చెన్నై: మత్తుపదార్థాల మిశ్రమంతో కూడిన చాక్లెట్లు, పీచుమీటాయిలాంటివి చిన్నారులకు విక్రయిస్తున్న ఓ దుకాణాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తాండియర్ పేట్ లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గతవారం ఓ పదమూడేళ్ల బాలుడు తాండియర్ పేట్ లోని ఓ దుకాణంలో స్వీట్ కొనుక్కున్నాడు. అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు.
దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా తిన్న స్వీట్ లో మత్తుపదార్థాలు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో డ్రగ్స్ నివారణ చట్టం కింద సురేశ్ మహోలా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆ బాలుడికి విక్రయించిన చాక్లెట్స్ ప్యాకెట్లను ఆరింటిని స్వాధీనం చేసుకొని ల్యాబ్ కు పంపించారు. వీటిని పరీక్షంగా వీటిల్లో కూడా గంజాయి ఆకులతో తయారు చేసిన మిశ్రమం ఉన్నట్లు గుర్తించారు. కోల్ కతాలోని వెండోర్ అనే ప్రాంతం నుంచి తాను చాక్లెట్లు, పీచు మిఠాయిలు తీసుకొస్తానని, 40 రూపాయిలకు 40 తెస్తానని, బయట మాత్రం ఒక్కొక్కటి 15 రూపాయలకు అమ్ముతానని చెప్పాడు. ఇతడిది బిహార్.
పిల్లలూ భద్రం.. చాక్లెట్లలో గంజాయి
Published Wed, Jul 6 2016 8:35 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM
Advertisement
Advertisement