ఇది తీసుకుంటే డయాబెటిస్‌కు దూరం
వాషింగ్టన్: రోజూ ఓ చాక్లెట్ తీసుకుంటే టైప్ టూ డయాబెటిస్‌కు దూరంగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చాక్లెట్‌లో ఉండే కొకొవా శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా విడుదల చేసేందుకు దోహదపడుతుందని, రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుదలకు దీటుగా స్పందింస్తుందని బీవైయూ పరిశోధకులు గుర్తించారు.ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేందుకు దోహదపడే బీటా కణాలు మెరుగ్గా పనిచేసేందుకు ప్రేరేపించే పదార్ధాలు కొకోవాలో పుష్కలంగా ఉన్నట్టు జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ర్టీలో ప్రచురితమైన ఓ అథ్యయనం వెల్లడించింది.ఒత్తిడిని నియంత్రించి కణాలకు పునరుత్తేజం కల్పించే గుణం కూడా చాక్లెట్లలో ఉందని ఈ పరిశోధనలో తేలింది.
కొకోవాపై దశాబ్దకాలంగా ఎన్నో పరిశోధనలు జరిగినా దీని ఉపయోగంపై నిర్థిష్ట ప్రయోజనాలను విశ్లేషిస్తూ సాగిన అథ్యయనం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు.రోజూ ఓ చాక్లెట్ తింటే డయాబెటిస్ బారిన పడకుండా జాప్యం చేయవచ్చని వారు పేర్కొన్నారు.