baby dead
-
మూడేళ్ల పాపను 7 అంతస్తుల పైనుంచి విసిరేశాడు
ముంబై : నగరంలో దారుణం జరిగింది. మూడేళ్ల పాపను ఏడు అంతస్థుల నుంచి కిందికి విసిరేశాడు ఓ దుర్మార్గుడు. స్నేహితుడి కూతురనే కనికరం లేకుండా ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ముంబైలోని కొలాబాలోని ఓ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి 7.30గంటలకు ఈ దారుణ ఘటన జరిగింది. రాత్రి ఏడున్నర గంటలలో అపార్ట్మెంట్ పెద్ద శబ్దం వచ్చింది. అందరూ వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో చిన్నారి కనిపించింది. అందరూ షాకయ్యారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి... అక్కడికక్కడే చనిపోయింది. ఆ చిట్టితల్లి శరీర భాగాలు ముక్కలైపోయిన దృశ్యం చూసి... అక్కడి వాళ్లంతా తీవ్ర ఆవేదన చెందారు. ఆ చిన్నారిని ఏడో అంతస్థులోని ఓ కిటికిలోంచి పడినట్లు స్థానికులు గుర్తించారు. మూడేళ్ల చిన్నారి అంత ఎత్తు కిటికీ ఎక్కలేదని గ్రహించిన వాళ్లు... మొత్తం అపార్ట్‌మెంట్‌ని బ్లాక్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిన్నారి తండ్రి స్నేహితుడు 40 ఏళ్ల అనిల్ చుగానీ అనే వ్యక్తే చిన్నారని తోసేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అతనే ఏడో అంతస్థులో ఆడుకుంటున్న పాపను బలవంతంగా ఎత్తుకొని... కిటికీ లోంచీ కిందకు విసిరేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో ఆ చిన్నారి మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఏం పాపం చేసిందని ఆ చిట్టితల్లిని అంత క్రూరంగా విసిరేశాడన్నది తెలియలేదు. పోలీసులు అనిల్ చుగానీని అరెస్టు చేశారు. విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాగా. రక్తం మడుగులో పడి ఉన్న చిన్నారి చూసి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రోజూ చక్కగా ఆడుకుంటూ తిరిగే పసి పాప... అత్యంత దయనీయ స్థితిలో చనిపోవడం అపార్ట్మెంట్ వాసుల్ని కలచివేసింది. -
మింగేసిన బోరుబావి
-
చిన్నారిని మింగిన బోరుబావి
విడవలూరు/ నెల్లూరు (పొగతోట)/ కోవూరు: ముక్కుపచ్చలారని చిన్నారిని బోరుబావి మింగేసింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకుంటున్న బిడ్డను చూసి మురిసిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. బోరుబావిలో ఇద్దరు పిల్లలు పడిపోగా.. 3 గంటల పాటు స్థానికులు, అధికారులు కృషి చేసి ఒక్కరిని మాత్రమే ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. ఈ విషాద సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీలోని పెదపాళెంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎల్లంగారి ఈశ్వరయ్య, నాగమ్మల కుమార్తె మోక్షిత (3), పామంచి తాతయ్య, పోలమ్మల కుమారుడు పామంచి గోపిరాజు (3) ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆడుకుంటూ పక్కనే ఉన్న పాఠశాల వద్దకు వెళ్లారు. అయితే పాఠశాలలో తాగునీటి అవసరాల కోసం దగ్గరలోని ఖాళీ స్థలంలో 16 అడుగులమేర బోరుబావిని తవ్వారు. దీన్ని గమనించని చిన్నారి మోక్షిత మొదట ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. ఆ వెంటనే గోపిరాజు కూడా బోరుబావిలో పడ్డాడు. దీనిని గమనించిన మోక్షిత తండ్రి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. అక్కడే పనులు చేస్తున్న యువకులు వెంటనే జేసీబీ సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో గుంతను తవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసు, ఫైర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్లేలా చర్యలు చేపట్టారు. పక్క ఊరిలోనే పర్యటిస్తున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తొలుత బాలుడు గోపిరాజును సురక్షితంగా బయటకు తీశారు. మోక్షిత లోపల ఉండడంతో బయటకు తీసుకురావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. కొన ఊపిరితో ఉన్న బాలికను వెంటనే 108 వాహనంలో రామతీర్థంలోని ప్రాథమిక వైద్యశాలకు.. అక్కడి నుంచి కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ గ్రామం శోకసంద్రంగా మారింది. బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం ఈ సంఘటనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి వెంటనే సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. అలాగే తన సొంత నిధుల నుంచి మోక్షిత కుటుంబానికి రూ. 50 వేలు, బాలుడికి రూ. 50 వేలు, చిన్నారులను కాపాడేందుకు సాహసం చేసిన స్థానిక యువకులు చిరంజీవి, ప్రసాద్‌లకు మరో రూ. 50 వేలు అందజేస్తున్నట్టు చెప్పారు. అలాగే కలెక్టర్ శేషగిరిబాబు తక్షణ సహాయం కింద ఆర్డీవో చిన్నికృష్ణ ద్వారా రూ. 25 వేలు మోక్షిత కుటుంబసభ్యులకు అందచేశారు. కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే చిన్నారులను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించే వరకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రతి క్షణం సహాయక చర్యలను పర్యవేక్షించారు. మోక్షిత మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే బోరుబావులను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. -
బిస్కెట్ అందుకోబోయి..
నల్లగొండ, మోత్కూరు (తుంగతుర్తి) : బుడి బుడి అడుగులు.. ముద్దు.. ముద్దు మాటలతో నవ్వులొలికించే ఆ చిన్నా రి కాసేపట్లోనే కానరాని లోకాలకు వెళ్లిపోయి తల్లిదండ్రికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన మోత్కూరు మండలం ధర్మాపురంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రావుల సత్తయ్య–కమలమ్మ కూతురు హేమలత డెలవరీకి మూడు మాసాల క్రితం తల్లిగారింటికి వచ్చింది. రెండు రెండు నెలల క్రితం చిన్నారికి జన్మనిచ్చింది. మొదటి కూతురు యేడాదిన్నర చిన్నారి రిశ్విత ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా అమ్మమ్మ ఇంటిలోపల పనుల్లో ఉన్నారు. రిశ్విత ఆడుకుంటున్న సమయంలో తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చిన్నారి రిశ్విత పడి అక్కడికక్కడే మృతిచెందింది. కాసేపటి తర్వాత చిన్నారి గురించి ఆరా తీయగా నీటి సంపులో విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. చిన్నారి తల్లిదండ్రులు హేమలత–మల్లేష్, అమ్మమ్మ–తాత కమలమ్మ, సత్తయ్యలు రోదనలు మిన్నంటాయి. -
భుజంపై కూతురి శవంతో 4 కి.మీ!
-
భుజంపై కూతురి శవంతో 4 కి.మీ!
పట్నా: బిహార్‌లో మరో దారుణం. పట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఓపీ కార్డు కావాలంటే క్యూలైన్లోనే రావాలని అధికారులు చెప్పడంతో ఆ కార్డు తెచ్చేలోగా ఓ చిన్నారి(9) ప్రాణాలు కోల్పోయింది. చివరికి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ అంబులెన్స్ ఇవ్వడానికి కూడా ఆస్పత్రి సిబ్బందికి మనసొప్పలేదు. దీంతో వేరే గతిలేక ఆ తండ్రి తన కుమార్తె శవాన్ని 4 కిలోమీటర్ల పాటు భుజాన మోసుకుంటూ వెళ్లాడు. బిహార్‌లోని లక్షిసరై జిల్లా కజ్రా గ్రామానికి చెందిన రామ్ బాలక్ దంపతుల కుమార్తె రౌషణ్ కుమారి ఆరు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఎయిమ్స్ ఆస్పత్రికి తెచ్చారు. అక్కడి సిబ్బంది తొలుత ఔట్ పేషంట్(ఓపీ)కార్డు తేవాలని చెప్పారు. నిరుపేద కూలి అయిన రామ్ బాలక్ ఓపీ కార్డు కోసం యత్నిస్తుండగా.. కుమార్తె పరిస్థితి తీవ్రంగా ఉందని అతని భార్య తెలిపింది. దీంతో వెంటనే తనకు ఓపీ కార్డు మంజూరు చేయాలనీ, తన చిన్నారి పరిస్థితి తీవ్రంగా ఉందని కౌంటర్లో ఉన్న అధికారిని అభ్యర్థించారు. తనను ముందుకు వెళ్లనివ్వాలని లైన్లో ఉన్నవారిని వేడుకున్నారు. అయితే ఓపీ కార్డులిచ్చే ఆయన ససేమిరా అన్నారు.చివరికి ఓపీ కార్డు తీసుకుని వచ్చేసరికి రోషణ్ కుమారి ప్రాణాలు కోల్పోయింది. దీనికి తోడు చనిపోయిన కుమార్తె శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కనీసం అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరిన రామ్‌బాలక్ విన్నపాన్నీ ఎయిమ్స్ అధికారులు తిరస్కరించారు. ప్రైవేటు వాహనం ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడంతో, రామ్ బాలక్ కూతురి శవాన్ని భుజాన వేసుకుని 4 కి.మీ. నడిచివెళ్లారు. -
బోరు మింగేసింది..
బోరుబావిలో పడిన చిన్నారి మృతి ► మూడు రోజుల శ్రమకు దక్కని ఫలితం.. బయటపడని మృతదేహం ► ఎయిర్ ఫ్లషింగ్ ప్రక్రియతో దుస్తులు, పలు అవయవ అవశేషాలు బయటకు ► చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి..తల్లిదండ్రులకు అప్పగింత ► వికారాబాద్ జిల్లాలోని గోరేపల్లి గ్రామంలో ముగిసిన అంత్యక్రియలు చేవెళ్ల/మొయినాబాద్/యాలాల: జరగరానిదే జరిగిపోయింది. నోరు తెరిచిన బోరుబావికి మరో చిన్ని ప్రాణం బలైపోయింది. తల్లిదం డ్రులకు అంతులేని ఆవేదన మిగులుస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెల్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరుబా విలో పడిపోయిన చిన్నారి (18 నెలలు) మృతి చెందింది. పాపను కాపాడేందుకు అధికార యంత్రాంగం దాదాపు 60 గంటలపాటు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు ఎయిర్ ఫ్లషింగ్ చేయడంతో ఆదివారం ఉదయం చిన్నారి దుస్తులు, కొన్ని అవయవాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఫ్లషింగ్ సమయంలో దుర్వాసన సైతం వచ్చింది. దీంతో చిన్నారి మృతి చెందినట్లు సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం చిన్నారి అవశేషాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి స్వగ్రామమైన వికారాబాద్ జిల్లాలోని గోరేపల్లిలో అంత్యక్రియలు జరిగాయి. ఆశలు వదులుకొని... బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ కను గొనేందుకు ముంబై నుంచి తెప్పించిన అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్ ప్రూఫ్ కెమె రాను బోరుబావిలోకి వదిలి అన్వేషించారు. 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించే ఈ కెమెరాతో 210 అడుగుల లోతు వరకు చూసినా పాప ఆనవాళ్లు కనిపించలేదు. దీం తో శనివారం అర్ధరాత్రి అధికార యంత్రాం గం పాపపై ఆశలు వదులుకొని చివరి ప్రయ త్నం చేయాలని నిర్ణయించింది. పాప బోరు బావిలో పడినప్పుడు 40 అడుగుల లోతులోనే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం బోరు మోటర్‌ను బలంగా బయటకు తీయడంతో అక్కడే అంచులకు పాప అతుక్కుపోయి ఉంటుందని... 40 అడుగుల కిందకు బోర్వెల్ డయా 6 అంగుళాలే ఉంటుందని.. పాప లోపలికి పడిపోయే అవకాశం ఉండదని బోర్‌వెల్స్ యజమాని, మాజీ ఎమ్మెల్యే కిచ్చ న్నగారి లక్ష్మారెడ్డి అధికారులకు చెప్పారు. దీంతో 50 అడుగుల లోతులో బోరును బ్లాక్ చేసి పైనుంచి తవ్వకాలు చేపట్టారు. 40 అడు గుల వరకు బోరుబావిని పూర్తిగా పెకిలించి పాపను బయటకు తీయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజాము వరకు 32 అడుగుల వరకు తవ్వకాలు జరిపారు. సీసీ కెమెరాలతో మరోసారి అన్వేషించి... బోరుబావిని 32 అడుగుల లోతు వరకు పూర్తిగా తవ్విన క్రమంలో మెదక్ జిల్లాకు చెందిన బోర్ మెకానిక్ శ్రీనివాస్ తన వద్ద ఉన్న పరికరాలతో అక్కడికి చేరుకున్నారు. అధికారులు తవ్వకాలు నిలిపేసి అతనికి అవకాశం ఇవ్వడంతో 180 అడుగుల లోతు వరకు సీసీ కెమెరాలను పంపి చూశారు. పాప ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బోర్వెల్ పైపును 260 అడుగుల లోతు వరకు దింపి ఎయిర్ ఫ్లషింగ్ చేశారు. ఈ క్రమంలో బోరులోంచి నీళ్లతోపాటు చిన్నారి బట్టలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత పాప అవయవాలకు సంబంధించి కొన్ని అవశేషాలు బయటకు రాగా వాటిని బకెట్లో వేసుకొని బయటకు తీశారు. ప్రయత్నం ఫలించలేదు: మహేందర్‌రెడ్డి బోరుబావిలో పడిన చిన్నారిని బతికించాలని మూడు రోజులపాటు ప్రయత్నించినా సాధ్యంకాలేదని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పాప శరీర అవశేషాలు బోరుబావిలో నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాప మొదట్లో 40 అడుగుల లోతులో మోటర్‌పై ఉందని... మోటర్‌ను బయటకు తీయడంతో మరింత దిగువకు పడిపోయిందన్నారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కాగా, బోరుబావిలో పడిన చిన్నారిలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి కదలికలు లేవని నిర్ధారణకు వచ్చాకే మోటర్‌ను బయటకు లాగామని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. చిన్నారికి కన్నీటి వీడ్కోలు బోరుబావిలో పడి మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారికి వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోరేపల్లి గ్రామంలో ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తు లు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉదయం 9.05 గంటలకు అంబులెన్సులోంచి చిన్నారి అవశేషాలున్న పెట్టెను గ్రామానికి తీసుకురాగా తల్లిదండ్రులు యాదయ్య, రేణుక దంపతులతోపాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దపెట్టున రోదించారు. అనంతరం 10.15 గంటలకు చిన్నారిని ఖననం చేశారు. -
కారులో ప్రాణం వదిలిన పసివాడు
హెలోటెస్: తండ్రి నిర్లక్ష్యం కారణంగా 7 నెలల పసిబాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటు చేసుకుంది. హాట్ స్పోర్ట్ యూటిలిటీ వెహికిల్(ఎస్ యూవీ) చిన్నారిని రోజంతా వదిలివేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. శాన్ అంటోరియాలోని వాల్ మార్ట్ పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. హెలోటెస్ సబర్బన్ లోని స్టోర్ లో బాలుడి తండ్రి పనిచేస్తున్నాడు. తన కొడుకును డేర్ కేర్ సెంటర్ లో వదిలిపెట్టడం మర్చిపోయి కారులోనే వదిలేశాడు. ఉదయం 6.15 గంటలకు విధులకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగొచ్చాడు. కారులో అపస్మారక స్థితిలో పడివున్న కొడుకును గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కారులో ఉష్టోగ్రత కనీసం 100 డిగ్రీలు ఉంటుంది. హాట్ కారుల్లో చిన్నారుల మరణాలు అమెరికాలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 27 మంది పిల్లలు మృతి చెందారు. టెక్సాస్ లోనే ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని కిడ్స్ అండ్ కార్స్.ఓఆర్జీ వ్యవస్థాపకుడు జనెటీ ఫెనెల్ తెలిపారు. -
కూతురిని కొట్టి చంపిన కన్నతండ్రి
ఆడపిల్లి పుట్టిందన్న కోపంతో.. 15 రోజుల వయసున్న తన కన్నకూతురిని కొట్టి చంపాడో తండ్రి. ఈ సంఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలోగల ఓ గ్రామంలో జరిగింది. రాజు యు ఠాక్రే అనే ఆ తండ్రి తన భార్య మీనాబెన్ ఠాక్రేతో గొడవ పడి, పల్సానా తాలూకా పరిధిలోని చల్తాన్ గ్రామంలోగల తమ ఇంట్లోనే కూతురిని ఇష్టారాజ్యంగా కొట్టాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడుకు కావాలంటూ ఎప్పుడూ చెప్పే ఠాక్రే, కూతురు పుట్టడంతో గత పదిహేను రోజులుగా భార్యతో గొడవ పడుతూనే ఉన్నాడు. చివరకు కూతురిని తలపై కొట్టడంతో ఆ చిన్నారి కాస్తా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో అతడు ఇంట్లోంచి పారిపోయాడు. అతడి కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో ఇంటికి తిరిగొచ్చిన తల్లి ఇంట్లో చూసేసరికి.. కూతురు నిర్జీవంగా పడి ఉంది.