న్యూఢిల్లీ : మొగల్ చక్రవర్తుల కాలం నాటి పేర్లెందుకని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్ అని, ఫైజాబాద్‌ను అయోధ్య అని మార్చారు. తాజాగా ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన ఖాన్ మార్కెట్‌ను కూడా ఆ జాబితాలో చేర్చాలని ఓ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఓ వ్యక్తి లేఖ రాశారు. ఖాన్ మార్కెట్‌కు వాల్మీకీ మార్కెట్ అని పేరు మార్చాలని ఢిల్లీకి చెందిన కోరుతూ దీపక్ తన్వర్ విజ్ఞప్తి చేశారు. ‘ఇటీవల ప్రధాని మోదీ ఇంటర్వ్యూ చూశాను. అందులో ఇప్పుడున్న ఖాన్ మార్కెట్ విశేషాలు, చారిత్రక అంశాలు ఆయన వివరించారు. అందుకే దానికి ఖాన్ మార్కెట్ బదులు.. వాల్మీకి మార్కెట్ అని ఉంటే బాగుంటుందనిపించింది. అందుకే రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకొచ్చా’ అని దీపక్ చెప్పుకొచ్చారు.
(చదవండి : పేరు మారనున్న మరో నగరం..!)
వాల్మీకి మార్కెట్ అని పేరు మార్చితే.. మన చారిత్రక విశేషాలకు ప్రాచుర్యం కల్పించినట్టువుందని అతను వివరించాడు. ఢిల్లీ నడిబొడ్డున, ఇండియాగేట్ ప్రాంతంలో ఉన్న ఖాన్ మార్కెట్ 1951లో ఏర్పడింది. స్వాతంత్ర సమరయోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గౌరవార్థం ఖాన్ మార్కెట్ గా స్థిరపడింది. చారిత్రకంగా ప్రాధాన్యం కలిగిన సుల్తాన్‌పూర్ పేరును.. కుష్‌భావన్‌పూర్‌గా మార్చాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సూచించిన సంగతి తెలిసిందే. ఇక ముస్లిం రాజులు, ప్రముఖ వ్యక్తుల పేరుతో ఉన్న పలు పురాతన కట్టడాలు, నగరాల పేర్లు మార్చుతున్న బీజేపీ తమ హిందుత్వ అజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఓటు బ్యాంకు కోసం బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment