీడియాతో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement