
బదౌన్: జబ్బుతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. అక్కడ డాక్టర్ లేడు. ఈలోపే ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి! మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లేదు.. ఆటోవాడూ రానన్నాడు.. చేసేదేమీలేక భార్య శవాన్ని భుజాలపై మోస్తూ కిలోమీటర్ల దూరం నడిచివెళ్లాడు.. గుండెలు పిండేసే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటుచేసుకుంది.
బదౌన్ జిల్లా ఆస్పత్రి నుంచి భార్య మృతదేహంతో బాధితుడు వెళుతున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, ఎందుకు జరిగిందో దర్యాప్తు చేస్తామని బదౌన్ వైద్యాధికారి అన్నారు. కాగా, జిల్లా ఆస్పత్రిలో మృతదేహాలను తీసుకెళ్లేందుకు రెండు వ్యాన్‌లు ఉన్నాయని తెలిపారు. అయితే బాధితుడు మాత్రం అక్కడ ఏర్పాట్లేవీ లేవని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment