కూతురిని కొట్టి చంపిన కన్నతండ్రి | Man beats newborn daughter to death | Sakshi
Sakshi News home page

కూతురిని కొట్టి చంపిన కన్నతండ్రి

Published Tue, Jun 10 2014 2:51 PM | Last Updated on Wed, Oct 17 2018 3:53 PM

Man beats newborn daughter to death

ఆడపిల్లి పుట్టిందన్న కోపంతో.. 15 రోజుల వయసున్న తన కన్నకూతురిని కొట్టి చంపాడో తండ్రి. ఈ సంఘటన గుజరాత్లోని సూరత్ జిల్లాలోగల ఓ గ్రామంలో జరిగింది. రాజు యు ఠాక్రే అనే ఆ తండ్రి తన భార్య మీనాబెన్ ఠాక్రేతో గొడవ పడి, పల్సానా తాలూకా పరిధిలోని చల్తాన్ గ్రామంలోగల తమ ఇంట్లోనే కూతురిని ఇష్టారాజ్యంగా కొట్టాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కొడుకు కావాలంటూ ఎప్పుడూ చెప్పే ఠాక్రే, కూతురు పుట్టడంతో గత పదిహేను రోజులుగా భార్యతో గొడవ పడుతూనే ఉన్నాడు. చివరకు కూతురిని తలపై కొట్టడంతో ఆ చిన్నారి కాస్తా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో అతడు ఇంట్లోంచి పారిపోయాడు. అతడి కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో ఇంటికి తిరిగొచ్చిన తల్లి ఇంట్లో చూసేసరికి.. కూతురు నిర్జీవంగా పడి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement