కారులో ప్రాణం వదిలిన పసివాడు | Baby found dead after being left all day in hot SUV in Texas | Sakshi
Sakshi News home page

కారులో ప్రాణం వదిలిన పసివాడు

Published Sat, Aug 13 2016 1:00 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

కారులో ప్రాణం వదిలిన పసివాడు

కారులో ప్రాణం వదిలిన పసివాడు

హెలోటెస్: తండ్రి నిర్లక్ష్యం కారణంగా 7 నెలల పసిబాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటు చేసుకుంది. హాట్ స్పోర్ట్ యూటిలిటీ వెహికిల్(ఎస్ యూవీ) చిన్నారిని రోజంతా వదిలివేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. శాన్ అంటోరియాలోని వాల్ మార్ట్ పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. హెలోటెస్ సబర్బన్ లోని స్టోర్ లో బాలుడి తండ్రి పనిచేస్తున్నాడు. తన కొడుకును డేర్ కేర్ సెంటర్ లో వదిలిపెట్టడం మర్చిపోయి కారులోనే వదిలేశాడు.

ఉదయం 6.15 గంటలకు విధులకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగొచ్చాడు. కారులో అపస్మారక స్థితిలో పడివున్న కొడుకును గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కారులో ఉష్టోగ్రత కనీసం 100 డిగ్రీలు ఉంటుంది. హాట్ కారుల్లో చిన్నారుల మరణాలు అమెరికాలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 27 మంది పిల్లలు మృతి చెందారు. టెక్సాస్ లోనే ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని కిడ్స్ అండ్ కార్స్.ఓఆర్జీ వ్యవస్థాపకుడు జనెటీ ఫెనెల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement