wife dead body
-
కరోనా భయం: భార్య మృతదేహాన్ని మోసుకొని 3 కిలోమీటర్లు..
సాక్షి, నిజామాబాద్: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అదే స్థాయిలో మనుషుల్లో మానవత్వం రోజురోజుకు దిగజారుతోంది. సాటి మనిషికి సాయం చేయాలనే భావన కూడా లోపిస్తోంది. తాజాగా కామారెడ్డి రైల్వే స్టేషన్లో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో నాగలక్ష్మి అనే ఓ యాచకురాలు మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు సహాయం చేయలని మృతురాలి భర్త స్వామి స్థానికులను ప్రాధేయపడ్డాడు. అయితే ఆమె కరోనాతో మృతి చెందిందనే అనుమానంతో స్థానికులు ఒక్కరు కూడా మృతదేహం వెళ్లలేదు. దీంతో ఆటోలో తన భార్య మృతదేహన్ని తరలించాలని ఆటో డ్రైవర్లను కూడా స్వామి ప్రాధేయపడగా వారు కూడా నిరాకరించారు. దిక్కుతోచని స్వామి భార్య మృతదేహాన్ని స్వయంగా తన భుజాన వేసుకుని మూడున్నర కిలోమీటర్ల దూరం ఉన్న శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించాడు. మార్గమధ్యలో మృతదేహంతో తనకు సాయం అందించాలని రోడ్డు మీద జనాలను అర్థించాడు. అయినా ఎవరూ కనికరం చూపించలేదు. ఈ ఘటన తెలుసుకున్న రైల్వే పోలీసులు, కొంత మంది స్థానికులు కలిసి 2500 రూపాయలను అంత్యక్రియల నిమిత్తం నాగలక్ష్మి భర్త స్వామికి అందజేశారు. చదవండి: మమ అన్నట్టు మాస్కు ధరిస్తే కోవిడ్‌కు స్వాగతం పలికినట్టే! -
గుండెలు పిండేసే ఘటన..
బదౌన్: జబ్బుతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. అక్కడ డాక్టర్ లేడు. ఈలోపే ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి! మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లేదు.. ఆటోవాడూ రానన్నాడు.. చేసేదేమీలేక భార్య శవాన్ని భుజాలపై మోస్తూ కిలోమీటర్ల దూరం నడిచివెళ్లాడు.. గుండెలు పిండేసే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటుచేసుకుంది. బదౌన్ జిల్లా ఆస్పత్రి నుంచి భార్య మృతదేహంతో బాధితుడు వెళుతున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, ఎందుకు జరిగిందో దర్యాప్తు చేస్తామని బదౌన్ వైద్యాధికారి అన్నారు. కాగా, జిల్లా ఆస్పత్రిలో మృతదేహాలను తీసుకెళ్లేందుకు రెండు వ్యాన్లు ఉన్నాయని తెలిపారు. అయితే బాధితుడు మాత్రం అక్కడ ఏర్పాట్లేవీ లేవని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
భార్య శవాన్ని భుజాలపై మోస్తూ..!
-
భార్య శవాన్ని తోపుడు బండిపై తోసుకుంటూ..
లక్నో: మానవత్వం మసకబారుతోంది. డబ్బుకు ఉన్న పాటి విలువ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది. ఒడిస్సాలో కొన్ని నెలల కిందట అంబులెన్స్‌కు డబ్బు చెల్లించే స్తోమత లేక ఓ వ్యక్తి తన భార్య శవాన్ని తన భుజంపై మోసుకుని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లటం అప్పట్లో అందరి మనసులను కదిలించింది. ఆ ఘటన మరవక ముందే అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషాదంలో ఒకవైపు అంబులెన్స్ సిబ్బంది చేసిన ఆలస్యం నిండు ప్రాణాలు తీస్తే.. మరోవైపు వైద్యుల కర్కశత్వం కట్టుకున్న భార్య శవాన్ని కిలోమీటర్ల దూరానికి తోపుడు బండిలో తోసుకుంటూ తీసుకెళ్లేలా చేసింది. మంగళవారం నాడు మెయిన్‌పురి జిల్లాకు చెందిన 36 ఏళ్ల కన్హయ్యలాల్ తన భార్య సోనీ అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. గంటలు గడిచిన అంబులెన్స్ రాకపోవడంతో భార్యను తోపుడు బండిపై తోసుకుంటూ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్‌పురి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయిందని చెప్పడంతో ఒక్క సారిగా కప్పకూలాడు కన్హయ్య. గుండె దిటవు చేసుకొని భార్య శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరినప్పటికి ఆస్పత్రి వర్గాలు అందుకు ఒప్పుకోలేదు. దినసరి కూలీగా పనిచేస్తున్న అతను చేసేదేమీ లేక భార్య శవాన్ని గుడ్డలతో చుట్టి తోపుడు బండిపై తోసుకుంటూ వెళ్లాడు. ఈ దృశాన్ని చూసిన అక్కడి ప్రజల కళ్లు చెమ్మగిల్లాయి వారు ఆస్పత్రి వర్గాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై యూపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ త్రివేది స్పందిస్తూ.. 108 అంబులెన్స్ నెంబర్‌కు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. కన్హయ్య చాలా పేదవాడు అతని దగ్గర ఫోన్ చేసేందుకు మొబైల్ కూడా లేదన్నారు. ఒకవేళ ఫోన్ చేసినా ఆస్పత్రికో లేదా వేరొక నెంబర్‌కో ఫోన్ చేసి ఉంటారని తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
కలహండి : సరిగ్గా ఏడాది క్రితం ఓ వ్యక్తి చనిపోయిన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కూతురితో కలిసి 10 కిలో మీటర్లు పైగా నడిచిన ఒడిశా వ్యక్తి కథనం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆంబులెన్స్‌ను నిరాకరించగా.. దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబ పెద్ద దనా మాఝీ అలా చేశాడంటూ చెప్పుకున్నాం. కానీ, అదే దనా మాఝీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీస్తే విస్తూ పోవాల్సిందే. మళ్లీ పెళ్లి చేసుకున్న ఆయన ప్రధాన మంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన కింద ఓ ఇంటిని కట్టేసుకున్నాడు. పలువురు దాతలు అందించిన సహకారంతో ఇప్పుడు అతని ఆర్థిక స్థితి బాగానే ఉంది. అందులో బహ్రైన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీపా అందించిన 9 లక్షల సాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేని అతను ఫిక్స్డ్ డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేశాడు. భువనేశ్వర్‌లో అతని ముగ్గురి కూతుళ్లకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందిస్తోంది. గతేడాది ఆగష్టు లో అతని ఉదంతం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 16 నెలల తర్వాత తన భార్య శవంతో నడిచిన అదే రోడ్డుపై 65 వేలు పెట్టి బైక్‌ను కొని నడిపి మరోసారి ధనా మాఝీ వార్తల్లోకెక్కాడు. మొత్తానికి ఆ ఘటన తన లైఫ్‌ను మార్చేసి లక్షాధికారిని చేసిందంటూ మాఝీ ఆనందంగా చెబుతున్నాడు. -
భార్యని చంపి సముద్రతీరంలో పూడ్చి పెట్టాడు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాతతో భార్యను భర్త తాతారావు హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని కాకినాడ సముద్రతీరంలో పూడ్చి పెట్టాడు. అయితే తమ కుమార్తె ఆచూకీ తెలియడం లేదని మృతిరాలి బంధువులు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో తాతారావును పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను తానే హత్య చేసినట్లు తాతారావు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.