chockelets
-
మొన్న చాక్ లెట్లు ... తాజాగా కూల్ డ్రింక్స్ పడేసిన వైనం
-
రోడ్డుపక్కన చాక్లెట్లు.. దొరికినన్ని ఎత్తుకెళ్లారు; ట్విస్ట్ ఏంటంటే
యశవంతపుర: రోడ్డు పక్కల మూటల కొద్దీ చాక్లెట్లు కనిపించడంతో పిల్లలు, పెద్దలూ దొరికినన్ని పట్టుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా శిరసి సమీపంలోని హుడ్లుమనె వద్ద జరిగింది. తాజా లాక్డౌన్ సమయంలో ఓ చాక్లెట్ల వ్యాపారి అమ్ముడుపోకుండా గడువు(ఎక్స్పైరీ) ముగిసిన క్వింటాల్‌కు పైగా చాక్లెట్లను నగరసభ చెత్త ట్రాక్టర్లో పడేశారు. వాటిని పౌర కార్మికులు రోడ్డు పక్కన విసిరేశారు. పెద్దమొత్తంలో చాక్లెట్లు పడి ఉన్నాయని తెలిసి చిన్నపిల్లలు, పెద్దలు ఎత్తుకెళ్లారు -
ఇది తీసుకుంటే డయాబెటిస్‌కు దూరం
వాషింగ్టన్: రోజూ ఓ చాక్లెట్ తీసుకుంటే టైప్ టూ డయాబెటిస్‌కు దూరంగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చాక్లెట్లో ఉండే కొకొవా శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా విడుదల చేసేందుకు దోహదపడుతుందని, రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుదలకు దీటుగా స్పందింస్తుందని బీవైయూ పరిశోధకులు గుర్తించారు.ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేందుకు దోహదపడే బీటా కణాలు మెరుగ్గా పనిచేసేందుకు ప్రేరేపించే పదార్ధాలు కొకోవాలో పుష్కలంగా ఉన్నట్టు జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ర్టీలో ప్రచురితమైన ఓ అథ్యయనం వెల్లడించింది.ఒత్తిడిని నియంత్రించి కణాలకు పునరుత్తేజం కల్పించే గుణం కూడా చాక్లెట్లలో ఉందని ఈ పరిశోధనలో తేలింది. కొకోవాపై దశాబ్దకాలంగా ఎన్నో పరిశోధనలు జరిగినా దీని ఉపయోగంపై నిర్థిష్ట ప్రయోజనాలను విశ్లేషిస్తూ సాగిన అథ్యయనం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు.రోజూ ఓ చాక్లెట్ తింటే డయాబెటిస్ బారిన పడకుండా జాప్యం చేయవచ్చని వారు పేర్కొన్నారు. -
పిల్లలూ భద్రం.. చాక్లెట్లలో గంజాయి
చెన్నై: మత్తుపదార్థాల మిశ్రమంతో కూడిన చాక్లెట్లు, పీచుమీటాయిలాంటివి చిన్నారులకు విక్రయిస్తున్న ఓ దుకాణాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తాండియర్ పేట్ లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గతవారం ఓ పదమూడేళ్ల బాలుడు తాండియర్ పేట్ లోని ఓ దుకాణంలో స్వీట్ కొనుక్కున్నాడు. అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా తిన్న స్వీట్ లో మత్తుపదార్థాలు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో డ్రగ్స్ నివారణ చట్టం కింద సురేశ్ మహోలా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆ బాలుడికి విక్రయించిన చాక్లెట్స్ ప్యాకెట్లను ఆరింటిని స్వాధీనం చేసుకొని ల్యాబ్ కు పంపించారు. వీటిని పరీక్షంగా వీటిల్లో కూడా గంజాయి ఆకులతో తయారు చేసిన మిశ్రమం ఉన్నట్లు గుర్తించారు. కోల్ కతాలోని వెండోర్ అనే ప్రాంతం నుంచి తాను చాక్లెట్లు, పీచు మిఠాయిలు తీసుకొస్తానని, 40 రూపాయిలకు 40 తెస్తానని, బయట మాత్రం ఒక్కొక్కటి 15 రూపాయలకు అమ్ముతానని చెప్పాడు. ఇతడిది బిహార్.